Krishnamma kalipindi iddarini June 20th: సునంద గౌరీని పెళ్లి చేసుకుంటే కన్న కూతురు లాగా చూసుకుంటాను అని ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటాను అని చెప్పటంతో గౌరీ తనకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని.. ఇష్టం లేని పెళ్లి చేస్తే ఇద్దరం సంతోషంగా ఉండమని ముఖం మీదే చెప్పేస్తుంది. దాంతో సునంద షాక్ అయ్యి బాధపడుతుంది.


ఇక ఆనందయ్యను కూడా అడగటంతో కూతురు ఏం చెబితే అదే అని అంటాడు. వెంటనే సునంద దుర్గ భవానిని కూడా అడగటంతో వెంటనే తను కళ్ళు లేని నీ కొడుకును నా కూతుర్ని ఎలా ఇవ్వమంటావు అంటూ నానా రకాలుగా మాట్లాడి సునందను బాధపెడుతుంది. ప్రతిసారి గుడ్డివాడు అనటంతో సునంద కోపంతో అరిచి గౌరీ తల్లివి కాబట్టి ఊరుకున్నాను అని వదిలేస్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి బాధపడుతూ వెళ్తుంది.


ఈ విషయం ఇంట్లో వాళ్లకి ఎలా చెప్పాలి అని.. ఈశ్వర్ అసలు తట్టుకోలేడు అని బాధపడుతుంది. మరోవైపు ఇంట్లో వాళ్ళందరూ ఈశ్వర్ ను ఆట పట్టిస్తూ ఉంటారు. పెళ్లి కళ వచ్చేసింది అంటూ.. పెళ్లి గురించి మాట్లాడేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా హనీమూన్ల గురించి కూడా మాట్లాడుతూ ఉండగా అక్కడ అవన్నీ చూస్తున్న సౌదామిని వాళ్ళు కుళ్ళుకుంటూ కనిపిస్తారు.


ఇక ఇంటికి వెళ్లిన సునందను కుటుంబ సభ్యులు ఏం జరిగిందని.. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాము అని అడుగుతుంటారు. కానీ సునంద ఏమి చెప్పకుండా మౌనంగా ఉండటంతో.. అప్పుడే తన అత్తమామలు గౌరీ వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరేమో అందుకే మౌనంగా ఉందేమో అని వెంటనే సునంద కూడా అవును అని అంటుంది.


కానీ లోలోపల కొడుకుని చూసి బాధపడుతూ ఉంటుంది. దిగులుగా ఉన్న సునంద ముఖం చూసి సౌదామిని ఏదో జరిగింది అని అనుకుంటుంది. గౌరీ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో అదే మనకు ఆయుధమని అనుకుంటుంది. ఇక అఖిల తన తల్లి దగ్గరికి వెళ్లి వచ్చిన అవకాశాన్ని పోగొట్టావు అంటూ మాట్లాడుతుంది. ఇక భవానికి అర్థం కాకపోయేసరికి ఏంటిదని అడగటంతో.. తను ఆ ఇంటి కోడలు అయ్యానన్న కల ను నిజం చేయటానికి ఒక ప్లాన్ చెబుతుంది.


వాళ్ళ ఇంటికి వెళ్లి గౌరీ తో పెళ్లికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి.. మీ చిన్న కొడుకుతో నా చిన్న కూతురు పెళ్లి చేస్తేనే గౌరీ వాళ్ళ పెళ్లి జరుగుతుందని కండిషన్ పెట్టు అని అఖిల తన తల్లికి ప్లాన్ చెబుతుంది. దాంతో తన తల్లి సరే అని అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక భవాని సునంద వాళ్ళ ఇల్లు చూసి ఆశ్చర్యపోయే ఎలాగైనా అఖిలని ఈ ఇంటి కోడలిని చేయాలని అనుకుంటుంది.


భవాని ఇంట్లోకి వెళ్లేసరికి అక్కడ ఈశ్వర్ కనిపించడంతో నేరుగా ఈశ్వర్ తోనే అసలు విషయం చెప్పాలి అని ఫిక్స్ అయ్యి చెప్పబోతుంటే అప్పుడే.. సునంద ఎక్కడ భవాని పెళ్లికి ఒప్పుకోలేదని చెబుతుందో అని భయపడి తనను పక్కకు తీసుకొని వెళుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని సునంద అడగటంతో.. ఒక తల్లి మనసుని అర్థం చేసుకోలేకపోయాను.. నువ్వు ఎలా అయితే నీ బిడ్డ గురించి ఆలోచించావా అలాగే నా బిడ్డ గురించి కూడా నేను ఆలోచించాను.. అందుకే ఒక తల్లి మనసును అర్థం చేసుకొని నేను ఇక్కడికి వచ్చాను అని అనటంతో సునంద ఆమె మాటలకు కాస్త ఆశ్చర్యపోతున్నట్టు కనిపిస్తుంది.


Also Read: Madhuranagarilo June 20th: శ్యామ్ గురించి అసలు నిజం తెలుసుకున్న రాధ-షాక్ లో సంయుక్త?


                                        Join Us on Telegram: https://t.me/abpdesamofficial