బిగ్ బాస్ ఇంట్లో ఇప్పటి వరకు ఒకరి మీద మరొకరు అరుచుకోవడం, తిట్టుకోవడం మాత్రమే చూస్తూ వచ్చాం. ఇప్పుడు వారిలోని ప్రేమని బయట పడింది. కెప్టెన్సీ టాస్క్ కోసం తమ తోటి వారి మీద చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. తమకి ఇష్టమైన వారి దగ్గర నుంచి వచ్చిన లెటర్ ని కూడ త్యాగం చేశారు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ చిట్టి ఆయిరే అంటూ ఫిట్టింగ్ పెట్టాడు. ఇంటి దగ్గర నుంచి కంటెస్టెంట్స్ కి ఉత్తరాలు వచ్చాయి. అయితే జంటలుగా ఉన్న కంటెస్టెంట్స్ తమ తోటి వారి కోసం వాళ్ళకి వచ్చిన లేఖని చింపేయాల్సి ఉంటుంది. నిన్నటి ఎపిసోడ్లో యావర్, తేజ ఒకరికోసం మరొకరు త్యాగం చేస్తూ ఏడిపించేశారు. పాత సినిమాల్లో స్నేహాన్ని గుర్తుకు తెచ్చారు. యావర్ తేజ కోసం త్యాగం చేయగా, గౌతమ్ కోసం శుభశ్రీ తనకి వచ్చిన లేఖని చింపేసింది. ఇక ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో ఏముందంటే..
అమర్ దీప్, సందీప్ వంతు వచ్చింది. బిగ్ బాస్ ఇంటికి వచ్చాకే తనకి విలువలు, ప్రేమ గురించి తెలిసి వచ్చిందని అమర్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇక ఎప్పటి నుంచో తన తల్లి ఆరోగ్యం ఎలా ఉందో అడుగుతున్నానని సందీప్ నిన్ననే చెప్పాడు. తన తల్లి దగ్గర నుంచి వచ్చిన లెటర్ చదవాలని ఉందని చెప్పేసరికి అమర్ తన భార్య తేజస్వీ దగ్గర నుంచి వచ్చిన లేఖని త్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. తేజుకి ఇప్పటి వరకు ఏం చేయలేదు. తనని సరిగా చూసుకున్నానో లేదో కూడా తెలియదు. ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని విలువలు తెలిసి వచ్చాయి. కన్నని చూడగానే తనే పిలిచినట్టు అనిపించింది. తేజు ఐయామ్ సోరి. నీ విలువ తెలిసిందని వెక్కి వెక్కి ఏడ్చాడు.
Also Read: త్యాగజీవి తేజాకు యావర్ షాక్ - పాత సినిమాల్లో స్నేహితుల్లా గుండెలు పిండేసిన బడ్డీస్!
ఇక శివాజీ ప్రశాంత్ కోసం తన భార్య దగ్గర నుంచి వచ్చిన లెటర్ ని తిరిగి ఇచ్చేస్తానని చెప్తాడు. ఎక్కడి నుంచో వచ్చావ్. రాగానే హగ్ ఇచ్చావ్. నీకోసం నా భార్య దగ్గర నుంచి వచ్చిన లెటర్ ని గివ్ అప్ చేస్తాను. నా భార్యని నేను బాగా చూసుకున్నానో లేదో తెలియదు కానీ తను నన్ను బాగా అర్థం చేసుకుంటుంది” అని శివాజీ తనకి ఇంటి దగ్గర నుంచి వచ్చిన లెటర్ ని చింపేయడానికి రెడీ అయిపోయాడు. ప్రశాంత్ అది చూసి గుక్క పట్టి ఏడ్చేశాడు. ఇక నిన్న జరిగిన టాస్క్ లో గౌతమ్, టేస్టీ తేజ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టిన సమయంలో శివాజీ తనకి పెళ్లి కాలేదని టేస్టీ తేజతో అబద్దం చెప్పి ఆడేసుకున్నాడు. దీంతో కొందరు ప్రేక్షకులు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ నాగార్జున స్టేజ్ మీద అడిగినప్పుడు తన భార్య పేరు శ్వేత అని చెప్పారు. అప్పట్లో పెళ్లి కాలేదని బుకాయించిన శివాజీ ఇప్పుడు టాస్క్ లో మాత్రం నిజం కక్కేశాడు. తనకి పెళ్లి అయ్యిందని ఒప్పేసుకున్నాడు.