Prema Entha Madhuram July 25th: మాన్సీ ఫేక్ ప్రెగ్నెంట్ గురించి ఆడిన నాటకాన్ని కూడా డాక్టర్ ద్వారా బయట పెడతాడు ఆర్య. దాంతో మాన్సీ భయపడిపోతుంది. అంతేకాకుండా తన భార్య ఇంట్లోకించి వెళ్లిపోవటానికి కారణం మాన్సీ అని ఫేక్ జోగమ్మని తీసుకొచ్చి తనతో అబద్ధాలు చెప్పించి తన భార్యను దూరం చేసేలా చేసింది అని అంటాడు భార్య.


ఇక ఆ ఫేక్ జోగమ్మ నాటకాని వేసిన రేణుక బోన్ లోకి వచ్చి మాన్సీ గుట్టు బయట పెడుతుంది. అంతేకాకుండా తన భార్య పుట్టిన రోజు కేకుల్లో విషం కల్పించే ప్రయత్నం తనే చేసిందన్న అనుమానం కూడా ఉంది అని అంటాడు ఆర్య. మా ఫ్యామిలీ విషయంలో ఇన్ని తప్పులు చేసిన తనను నా తమ్ముడు ఎలా భరిస్తాడు అని అంటాడు. వెంటనే మాన్సీ నేను కేకులో విషం కలపలేదు అని అనటంతో అప్పుడే అను సిసి ఫుటేజ్ తీసుకువచ్చి జరిగిన విషయం మొత్తం చెబుతుంది.


ఇక తను టెడ్డీబేర్ వేషంలో వచ్చి విషం కలిపిన విషయాన్ని చెప్పటమే కాకుండా వీడియో ద్వారా చూపిస్తుంది. అంతేకాకుండా టెడ్డీబేర్ వేసుకునే వ్యక్తిని సాక్ష్యం ద్వారా తీసుకొని రాగా అతడు కూడా మాన్సీ చేసిన తప్పు ను చెబుతాడు. ఇక వెంటనే ఆర్య తను ఇన్ని మోసాలు చేసింది అని సాక్షాల ద్వారా బయటపడింది కాబట్టి విడాకులు మంజూరు చేయమని కోరుతాడు.


వెంటనే మాన్సీ ఆస్తి కోసమే మీ అందరిని బాధపెట్టాను నాకు ఇప్పుడు ఏ ఆస్తి వద్దు మీరందరూ కావాలి అని ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేస్తూ ఆర్య కాలు పట్టుకుంటుంది. కానీ ఆర్య అసలు క్షమించడు. ఇక జడ్జి కూడా తనకు మూడు సంవత్సరాలు కారగారశిక్ష కూడా విధిస్తాడు. వెంటనే పోలీసులు మాన్సీని అరెస్టు చేసి తీసుకెళ్తారు. ఇక ఆర్య సైదాబాను కు థాంక్స్ చెప్పగా అప్పుడే తనకి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్తాడు.


ఇక మాన్సీ కూడా భానుకి థాంక్స్ చెబుతుంది. అప్పుడే అక్కడికి ప్రీతి వచ్చే రేష్మ ఫోన్ చేసి మిమ్మల్ని పిక్ అప్ చేసుకోమని చెప్పింది అనడంతో అప్పుడే అక్కడికి వచ్చిన రేష్మ దొరికిపోయాము అని అనుకుంటుంది. ఇక ఇద్దరు పిల్లలు ఒకే దగ్గర ఉంటే అనుమానం వస్తుందేమో అని అను భయపడుతుంది. అప్పుడే నీరజ్ రేష్మ ని చూసి తనను పిలవగా మాన్సీ వారందరినీ భోజనానికి పిలుస్తుంది.


కానీ భాను రాను అనడంతో ఆర్య రమ్మని కోరుతాడు. ప్రీతి మేము మీ కారును ఫాలో అవుతాము అని చెప్పి  ముగ్గురు ఒకే కారు ఎక్కుతుండగా అను తన అత్తారింటికి వెళ్లడానికి భయపడుతూ ఉంటుంది. కానీ ప్రీతి ధైర్యం చెప్పి తీసుకెళ్తుంది. మరోవైపు మాన్సీ ని జైల్లో వేయడంతో అక్కడే సత్తెమ్మ అనే లేడీ రౌడీ తన గొంతుతో మాన్సీని భయపెట్టిస్తుంది. అంతేకాకుండా తను చెప్పినట్టు అక్కడ కానిస్టేబుల్స్ కూడా తన మాటే వింటారు. దీనిని బట్టి చూస్తే సత్తెమ్మ మాన్సీకి తప్పక సహాయం చేస్తుందేమో అని అనుమానం రాక తప్పదు.


also read it : Rangula Ratnam July 24th: ‘రంగులరాట్నం’ సీరియల్: భార్యను కాపాడిన శంకర్, రేఖను ఇంట్లో నుంచి గెంటేసిన పూర్ణ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial