Madhuranagarilo June 21th: గోపాల్ రాధ దగ్గరికి వచ్చి తనకు ఒక సంబంధం చూడమని తెగ సిగ్గుపడుతూ ఉండగా అప్పుడే నెల్సన్ వచ్చి నేను నీకు సంబంధం చూస్తానులే అని గోపాల్ కు చెప్పి రాధను అక్కడి నుంచి పంపిస్తాడు. మరోవైపు అపర్ణ మంగళసూత్రం తీసుకోవడానికి అని జ్యువెలరీ షాప్ దగ్గర వచ్చి నిలబడి మధుర వాళ్ళ కోసం ఎదురుచూస్తుంది.


అప్పుడే మధుర, రాధ రావటంతో రాధ ని చూసి కోపంతో రగిలిపోతుంది. తన వల్లే తన కూతురు పెళ్లి జరుగుతుందో లేదో అన్న అనుమానంతో ఉంటుంది. అంతేకాకుండా రాధను ఎందుకు తీసుకొచ్చావు అన్నట్లుగా నొప్పించకుండా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఎలాగైనా మధుర ముందు రాధ ను బ్యాడ్ చేయాలి అని ఫిక్స్ అవుతుంది. ఇక షాప్ లోకి వెళ్లి డిజైన్ చూస్తూ ఉంటారు.


మరోవైపు ఉమా చెత్తను తగలబెడుతూ ఉండగా అక్కడికి గన్నవరం మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో గోపాల్ వచ్చి గన్నవరం 5000 అడుగుతాడు. ఎందుకని అడగటంతో తనకు పెళ్లిచూపులు అని బట్టలు కొనడానికి కావాలి అని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే సంయుక్త వచ్చి పెళ్లి కార్డు ఇస్తుంది.


ఇక పెళ్లి కార్డు చూడడానికి ముగ్గురు పోటీపడుతుండగా కార్డు మంటలో పడుతుంది. దాంతో గన్నవరం ఇదేదో అపశకనం లాగా ఉందని అంటాడు. అంతేకాకుండా అక్కడ సంయుక్త పేరు వరకు మాత్రమే కాలిపోతుంది. దాంతో సంయుక్త అంటే శ్యామ్ తో నా పెళ్లి జరగదా రాధ తో పెళ్లి జరుగుతుందా అని భయపడుతుంది. మరోవైపు అపర్ణ మంగళసూత్రం తీసుకోగా ఇది రాధకు కూడా నచ్చాలి అని రాధకు కూడా చూపిస్తుంది మధుర.


ఇక రాధకు నచ్చడంతో ప్యాక్ చేయిస్తుంది. తర్వాత ముందు చూపించిన బ్రాస్లెట్ చూపించమని అంటుంది అపర్ణ. కానీ అప్పటికే రాధ చున్నీ దగ్గర దాచిపెడుతుంది. ఇక ఆ బ్రాస్లెట్ మిస్ అవ్వటంతో ఆ షాప్ యజమాని వచ్చి వారి ముగ్గురిపై అనుమానం పడతాడు. దాంతో చెక్ చేసుకోండి అని మధుర చెప్పటంతో ఆ బ్రాస్లైట్ రాధ చున్ని దగ్గర దొరుకుతుంది. దాంతో రాధ, మధుర షాక్ అవుతారు.


ఇక అపర్ణ నోటికి వచ్చినట్లు రాధపై అరుస్తుంది. వెంటనే మధుర మా రాధా అటువంటిది కాదు అని తిరిగి ఆ బ్రాస్లెట్ డబ్బులు ఇచ్చి వారి నోరు మూయిస్తుంది. వెంటనే అపర్ణ మధురను పక్కకు తీసుకొని వెళ్లి రాధ గురించి నానా రకాలుగా వాగుతుంది. భర్త ఉన్నాడు లేడో తెలియని దానిని ఇటువంటి శుభం పనులకు తీసుకురాకూడదు అనటంతో మధుర తన స్టైల్ లో అపర్ణకు గట్టి సమాధానం ఇస్తుంది. దాంతో అపర్ణ సైలెంట్ అయిపోతుంది.


గన్నవరం పౌడర్ వేసుకొని నెల్సన్ వాళ్ళ దగ్గరికి రావడంతో.. వెంటనే వాళ్ళు గన్నవరం ని దొంగ అనుకొని చితక్కొడతారు. ఇక తన కోసం అమ్మాయిని తీసుకురమ్మని అనటంతో నెల్సన్ ఒక అమ్మాయిని చూపిస్తాడు. దాంతో కిందపడి గిన్నె కొట్టుకుంటాడు గన్నవరం. అలా అక్కడ కొద్దిసేపు సరదాగా సాగుతుంది.


తర్వాయి భాగంలో శ్యామ్ రాధ కోసం మల్లెపూలు తీసుకొని వస్తాడు. వెంటనే పండు అది అమ్మ తలలు పెట్టమని అంటాడు. దానికి రాధ నిరాకరిస్తుంది. వెంటనే శ్యామ్ ఏమనుకోవద్దు అని అనటంతో ఏమనుకోనులే డాడీ అని పండు షాక్ ఇస్తాడు. దాంతో రాధ షాక్ అవుతుంది.


Also Read: Trinayani June 20th: వల్లభకు కుట్టిన తేనెటీగలు-గాయత్రి పుట్టుమచ్చ చూసి భయపడ్డ తిలోత్తమా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial