Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ ప్రజెంటేషన్‌లో గెలిచి ఎండీ అవ్వడంతో పద్మాక్షి సహస్ర, అంబికలను తిడుతుంది. ఆ లక్ష్మీ ఎండీ స్థానంలో కూర్చొంటుంది. ప్రతీ రోజు దానికి సమస్యలు సృష్టించండి అని చెప్తుంది. అంబిక, సహస్ర సరే అంటారు. రాత్రి లక్ష్మీ తన గదిలో పడుకొని ఉంటుంది. విహారి, సహస్ర ఒక గదిలో పడుకొని ఉంటారు.
లక్ష్మీకి కలలో కృష్ణుడి వేషం వేసుకున్న ఓ బాబు కనిపించి అమ్మా నాన్న అని పిలుస్తాడు. లక్ష్మీ, విహారి బయటకు వెళ్లి ఆ బాబుని పట్టుకొని ముద్దిస్తారు. తీరా చూస్తే అదంతా కల కన్నయ్యా అని లక్ష్మీ అరుస్తుంది. తేరుకొని బయటకు వచ్చి కన్నయ్యా అని వెతుకుతుంది. విహారి కూడా బయటకు వచ్చి లక్ష్మీని చూసి నాకు వచ్చిన కలే తనకు వచ్చినట్లుందని అనుకుంటాడు. లక్ష్మీ మనసులో కన్నయ్య ఆయన కలలోకి కూడా వచ్చాడా అనుకుంటుంది.
విహారి లక్ష్మీతో ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు. లక్ష్మీ ఏం లేదు అనేస్తుంది. విహారి మనసులో నువ్వు కన్నయ్య కన్నయ్య అని అరుస్తూ రావడం నేను విన్నాను లక్ష్మీ కానీ నువ్వు చెప్పవు అనుకుంటాడు. ఇంతలో విహారి దగ్గరకు వసుధ వస్తుంది. మంచి నీటి కోసం వచ్చాను అని విహారి అంటే వసుధ విహారితో ఎందుకు విహారి ఇంకా నిజం దాస్తున్నావ్ అని అంటుంది. విహారి షాక్ అయిపోతాడు. ఎవరికీ తెలియని నీ ఆత్మతో ముడి పడిన బంధాన్ని దాస్తున్నావ్.. నాకు ఏం తెలీదు అనుకుంటున్నావ్ కదా విహారి.. నాకు నీ సంఘర్షణ తెలుసు నీకు లక్ష్మీకి మధ్య ఏర్పడిని బంధం కూడా తెలుసు అంటుంది. విహారి షాక్ అయిపోతాడు.
వసుధ ఎదుట విహారి మోకాల మీద కూలబడి ఏడుస్తాడు. రెండు చేతులు జోడించి దండం పెడతాడు. అత్తయ్య ఇది నేను గెలవ లేని పోరాటం.. దారి లేని ఈ ముగింపు ఎలా ఉంటుందో అని బాధగా ఉందని అంటాడు. వసుధ విహారితో మీ ముగ్గురిలో ఇద్దరు మాత్రమే సంతోషంగా ఉంటారు. సహస్ర, లక్ష్మీలో ఒకరు బాధ పడతారు అని అంటుంది. విహారి వసుధతో సహస్ర చివరి కోరిక అనగానే మీ అందరూ తాళి నా చేతికి ఇచ్చారు కానీ లక్ష్మీ మీద ప్రేమతో నేను సహస్ర మెడలో రెండు ముడులు మాత్రమే వేయగలిగాను అత్తయ్యా.. మూడో ముడి వేయలేకపోయాను అంటాడు. వసుధ షాక్ అయిపోతుంది. మూడు ముడులు వేయకపోతే దాన్ని పెళ్లి అంటారో లేదో నాకు తెలీదు అంటారు అత్తయ్యా అని అంటాడు.
వసుధ విహారితో దాన్ని పెళ్లి అనరు అని మూడు ముళ్లు వేయకుండా, అగ్నిసాక్షిగా వేదమంత్రాల నడుమ ఏడు అడుగులు నడవకపోతే దాన్ని పెళ్లి అని ఎలా అంటారు అంటుంది. దానికి విహారి లక్ష్మీ మెడలో వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్లు వేశాను అని ఇంకోసారి కోయదొరల సాక్షిగా తాళి కట్టాను అని ఇంకోసారి దేవుడి సాక్షిగా తాళి కట్టాను అంటాడు. దానికి వసుధ మీ ఇద్దరి అనుబంధం దైవ నిర్ణయం అంటుంది. నీకు సహస్రకు ముడి పడదు అని స్వామిజీ ఎప్పుడో చెప్పారు అది నిజం విహారి నీకు లక్ష్మీనే భార్య అని వసుధ చెప్తుంది. విహారి చాలా సంతోష పడతాడు. నీ మాటలతో నాకు ఊపిరి అందింది అత్తయ్యా అని ఏడుస్తాడు.
వసుధకు థ్యాంక్స్ చెప్తాడు. నన్ను నేను క్షమించుకోగలను అంటాడు. సహస్ర పరిస్థితి ఏంటి అని వసుధ అంటుంది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని అంటుంది. దానికి విహారి ఆ దైవమే పరిష్కారం చూపిస్తుందని అంటాడు. లక్ష్మీకి విషయం చెప్పొద్దు అని వసుధ అంటుంది. సహస్ర విహారిని వెతుక్కుంటూ వస్తుంది. విహారి వెళ్లగానే సహస్ర వసుధ దగ్గరకు వస్తుంది. బావ కనిపించాడా అని అడుగుతుంది. వసుధ చూడలేదు అని అనేస్తుంది. వసుధ సహస్రతో చావుతో పోరాడిని నువ్వు విహారి తాళి కట్టగానే బాగానే కోలుకున్నావ్ అంటుంది. సహస్ర షాక్ అయిపోతుంది. అంతా బావ తాళి కట్టిన వేలా విశేషం అంటుంది. పిన్నికి అనుమానం వచ్చింది జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది.
ఆదికేశవ్ లక్ష్మీని తలచుకొని చాలా బాధ పడతాడు. చందమామని చూసి బాధ పడతాడు. గౌరీ రావడంతో నా కూతురు ఎలా ఉందో ఏంటో అని అంటే మన అల్లుడు కూతుర్ని బంగారంలా చూసుకుంటాడు అని గౌరీ అంటుంది. ఈ సారి కనకం వస్తే కనీసం నెల రోజులు అయినా ఉంచుకుంటాను అని అల్లుడితో చెప్పాలి అని అంటాడు. ఇక రేపు సిటీకి వెళ్తున్నాం కదా ఆ అమ్మాయికి చెప్పావా అంటే సహస్రమ్మకు చెప్పాలి రేపు ఉదయం గుర్తు చేయ్ అని ఆదికేశవ్ అంటాడు. ఉదయం ఇద్దరూ హాస్పిటల్‌కి బయల్దేరుతారు. ఆదికేశవ్ సహస్రకు కాల్ చేసి సిటీకి వస్తున్నాం కలుద్దాం అంటే సహస్ర సరే అని కాల్ కట్ చేస్తుంది. ఇక గౌరీ కనకానికి కాల్ చేస్తుంది. నీ మీద నాన్న బెంగ పెట్టుకున్నారమ్మా. ఈ రోజు సీటీ హాస్పిటల్‌కి వెళ్తున్నాం అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథునని ఎవరు ఏం అన్నా తట్టుకోలేనమ్మా.. ప్రేమ బయట పెట్టేసిన దేవా!