Madhuranagarilo July 28th: ఫస్ట్ నైట్ గదిని ఏర్పాటు చేయించి శిరోజా ను అందంగా రెడీ చేస్తుంది వాసంతి. ఇక కొన్ని సలహాలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భర్త రాక కోసం శిరోజా తెగ ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ విల్సన్ తాగి వచ్చి ఏవేవో మాట్లాడుతూ రేప్ చేస్తానని చెప్పి మంచం మీద తూలి పడతాడు.


మరోవైపు రాధ దగ్గరికి శ్యామ్ వచ్చి నీకు పెళ్లి కాలేదన్న అనుమానం నాకు చాలా ఉంది అంటూ.. గతంలో పూజారి నిన్ను దీవించినప్పుడు నీకు పెళ్లి కాలేదని అనుమానం వచ్చింది. ఇక పసుపు కొట్టేటప్పుడు తప్పించుకోవడానికి చేతికి గాయం చెప్పి మరోసారి తప్పించుకోవటంతో అప్పుడు కూడా నీకు పెళ్లి కాలేదని అనుమానం మరింత బలంగా ఏర్పడిందని.. కోయదొర వేషంలో వచ్చినప్పుడు నీ భర్త అనకుండా పండు తండ్రి అన్నప్పుడు కూడా అనుమానం వచ్చిందని.. ఇక్కడే చుట్టుపక్కలో ఉన్న నీ భర్తను నువ్వే గుర్తుపట్టలేను అని అనేసరికి కూడా పెళ్లి కాలేదని నమ్మకం పెరిగిపోయిందని..  ఇక పెళ్లి నాటకం ఆడినప్పుడు కూడా నీ భర్త రాలేదంటే నీకు నిజంగానే పెళ్లి కాలేదు కదా అని అంటాడు.


దాంతో రాధ మౌనంగా ఉండటంతో వెంటనే పండు దగ్గరికి తీసుకెళ్లి పండు మీద ఒట్టు వేయించి నీకు నిజంగా పెళ్లి కాలేదనే విషయం పండు మీద ఒట్టేసి చెప్పమని అంటాడు. నేను చెప్పిందంతా నిజం నువ్వు చెప్పేవన్నీ అబద్ధం అని ఒట్టు వేయని అంటాడు. దాంతో రాధ పండు మీద ప్రమాణం చేసి తనకు నిజంగానే పెళ్లి జరగలేదు అని అనటంతో వెంటనే శ్యామ్ నీకు పెళ్లి కాలేదు కాబట్టి నేను ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు.


ఎవరో ఎందుకు నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని తాళిబొట్టు తీసి తన మెడలో కడతాడు. అంతేకాకుండా పండు ని ఎత్తుకొని పండు కి నేనే తండ్రిని అంటాడు. ఇక రాధ తాళిబొట్టు చూసుకుంటూ ఉంటుంది. అయితే ఇదంతా సంయుక్త కలగంటుంది. వెంటనే లేచి అరుస్తుంది. పక్కనే ఉన్న తన తల్లి ఏం జరిగింది అని అడగటంతో శ్యామ్ రాధ దగ్గరికి వెళ్లి తాళి కట్టినట్లు పీడకల వచ్చింది అని చెప్పటంతో అపర్ణ భయపడకు అని ధైర్యం ఇస్తుంది.


తనకు శ్యామ్ తో పెళ్లయ్యే వరకు ఈ టెన్షన్స్ తప్పవని.. ఎలాగైనా వారిద్దరిని దూరం చేయాలని తన దగ్గర ఒక ప్లాన్ ఉందని ఆ ప్లాన్ చెప్పేస్తుంది. ఇక ఆ ప్లాన్ కి అపర్ణ కూడా ఓకే అంటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే గన్నవరం కు వాసంతి సంతోషంగా టిఫిన్ ఇస్తుంది. ఇక ఇంత సంతోషానికి కారణం ఏంటి అని గన్నవరం అడగటంతో ఇన్ని రోజులు భర్తను దూరం పెట్టిన శిరోజా వాళ్లకు రాత్రి శోభనం జరిగింది అని అనటంతో గన్నవరం షాక్ అవుతాడు.


అప్పుడే విల్సన్ అక్కడికి వచ్చి తన శోభనం పాడు చేసింది వీడే అని.. తన ప్లాన్ మొత్తం పోయింది అని గన్నవరంను కొడతాడు. ఇక వాళ్ళ ప్లాన్ అలా పాడు చేసినందుకు వాసంతి కూడా గన్నవరం ను బాగా చితక్కొడుతుంది. ఇక రాధ ఇంటికి తన ఫ్రెండ్ వచ్చి నువ్వు నిజంగానే శ్యామ్ ని ప్రేమిస్తున్నావు.. లేదంటే ముద్దు పెట్టే విషయం గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తావు.. పైగా ఈ విషయం గురించి నన్ను పిలిచి మరీ చెబుతున్నావు అని అనడంతో అటువంటిదేమీ లేదు అని రాధ అంటుంది. తర్వాత రాధ కాస్త ఆలోచనలో పడినట్లు కనిపిస్తుంది


also read it:  Janaki Kalaganaledhu July 27th: ‘జానకి కలగనలేదు’ సీరియల్ : ఐపీఎస్ గా ఇంట్లోకి వచ్చిన మొదటి రోజే కోడలికి కండిషన్ పెట్టిన జ్ఞానంబ.. బాధలో గోవిందరాజులు?


Join Us on Telegram:  https://t.me/abpdesamofficial