Bigg Boss 7: తెలుగు బుల్లితెరపై ‘బిగ్ బాస్’ షో ఎలాంటి పాపులారిటీ తెచ్చుకుందో. రియాలిటీ షో పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘బిగ్ బాస్’ ప్రోగ్రాంనే. అంతలా ఈ కార్యక్రమంలో ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పటికే ఈ షో తెలుగులో ఆరు సీజన్ లనున కంప్లీట్ చేసుకొని ఏడో సీజన్ కు రెడీగా ఉంది. ఈ షో కు నాలుగు సీజన్లుగా హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ఈసారి కూడా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇటీవలే ఈ సీజన్ కు సంబంధించిన టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ‘బిగ్ బాస్’ సీజన్ 7 కు కోర్ట్ నోటీసుల రూపంలో కొత్త చిక్కు వచ్చి పడింది. దీంతో ఈ షో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  


అసలేం జరిగిందంటే..


గతంలో ‘బిగ్ బాస్’ షో అంటే కరెక్ట్ గా ఆ సమయానికి ఇంటిళ్లపాది టీవీల ముందుకు వచ్చి కూర్చొని సరదాగా ప్రోగ్రాంను ఎంజాయ్ చేసేవారు. అయితే బిగ్ బాస్ షో మొదట కొన్ని ఎపిసోడ్లు బానే ఉన్నా తర్వాత నుంచీ షో లో కంటెంట్ తక్కువై, విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా షో రేటింగ్ కోసం షో లో కంటెంట్ కంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్, అశ్లీల సన్నివేశాలు ఎక్కువగా ఉంటున్నాయని విమర్శలు మొదలైయ్యాయి. కొంతమంది ప్రముఖులు బహిరంగంగానే విమర్శలు చేశారు. ముఖ్యంగా సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ఈ షోను మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఈ షో చూడటం వలన పిల్లలు, యువత చెడిపోతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. అయితే తాజాగా ‘బిగ్ బాస్’ షోలో అశ్లీలత, అసభ్యత సన్నివేశాలు ఎక్కువయ్యాయని పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హై కోర్టు షోను తాత్కాలికంగా నిలిపేయాలని ఆదేశించింది.  


నాగార్జునకు నోటీసులు ఇచ్చిన కోర్టు..


‘బిగ్ బాస్’ షో పై సీపీఐ నారాయణ వేసిన పిటిషన్ ను కోర్ట్ విచారించింది. ఈ మేరకు హోస్ట్ గా చేస్తున్న నాగార్జునకు అలాగే సదరు చానల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. సీపీఐ నారాయణ వేసిన పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను మరో నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఇప్పుడు ‘బిగ్ బాస్’ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ షో కు ఇలాంటి నోటీసులు గతంలో కూడా వచ్చాయి. కానీ ఈసారి అయితే షో లను మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా కంటిన్యూ చేశారు. కానీ ఈసారి కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేయడంతో అప్పుడు ఏమని తీర్పు చెబుతుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి ‘బిగ్ బాస్’ సీజన్ 7 జరుగుతుందా లేదా అనేది కోర్ట్ తీర్పుపై ఆధారపడి ఉంది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి..


Also read: మన సినిమా బాగుందని ఎవరినో కించపరచకూడదు - ఆ దర్శకుడికి మరోసారి చురకలంటించిన విశ్వక్ సేన్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial