Ammayi garu Serial Today Episode విజయాంబిక, దీపక్‌లు రుక్మిణి, ఆనంద్ ప్రేమించుకున్నారని చెప్పి ఆనంద్‌ని ఇంటికి తీసుకొచ్చి చూపిస్తారు. రూప కూడా తన ప్రేమ విషయం నీకు చెప్పకుండా దాచేసింది ఇప్పుడు రుక్మిణి కూడా అలా చేస్తుందేమో అని భయంతో మేం తీసుకొచ్చాం అని విజయాంబిక చెప్తుంది.
సూర్యప్రతాప్: మనసులో రూప విషయంలో రూప మనసులో ఏం ఉందో తెలుసుకోకుండా వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను. ఇప్పుడు రుక్మిణి విషయంలో కూడా అలాగే చేసేవాడిని నా నిర్ణయాన్ని బయట పెట్టలేదు కాబట్టి బాగుంది. అమ్మా రుక్మిణి నీకు ఆనంద్ అంటే ఇష్టమేనా.
రుక్మిణి: మనసులో నాన్న ఇదంతా నేను ఆనంద్, రాజు ఆడుతున్న నాటకం అంతే కానీ మీకు మోసం చేయాలి అనుకోవడం లేదు.
విజయాంబిక: ఇది ఒప్పుకుంటే రుక్మిణినేరా కాదు అంటే రూప.
రుక్మిణి: నాకు ఇష్టమే నాయనా.
సూర్యప్రతాప్: మీ పెళ్లి నేను జరిపిస్తాను.
ఆనంద్: అయ్యా మా నాన్నతో ఒక్క మాట.
విజయాంబిక: అయ్యో ఆనంద్ అది మేం చెప్తాం పద అని ఆనంద్‌ని తీసుకెళ్లిపోతారు.
రుక్మిణి: తప్పు చేశాను అనుంటే క్షమించు నాయనా. ఇందాక ఏదో చెప్పాలి అనుకున్నారు ఏంటి అది.
సూర్యప్రతాప్: ఏం లేదు అమ్మా నీ పెళ్లి నీకు ఇష్టమైన వాళ్లతోనే చేస్తాను.
బంటీ: అమ్మ ఇక నువ్వు నాకు అమ్మగా ఉండగా.
రుక్మిణి: అలా ఎవరు చెప్పారు బంటీ నాకు నువ్వే కొడుకువి నీకు నేనే తల్లిని.
విజయాంబిక, దీపక్‌లు ఆనంద్‌ని పక్కకు తీసుకెళ్లి నీ పెళ్లి మేం జరిపిస్తున్నాం కదా మాకు సగం ఆస్తి ఇవ్వ అని అడుగుతారు. ఆనంద్ మొత్తం ఆస్తి తీసుకోమని కాకపోతే తన తండ్రి ఎదురుగానే పెళ్లి జరగాలి అంటాడు. మీ నాన్నతో మాట్లాడుతాం ఫోన్ చేసి ఇవ్వు అంటారు. మా నాన్న దగ్గర ఫోన్ లేదు అని ఆనంద్ అంటాడు. పోనీ మీ నాన్న దగ్గరకు తీసుకెళ్లు అంటే మా నాన్న ఎక్కడ ఉన్నాడో తెలీదు అంటాడు. విజయాంబిక దీపక్‌లు మీ నాన్న దొంగనా ఏమైనా నేరం చేశాడా మీ నాన్న ఫోటో చూపించు అంటారు.
ఆనంద్ తన తండ్రి ఫొటో చూపిస్తాడు. ఆ ఫొటో చూసి విజయాంబిక, దీపక్‌లు ఆ ఫొటో చూసి ఏంటీ మీ నాన్న రాఘవనా అని నోరెళ్ల పెడతారు. ఆనంద్ విజయాంబిక వాళ్లతో మా నాయన మీకు తెలుసా అని అడుగుతాడు. అబ్బే తెలీదు అని కంగారు పడతారు. మా నాయన ఈ ఇంట్లోనే పని చేశారు అంట కదా మీకు తెలీదా.. ఈ సీఎంనే మా నాన్నని భయపెట్టి గెంటేశారు ఈ సీఎంనే మా జీవితంలో మా తండ్రి లేకుండా చేశాడు అందుకే పగ పెంచుకున్నా.. నాకు తండ్రిని దూరం చేసిన ఈ సీఎంకి రుక్మిణిని కూడా తండ్రిని దూరం చేస్తా అని అంటాడు. విజయాంబిక మనసులో వీడి శత్రువు మా తమ్ముడు మాత్రమే కాబట్టి వీడిని మా వైపు తిప్పుకోవాలి అనుకుంటుంది.
రుక్మిణి నన్ను వదిలి ఉండలేదు అని తెలిసే మా నాన్న రాకపోతే ఈ పెళ్లి జరగదు అని చెప్పా.. ఏ ఇంట్లో అయితే మా నాన్నని అవమానించారో అదే ఇంటికి సకల మర్యాదగా తీసుకొచ్చేలా చేస్తా అని అంటాడు. వీడు ఇక్కడ ఉండటం మంచిది కాదు అని ఆనంద్‌ని పంపేయాలి అనుకుంటుంది. అయినా మీరు ఎందుకు మాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆస్తి కోసం అంటారు. మీ నాన్నని వెతికే పనిలో మేం ఉంటామని అంటారు. రూప నీకు ఎవరు తెలుసా అని అడుగుతారు. ఆనంద్ తెలీదు అంటాడు. ఈ విషయం ఇంకెవరికీ చెప్పొద్దు అంటారు.
జీవన్‌ని కలిసి రాఘవ గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. రాఘవని గుప్పెట్లో పెట్టుకొని మనకు నచ్చినట్లు చేసుకుందామని అంటారు. రూప విరూపాక్షికి విషయం చెప్తుంది. రాజు ఆనంద్‌ని తీసుకొచ్చి రాఘవ కొడుకు అని చెప్తాడు. విరూపాక్షి షాక్ అయిపోతుంది. మా నాన్నని క్షమించండి అమ్మగారు అని ఆనంద్ విరూపాక్షి కాళ్ల మీద పడతాడు. మా నాన్న నిజంగా తప్పు చేశాడు అని అంటాడు. ఇందులో మీ నాన్నని నన్ను విజయాంబిక ఇరికించిందని అంటారు. ఆనంద్ దానికి అలా చేయడం కూడా తప్పే కదా అమ్మ గారు ఈ కారణం వల్ల మీరు మేం అందరూ శిక్ష అనుభవిస్తున్నాం అని అంటాడు. మా నాన్న చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం రావడంతో రాజు, అమ్మాయిగారికి సాయం చేస్తున్నా అంటాడు.
సూర్యకి ఆనంద్ రాఘవ కొడుకు అని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని విరూపాక్షి అంటుంది. సూర్యప్రతాప్ ఆనంద్‌తో మాట్లాడటానికి వస్తాడు. అందరూ సూర్యప్రతాప్‌ని చూసి షాక్ అయిపోతారు. మీ నాన్నగారి పేరు ఏంటి అని సూర్యప్రతాప్ అడుగుతారు. దానికి రుక్మిణి రఘుపతి నాయుడు అని చెప్తుంది. మీ అమ్మానాన్నల్ని పిలిపించు కూర్చొని మాట్లాడుదాం అని అంటాడు. పంతులన్ని పిలిపించమని సూర్యప్రతాప్ రాజుతో చెప్తాడు. సూర్యప్రతాప్ మనసులో నా నుంచి దూరంగా వెళ్లిపోవడానికి సిద్ధమైపోయావా తల్లీ అని బాధ పడతాడు. ఆనంద్ అమ్మానాన్నల్ని ఎలా తీసుకొస్తాం అని విరూపాక్షి కంగారు పడుతుంది. దానికి రూప ముందు రాఘవ ఎక్కడ ఉన్నాడో తెలిస్తే తర్వాత ఏం చేయాలో చూద్దాం అని అంటుంది. విజయాంబిక దీపక్‌లు మాట ఇచ్చారు అంటే తప్పకుండా దొరుకుతాడు. నిన్ను అడ్డు పెట్టుకొని రాఘవని రాఘవని అడ్డు పెట్టుకొని నీతో ఆడుకోవాలి అనుకుంటారు అని రాజు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథునని ఎవరు ఏం అన్నా తట్టుకోలేనమ్మా.. ప్రేమ బయట పెట్టేసిన దేవా!