Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున నల్లపూసల వేడుక జరిపించమని మామని అడుగుతుంది. బతిమాలుతుంది. ఈ నల్లపూసల తంతు జరగదు అని సత్యమూర్తి అంటే శారద వచ్చి మిథునకు నల్లపూసల తంతు జరుగుతుంది అని అంటుంది. నా నిర్ణయాన్నే ఎదురిస్తావా అని సత్యమూర్తి అడిగితే కోడలిని అలా నల్లపూసలు వేయకుండా ఉండకూడదు అని మిథునకు నల్లపూసల తంతు నేను జరిపించి తీరుతా అని చెప్తుంది.
సత్యమూర్తి శారదతో నా నిర్ణయాన్నే కాదని అంటావా అంటాడు. దానికి శారద ఆడపిల్ల కన్నీరు అంత మంచిది కాదు తనని మన బిడ్డగా భావించి తను సంతోషంగా ఉండేలా చూద్దాం అంటుంది. కాంతం వెళ్లి అత్తయ్య గారు మామయ్యని ఎదిరిస్తారా అని అడిగితే ఏయ్ నోర్ముయ్‌ని అని శారద అరవడంతో కాంతం తుఫాన్ అయిపోతుంది. శారద భర్తతో మిమల్ని ఎప్పుడూ ఎదురించలేదు భవిష్యత్‌లో ఎదురించను కానీ మిథునకు నల్లపూసల తంతు జరిపించే తీరుతా అర్థం చేసుకోండి అంటుంది. నీకు నన్ను ఎదురించే ధైర్యం వచ్చేసింది ఛీ ఛీ అని వెళ్లిపోతాడు.
ఆనంద్, శ్రీరంగం తల్లితో నల్లపూసల తంతు అంటే బంగారం కావాలి కనీసం 3 లక్షల వరకు అవుతుంది అంటారు. దానికి శారద మీ బాధ నాకు అర్థమైంది నా చిన్న కోడలికి ఎలా బంగారం కొనాలో నాకు తెలుసు నేను కొంటా అని చెప్తుంది. దేవా గ్యారేజ్‌లో తన ఫ్రెండ్స్‌తో మిథున ఛాలెంజ్ గురించి చెప్తాడు. వదిన అన్నంత పని చేస్తుందని అందరూ దేవాతో అంటారు. ఈ విషయంలో తను ఛాలెంజ్ చేసినట్లు అస్సలు జరగదు అంటాడు. మిథున అక్కడికి రావడంతో అందరూ పారిపోతారు. మిథున దేవాతో నాకు నల్లపూసల తంతు జరిపించడానికి అందరూ ఒప్పుకున్నారు అని చెప్తుంది.
దేవా నవ్వుతూ అందరూ ఒప్పుకుంటే ఏంటి మా హిట్లర్ నాన్న ఒప్పుకోరు అని నవ్వుతాడు. ఒప్పుకున్నారు అని మిథున అనగానే దేవా షాక్ అయిపోతాడు. మా నాన్న ఒప్పుకోవడం ఏంటే అంత తేలికగా ఒప్పుకోరు కదా అంటే అత్తయ్య ఒప్పించారు అని అంటుంది. నువ్వు అందరినీ ఒప్పించగలవు కానీ నన్ను ఒప్పించలేవు అని అంటాడు. దానికి మిథున నువ్వే నా అంతట నా మెడలో నల్లపూసలు వేస్తావ్ అని అంటుంది. నా జీవితంలో ఈ లోకంలో నాకు నచ్చని వ్యక్తి నువ్వే మరి నీ మెడలో నేను ఎందుకు నల్లపూసలు వేస్తాను అంటాడు. నీకు నేను నచ్చని వ్యక్తిని అయితే నన్ను భార్య అని అందరి ముందు ఎందుకు ఒప్పుకున్నావ్ అని అడుగుతుంది. వాడు నిన్ను అన్ని మాటలు అంటుంటే అలా చెప్పా అంటాడు. దానికి మిథున ఫ్రెండ్ అని చెప్పొచ్చు కదా బంధువుల అమ్మాయి అని చెప్పొచ్చు కదా అంటుంది.
దేవా ముఖం తెల్లబోతుంది. నీ మనసులో నేను ఉన్నాను అందుకే అందరి ముందు భార్య అని చెప్పావ్ అంటుంది. నేను పొరపాటున కూడా నిన్ను భార్యగా ఒప్పుకోను అని దేవా అంటే నువ్వు నన్ను భార్యగా చూస్తున్నావ్ నువ్వే నల్లపూసలు వేస్తావ్ అంటుంది. దేవా ఫ్రెండ్స్‌తో ఏదేదో మాట్లాడుతుంది తనని ఎవరికైనా చూపించండి అంటే వదినకు క్లారిటీ ఉంది నీకే లేదు అన్న అంటారు. మిథున దేవాతో రేపు మన ఇద్దరినీ సేమ్ డ్రస్‌లు తీసుకుంటా అని అంటుంది. ఇదేం శాడిజం అని దేవా తలబాదుకుంటాడు.
శారద మిథున తల్లికి కాల్ చేసి వదిన రేపు నా కోడలికి నల్లపూసల తంతు జరిపిస్తాం రేపు మీరు తప్పకుండా రావాలి అని చెప్తుంది. లలిత, బామ్మ చాలా హ్యాపీగా ఫీలవుతారు. మిథున అత్తని హగ్ చేసుకొని ఈ ఇంటి కోడలిగా నాకు శాశ్వతంగా చోటు ఇస్తున్నందుకు థ్యాంక్స్ అత్తయ్య అంటుంది. ఇంత మంచి అమ్మాయి మాకు కోడలు అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని శారద అంటుంది. లలిత వాళ్లు మాట్లాడుకోవడం త్రిపుర, రాహుల్ వింటారు. కోపంతో ఉంటారు. మరోవైపు కాంతం తెగ ఫీలైపోతుంది. ఈ తంతు జరిగితే మిథున నా నెత్తిన కూర్చొంటుందని కాంతం అంటే దానికి శ్రీరంగం దేవా నల్లపూసలు వేస్తే కదా తను ఇంటి కోడలు అవుతుంది. అసలు దేవా ఆపని చేస్తాడా అని అడుగుతాడు. నిజమే కదా అని కాంతం గెంతులేస్తుంది.
శారద మిథునని తీసుకొని బంగారం దుకాణానికి వస్తుంది. బంగారం కొనాలి అంటే రెండు మూడు లక్షలు అవుతుంది వద్దమ్మా అని అంటుంది. అప్పు చేశారా అమ్మా అని వద్దు అని మిథున అంటుంది. నేను మా అమ్మని అడిగి డబ్బు తీసుకుంటా అని చెప్తుంది. అత్తగారి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఇంతలా అర్థం చేసుకున్న కోడలు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని అంటుంది శారద. నేను ఏం అప్పు చేయలేదు ఏం టెన్షన్ పడొద్దు అని బంగారం షాప్‌కి వెళ్తారు. శారద తన గాజులు ఇచ్చి వాటికి సరిపోయే బంగారం ఇవ్వమని అడుగుతుంది. మిథున చాలా ఎమోషనల్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథునని ఎవరు ఏం అన్నా తట్టుకోలేనమ్మా.. ప్రేమ బయట పెట్టేసిన దేవా!