బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులోని కంటెస్టెంట్స్ ఎంత సంపాదిస్తున్నారు అనే విషయం తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టే ప్రతీ సెలబ్రిటీలో రెగ్యులర్ కమిట్మెంట్స్ ఉంటాయి. ఆ కమిట్మెంట్స్‌ను పక్కన పెట్టి.. వారు ఈ హౌజ్‌లోకి వస్తున్నారంటే కచ్చితంగా ఎక్కువ రెమ్యునరేషనే డిమాండ్ చేస్తారు. అలా తన సీరియల్స్‌ను పక్కన పెట్టి మరీ బిగ్ బాస్‌లోకి వచ్చినందుకు శోభా శెట్టి బాగానే సంపాదిస్తుందని సమాచారం. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్న వారిలో శోభా కూడా ఒకరని తెలుస్తోంది.
మూడో పవర్ అస్త్రా సాధించి..
సీరియల్స్‌లో నటిగా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది శోభా శెట్టి. తను శోభా శెట్టిగా కంటే ‘కార్తికదీపం’లో మోనితగానే ఎక్కువమందికి తెలుసు. ఇక ఆ సీరియల్‌లో విలన్ పాత్రలో అందరిచేత తిట్లు తిన్న శోభా.. అసలు రియల్ లైఫ్‌లో ఎలా ఉంటుందో చూద్దామని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. బిగ్ బాస్ హౌజ్‌లో శోభా శెట్టి ప్రవర్తన చూసి చాలావరకు ప్రేక్షకులు తనకు ఫ్యాన్స్ అయిపోయారు కూడా. ఇక తన పట్టుదలతో పవర్ అస్త్రాను కూడా సాధించి.. బిగ్ బాస్ సీజన్ 7లో మూడో హౌజ్‌మేట్‌గా స్థానాన్ని దక్కించుకుంది శోభా. అయితే బిగ్ బాస్‌లో ఉండడం కోసం ఈ బ్యూటీ.. వారానికి ఎంత సంపాదింస్తుంది అనే వివరాలు బయటకొచ్చాయి.
వారానికి రెమ్యునరేషన్ ఎంతంటే..
బిగ్ బాస్ హౌజ్‌లో ఉండడం కోసం వారానికి రూ.2.5 లక్షలు ఛార్జ్ చేస్తుందట శోభా శెట్టి. ఇప్పటికే బిగ్ బాస్ ప్రారంభమయ్యి అయిదు వారాలు పూర్తికాబోతోంది. అంటే ఇప్పటికే శోభా శెట్టి రూ.12.5 లక్షల రెమ్యునరేషన్‌ను అందుకుందన్నమాట. అంతే కాకుండా శోభా పట్ల ప్రేక్షకుల్లో పాజిటివ్ అభిప్రాయమే ఉంది కాబట్టి ఇప్పట్లో తను హౌజ్ వదిలి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. తను హౌజ్‌లో ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే.. తనకే అంత ఎక్కువ లాభం. కేవలం శోభా శెట్టికి మాత్రమే కాదు.. తనలాగానే సీరియల్స్‌లో నటించే అమర్‌దీప్, ప్రియాంకలకు కూడా దాదాపు ఇంతే రెమ్యునరేషన్ అందుతుందని సమాచారం.
శివాజీ, గౌతమ్‌లతో గొడవ..
నామినేషన్స్ సమయంలో, పవర్ అస్త్రా కోసం పోటీ సమయంలో శోభా శెట్టి.. ఇతర కంటెస్టెంట్స్‌తో వాగ్వాదాలు జరపడం వల్ల ప్రేక్షకుల దృష్టి తనపై పడింది. ఒకసారి నామినేషన్స్ సమయంలో శివాజీతో గొడవపడిన శోభా.. శివాజీ అన్న మాటలకు రివర్స్ కౌంటర్ ఇస్తూ అసలు తనేంటో నిరూపించింది. ఆ తర్వాత గౌతమ్‌తో పవర్ అస్త్రా టాస్క్ విషయంలో అయిన గొడవ మరోసారి ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేసింది. గౌతమ్.. తనపై అరుస్తుంటే తనకంటే పెద్దగా అరిచి.. శోభా శెట్టి రియల్ లైఫ్‌లో కూడా విలన్ షేడ్స్ చూపించగలదు అని ప్రూవ్ చేసుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి వారంలోనే ఏడ్చిన కంటెస్టెంట్‌గా కూడా శోభా శెట్టి నిలిచింది. అలా ఏడ్చినవారు ఎప్పుడూ టాప్ 5కు వెళ్లరు అని నాగార్జున హెచ్చరించడంతో అప్పటినుండి ఏడుపు మానేసింది.
Also Read: ‘లియో’ స్టోరీని హాలీవుడ్ మూవీ నుంచి కొట్టేశారా - సాక్ష్యం ఇదిగో!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial