Janaki Kalaganaledhu July 27th: జానకితో ఎమ్మెల్యే ఈరోజు రాత్రికి సన్మానం చేస్తామని చెప్పటంతో జానకి తనకు అటువంటివి నచ్చవు అని అంటుంది. దాంతో ఆ ఎమ్మెల్యే ఈరోజుల్లో పిలిచి వారి సన్మానం చేయించుకునే వాళ్ళు ఉన్నారు.. అటువంటిది నువ్వు వద్దంటున్నావ్ ఏంటి అని అనటంతో.. తనకు ఇలా చేయించుకోవడం నచ్చదని అంటుంది.


దాంతో ఎమ్మెల్యే జ్ఞానంబతో మీ కోడల్ని ఒప్పించే బాధ్యత మీదే అని.. తనను మీరే తీసుకొని రావాలి అని అనడంతో దానికి సరే అంటుంది. పక్కనే ఉన్న మల్లిక మీరిచ్చిన సపోర్టుతో ఐపీఎస్ అయిన జానకి మీరు పిలిచినప్పుడు రాకపోతే మీ మాటకు విలువ ఇవ్వటం లేదని అందరూ అనుకుంటారు అని అంటుంది. వెంటనే ఎమ్మెల్యే కరెక్ట్ చెప్పావమ్మా అంటూ.. కానీ నువ్వు మాత్రం రాజకీయాలలోకి రాకు అని మాలాంటి వాళ్ళం అడ్రస్ లేకుండా పోతాం అనటంతో అందరూ నవ్వుకుంటారు.


ఇక అందరు ఇంట్లోకి వెళ్లగా డోర్ దగ్గర నిలబడి ఉన్న వెన్నెల రామదంపతులపై పువ్వులు చల్లుతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ జానకిని పొగుడుతూ ఉంటారు. వెంటనే వెన్నెల అదేంటి అన్నయ్య జానకి గారు వస్తున్నారంట నిన్నటి వరకు గోల చేసి ఇప్పుడు ఏంటి అలా పక్కకు ఉన్నావ్ అని అంటుంది. ఇక లోపలికి వస్తున్న సమయంలో జ్ఞానంబ ఆపి గుమ్మడి కాయ తో దిష్టి తీస్తుంది.


ఇక అక్కడే ఉన్నాను నీలావతి రామని ఎందుకు వెనక్కి నిలబడ్డావ్ దూరంగా అని అంటాడు. మీ భార్య పక్కన వచ్చి దిష్టి తీయించుకో అని అనటంతో.. నాకెందుకు కష్టపడి నా భార్య ఐపీఎస్ అయ్యింది కదా అని తనకు దిష్టి తీయాలి అని అంటాడు. అలా కాదు పొద్దటి నుంచి నిన్ను ఐపీఎస్ భార్య అని ఎంతమంది అన్నారు ఎంతలా దిష్టి తగిలింది అనటంతో జ్ఞానంబ ఫేస్ మరోలా పెడుతుంది.


ఇక రామ జానకి పక్కకు వచ్చి నిలబడగా జానకి ఈ కష్టంలో సగం మీదే అని భర్తను పొగుడుతుంది.  ఇక మల్లికా కూడా హారతి పళ్ళం తీసుకోని రావటంతో గోవిందరాజులు ఆశ్చర్యపోతాడు. గోవిందరాజులు ఇక లోపలికి రండి అని అనటంతో జ్ఞానంబ ఆపుతుంది. జానకి తో మాట్లాడాలని అనడంతో లోపలికి వచ్చి మాట్లాడొచ్చు కదా అని అందరూ అంటారు. కానీ ఇప్పుడే ఇక్కడే మాట్లాడాలి అని అంటుంది.


తను గడప దాటక ముందే మాట్లాడాలి అనటంతో జానకి చెప్పండంటుంది. తన కోడలు ఐపీఎస్ అయినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని.. గతంలో కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు కూడా చాలా సంతోషంగా వేసిందని కానీ ఆ సమయంలో నీతో పాటు అందరూ కూడా చాలా కష్టాలు పడ్డారు అని అంటుంది. గతంలో జరిగిన అనుభవంతోనే చెబుతున్నాను.. మన కుటుంబం ఎప్పటికీ దూరం కావొద్దు అని చెబుతున్నాను అంటూ ఇంట్లోకి అడుగుపెట్టేముందు నీ ఐపిఎస్ టోపీని తీసి రావాలి అని కండిషన్ పెడుతుంది.


దానికి జానకి కూడా కాసేపు ఆలోచించి సరే అని అంటుంది. కానీ ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. మల్లికకు మాత్రం తెగ సంతోషం వేస్తుంది. ఇక అందరూ ఇంట్లోకి చేరుకోగా.. గోవిందరాజులు జరిగింది తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అక్కడికి జ్ఞానంబ ఏం జరిగింది అనటంతో జానకి విషయంలో నువ్వు అలా కండిషన్ పెట్టడం కరెక్ట్ కాదు అని అంటాడు.. కానీ జ్ఞానంబ తను ఏది చేసినా అంత కరెక్టే చేస్తాను అని అంటూ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటుంది.


also read it : Trinayani July 27th: ‘త్రినయని’ సీరియల్: తిలోత్తమా మరోసారి కొట్టిన షాక్.. నయని ఇచ్చిన కుండను పగలగొట్టిన సుమన


Join Us on Telegram: https://t.me/abpdesamofficial