Ammayi garu Serial Today Episode రూప తన బిడ్డకు, రాజు తన బిడ్డ బంటికి తమ జీవితాన్నే కథగా చెప్తారు. ఇద్దరూ ఒకర్ని ఒకరు గుర్తు చేసుకుంటారు. బంటి రాజుతో రాణి అంటే రాజుకి ఎందుకు నాన్న అంత ప్రేమ అని అడుగుతాడు. ఇక రూప బిడ్డ దీపక్ రూపతో రాజ్యాన్ని వదిలేసి రాణిని చూసుకోవడం తప్పు కదా మమ్మీ ఆ రాజు చెడ్డొడు అయింటాడు కదా అని అడుగుతాడు. కాదు అని రూప దీపుతో చెప్తుంది. ఇక దీపు తల్లితో అంత గొప్ప రాజు, రాణిలు ఉంటారా అని అడుగుతాడు. రాజు, రాణిలు కలిసి ఉంటే కథ గొప్పగా ఉండేదని ఇద్దరూ విడిపోయారని రూప చెప్తుంది.
ఇంతలో రూప వాళ్ల కారు సరిగ్గా బంటీ స్కూల్ దగ్గర ఆగిపోతుంది. రాజు బంటీని తీసుకొని స్కూల్ దగ్గర దింపి అర్జెంట్ పని ఉంది నువ్వు లోపలికి వెళ్లు నాన్న అంటాడు. బంటీ తండ్రికి కథ పూర్తి చేయమని అంటాడు. దాంతో రాజు రాజు, రాణిల కథ మధ్యలోనే ముగిసిపోయిందని అంటాడు. దాంతో బంటి మధ్యలో ముగిసిపోతే అది నిజమైన ప్రేమ కాదు నాన్న. నిజమైన ప్రేమ కథ అయితే ఒకర్ని ఒకరు మర్చిపోరు అని ఇలా ముగిసిపోదు అని అంటాడు. రాణిని అర్థం చేసుకోవడంలో నువ్వు పొరపాటు పడి ఆ పొరపాటునే నువ్వు నాకు చెప్పినట్లున్నావ్ అని అంటాడు. దాంతో రాజు ప్రేమ గురించి నీకు తెలీదు అని అంటాడు. ఇక డ్రైవర్ కారు ఏమైందో తెలీదు దగ్గర్లో మెకానిక్ షాప్ ఉంటే చూసి వస్తానని వెళ్తాడు. బాబుని దింపేసి రాజు వెళ్లిపోతాడు. ఇక రూప ఎక్కిళ్లు వచ్చి కిందకి దిగబోతుంది. సరిగ్గా దిగే దగ్గర గాజు పెంకు ఉంటుంది. అది చూసిన బంటి అమ్మా అని అరిచి రూప కాళ్ల కింద చేయి అడ్డు పెడతాడు. ఆ పిలుపుతో రూప బిడ్డని చూసి ఏదో తెలియని ఫీలింగ్ అనిపిస్తుంది.
బంటి: నేను రావడం కాసేపు ఆలస్యం అయింటే నీ కాళ్లకి దెబ్బ తగిలేది ఫ్రెండ్.
రూప: ఎవరు బాబు నువ్వు ఎందుకు ఇలా చేశావ్ నీ చేతికి దెబ్బ తగిలి ఉంటే
బంటి: నాకు ఏం కాలేదు ఫ్రెండ్. నీకు ఏం కాలేదు కదా.
రూప: నీ వల్ల ఏం కాలేదు లేదంటే పెద్ద గాయమే అయ్యేది దేవుడిలా వచ్చావ్ ఇంతకీ నీ పేరు ఏంటి.
బంటి: నా పేరు బంటి.
రూప: అదేంటి వేరే పేరు లేదా.
బంటి: పేరు తేజ అందరూ ముద్దగా బంటి అంటారు.
బంటి రూపకి తాగడానికి నీరు ఇస్తాడు. దాంతో రూప నిన్ను చూడగానే తగ్గిపోయావు అని అంటుంది. బంటి దగ్గర అన్నీ పింక్ కలరే ఉంటాయి. బ్యాగ్ బాటిల్ దాంతో రూప అన్నీ పింకే ఉన్నాయి ఇష్టమా అంటే అవును అంటాడు. రూప కూడా నాకు పింక్ అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. ఇక డ్రైవర్ వచ్చి మెకానిక్ షాప్ లేదు అని అంటే బంటి తన తండ్రి మెకానిక్ షాప్ గురించి చెప్పి ఆర్ ఆర్ గ్యారేజ్ ఉందని చెప్తాడు. ఇక డ్రైవర్ కూర్చొంటే బంటి, రూపలు కారు వెనక నుంచి తోస్తారు. ఇద్దరూ ఓం సాయిరాం అని ఒకే సారి అంటారు. ఇద్దరూ ఒకర్ని ఒకరు ఆశ్చర్యంగా చూసుకుంటారు. నీకు మంచి మనసు ఉంది బంటి మీ అమ్మానాన్నలు చాలా అదృష్టవంతులు అంటుంది. దానికి బంటి మనసులో నేను దురదృష్టవంతుడిని మా అమ్మ ప్రేమని చూడలేకపోయానని అనుకుంటాడు. ఇద్దరూ కారు తోసుకొని గ్యారేజీ దగ్గరకు వచ్చేస్తారు.
రూప ఆర్ ఆర్ గ్యారేజ్ అనే బోర్డ్ చూసి రూప, రాజుల పేరిట పెట్టిన ఆర్ ఆర్ కంపెనీ గుర్తు చేసుకుంటుంది. ఇక బంటి నాన్న చూస్తే నా పని అయిపోతుందని అనుకుంటూ స్కూల్‌కి వెళ్తానని రూపకి చెప్తాడు. రూప బంటికి ముద్దు పెట్టి పంపిస్తుంది. రూప వెళ్లేసరికి రాజు ఓ కారు రిపేర్ చేస్తూ ఉంటాడు. రూప, రాజులు ఒకర్ని ఒకరు చూసుకొని చూస్తూ ఉండిపోతారు. ఇంతలో పెద్దగా వర్షం పడుతుంది. ఇద్దరూ ఇద్దరి మధ్య ప్రేమను గుర్తు చేసుకుంటారు. రాజు రూపని చూసి ఏం మాట్లాడకుండా కారు రిపేర్ చేస్తాడు. రాజు మెకానిక్‌గా ఉండటం ఏంటి అని రూప అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఆ రోజు పొదుపే ఈ రోజు కొండంత అండ.. ఫ్యామిలీని మాటలతో చంపేసిన సుమిత్ర..!