Nindu Noorella Saavasam October 7th, ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూడండి: 


అమర్: ఆ అమ్మాయిని ఎవరు సెలెక్ట్ చేశారు.


రాథోడ్: నేనే సెలెక్ట్ చేశాను అంటే ఏమంటారో అని మనసులో అనుకొని అందరం కలిసి సెలెక్ట్ చేశాం సార్, మీకు కూడా చెప్పాము కదా.


అమర్: రెండు రౌండ్లు పూర్తి చేసిన అమ్మాయి ఈ అమ్మాయా.. చాన్సే లేదు. ఈ అమ్మాయిని పనిలోంచి తీసేసి వేరే అమ్మాయిని కేర్ టేకర్ గా పెట్టండి.


రాథోడ్: కానీ ఆ అమ్మాయి అన్ని రౌండ్లు పూర్తి చేసింది సార్. పిల్లలు కూడా ఓకే చెప్పారు.


అమర్: ఆ అమ్మాయి సంగతి నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయికి డిస్ప్లేన్ లేదు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అలాంటిది నా పిల్లల్ని ఏం పెంచుతుంది, వెంటనే ఆ అమ్మాయిని బయటికి పంపించేయ్ అని ఆర్డర్ వేస్తాడు.


రాథోడ్: సరే అని బయటికి వెళ్లిపోతాడు.


ఈ మాటలు అన్ని పక్కనుంచి వింటారు మనోహరి, పనిమనిషి. వాళ్ల గదిలోకి వెళ్ళిన తర్వాత 


పనిమనిషి: మీ అదృష్టం ఏంటమ్మ గారు ఇలా పండిపోయింది. మీరు ఏది అనుకుంటే అదే జరుగుతుంది.


మనోహరి : అవును నిజమే, ఈరోజుతో ఈ కేర్ టేకర్ గోల, ఆ అరుంధతి గోల ఒకేసారి వదిలిపోయింది. నువ్వు పిల్లల కేర్ టేకింగ్ సంగతి చూసుకో, నేను అమర్ తో ఫుల్ టైం ఎంజాయ్ చేస్తాను.


పనిమనిషి : మరి నాకు బంగారం నెక్లెస్ చేయిస్తారా?


మనోహరి : ఒక్క బంగారం నక్లీసు ఏం కర్మ, నీకేం కావాలంటే అదే చేస్తాను నాకు ఈ లోకంలో కావలసింది అమర్ ప్రేమ మాత్రమే.


ఆ తర్వాత చిత్రగుప్తుడు, అరుంధతి ఇంట్లోకి వస్తారు. అరుంధతి ఇంటి లోపలికి వెళ్తూ ఉంటుంది.


చిత్రగుప్తుడు : ఎక్కడికి వెళ్తున్నావ్ బాలిక.


అరుంధతి: లోపలికి వెళ్తున్నాను, ఒకసారి పిల్లల్ని చూసుకొని వచ్చేస్తాను.


చిత్రగుప్తుడు: అది కుదరదు ఒకసారి లోపలికి వెళ్తే బంధాలని, బాధ్యతలని తప్పించుకోలేవు.


అరుంధతి: సారీ మిస్టర్ గుప్తా నాకు మీతో రావడం కుదరదు. అయినా మీరు మాత్రం ఆ నరకానికి వెళ్లి ఏం చేస్తారు చెప్పండి. మీరు కూడా ఇక్కడే ఉండిపోండి. అయినా మిమ్మల్ని చూస్తే నా తలరాతని తప్పుగా రాసి నన్ను పైకి తీసుకెళ్లి పోతున్నట్లుగా ఉన్నారు. ఇక్కడ నా కుటుంబానికి ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత  


చిత్రగుప్తుడు: విధిని ఎదిరించుట తప్పు బాలికా, తలరాతని తప్పించుకోవటం అసాధ్యం. నన్ను బురిడీ కొట్టించి ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావు కానీ అది అసాధ్యం. ఒకసారి నేత్రములు మూయుము ఖంగు తినెదవు అంటూ మంత్రాన్ని జపిస్తాడు.


అయితే పైలోకానికి వెళ్ళకుండా ఇక్కడే ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. మళ్లీ మంత్రాన్ని జపిస్తాడు కానీ ఇక్కడే ఉండడం చూసి మరింత ఆశ్చర్యపోతాడు అప్పుడే తన చేతికి ఉంగరం లేదని గ్రహిస్తాడు. నా అంగుళీకము నీవే తీసావు కదా.


అరుంధతి: ఇది మరీ బాగుంది, మీరు ఎక్కడో పారేసుకుని నన్ను అంటారు ఏంటి, అయినా త్వరగా పదండి వెళదాము నాకు కూడా మీ లోకంలో ఉన్న వాళ్ళందరినీ చూడాలని ఉంది.


చిత్రగుప్తుడు: మంచి ఆత్మవని నీతో నా రహస్యాలు చెప్తే ఇలా చేస్తావా, నా అంగుళీకము నాకు ఇచ్చి వేయవచ్చు కదా, మనం స్నేహితులం కదా అని బుజ్జగించినట్లుగా అడుగుతాడు.


అరుంధతి: మీరు నేను స్నేహితులం ఏమిటి? మీరు దేవతా స్వరూపులు మేము మానవమాత్రులం. అయినా మీ తండ్రి నో తాతనో పిలవచ్చు కదా వాళ్లే వచ్చి మనల్ని తీసుకెళ్తారు.


చిత్రగుప్తుడు : సమయం వచ్చిందని నాతో ఆడుకుంటున్నావు కదా, అయినా నేను అంగుళికము పోగొట్టుకున్నానని మా లోకంలో తెలిస్తే అక్కడ మా పరువు పోతుంది.


అరుంధతి: అయితే మీరు మీ ఉంగరం వెతికి తీసుకురండి ఈలోపు నేను నా పిల్లలను చూసి వచ్చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది.


మిస్సమ్మ దేవుడిని తిట్టుకుంటూ బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రాథోడ్ నిన్ను ఎవరైనా వెళ్ళిపోమన్నారా ఎందుకు బట్టలు సర్దుకుంటున్నావు.


మిస్సమ్మ: నేను ఏమైనా అత్తారింట్లో ఉన్నానా..చెప్పేవరకు వెళ్ళక పోవటానికి. ఆయన మొహం చూస్తేనే నాకు అర్థమైపోయింది. ఆయన నన్ను ఎక్కడ ఉండనివ్వరు. మా మధ్య జరిగిన గొడవ అలాంటిది.


రాథోడ్ : ఏం జరిగిందో చెప్పు మీ సమస్యని నేను తీరుస్తాను.


మిస్సమ్మ మొదటి నుంచి అమర్ తో జరిగిన గొడవలన్నీ చెప్పుకొని వస్తుంది. అది విన్న రాథోడ్ కళ్ళు తిరిగి కిందపడిపోతాడు. ఈ మాటలు అన్ని అరుంధతి కూడా వింటుంది. ఒక్క మాట ఎక్కువ మాట్లాడితేనే ఆయనకు నచ్చదు. అలాంటిది ఈ అమ్మాయి అన్ని సార్లు గొడవ పడింది అంటే ఇంకా ఇక్కడేం ఉంచుతారు అని డీలా పడిపోతుంది.


Also Read: Prema Entha Madhuram October 6th:పెళ్లి పీటల మీద ఆర్య - ఆపడానికి వచ్చిన సుబ్బు, పద్దులు!


Join us on Telegram: https://t.me/abpdesamofficial