రుద్రాణి కొడుకు దగ్గరకి వచ్చి అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. అసలు అది పెళ్ళిలో ఉండదని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చి కోడలిని చేసి నా నెత్తిన పెట్టావని అరుస్తుంది. ఇప్పుడు స్వప్నకి తోడుగా కావ్య కూడా ఉంది తన మీద ఈగ కూడా వాలనివ్వరు. నా మీద కావ్య చెప్పినవన్నీ రాజ్ నిజమని నమ్ముతున్నాడు. స్వప్నతో పాటు కావ్యని దెబ్బ కొట్టాలని అంటాడు. నెలరోజుల్లో స్వప్న ఇంట్లో ఉండటానికి వీల్లేదని రుద్రాణి డెడ్ లైన్ పెడుతుంది. స్వప్న నిద్రలేచి శోభనం గదిలో ఉండాల్సిన దాని ఈ గదిలో ఉన్నానని తిట్టుకుంటుంది. ఎలాగైతేనే దుగ్గిరాల ఇంటికి కోడలిని అయ్యానని సంబరపడుతుంది. వెళ్ళి కాఫీ తాగుదామని నైట్ డ్రెస్ తోనే కిందకు వస్తుంది. స్వప్న అలా రావడం చూసి అందరూ బిత్తరపోతారు. వచ్చి రాజ్ చేతిలో ఉన్న పేపర్ లాగేసుకుని సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది.


Also Read: ముకుంద ఆత్మహత్యాయత్నం- కృష్ణతో మనసులో మాట చెప్పలేకపోయిన మురారీ


బయట కావ్య ఇంటి ముందు రంగవల్లి పెడుతూ ఉంటుంది. కొత్త కోడలివి స్నానం చేయకుండా ఎలా వస్తావ్ పొద్దున్నే లేచి తలస్నానం చేసి కళకళలాడుతూ ఉండాలని ఇంద్రాదేవి అంటే అదంతా తన వల్ల కాదని స్వప్న అంటుంది. అప్పుడే కావ్య వచ్చి ఇక్కడ అందరూ పెద్ద వాళ్ళు ఉన్నారు లేచి పైకి వెళ్ళమని చెప్తుంది. ఏయ్ నీకు తెలియదా పొద్దున్నే లేవగానే బెడ్ కాఫీ తాగుతానని స్వప్న అరిచి చెప్పేసరికి కావ్య వెళ్ళి తీసుకొచ్చి ఇస్తుంది. స్వప్న ప్రవర్తనకి అందరూ కోపంగా ఉంటారు. కాఫీ టేస్ట్ చేసి చీ చీ స్ట్రాంగ్ కాఫీ తాగుతానని తెలిసి ఇలా ఇస్తావ్ ఏంటి మళ్ళీ కాఫీ కలుపుకుని పైకి తీసుకురమ్మని ఆర్డర్ వేసి వెళ్తుంది. ఇది ఇలాగే ప్రవర్తిస్తే నాలుగు రోజుల్లో గెంటేస్తారని రాహుల్ అనుకుంటాడు. ఇదేంటి అచ్చం నాలాగే బిహేవ్ చేస్తుందని రుద్రాణి అనుకుంటుంది.


కనకానికి వడ్డీ వ్యాపారి చంపక్ లాల్ ఫోన్ చేస్తాడు. తనకు వడ్డీ డబ్బులు కాదని అసలు డబ్బు కావాలని డిమాండ్ చేస్తాడు. తనకి అర్జెంట్ గా డబ్బులు కావాలని అంటాడు. ఇప్పటికిప్పుడు తీసుకురమ్మంటే ఎలా తెస్తానని అంటుంది. నీ వడ్డీ డబ్బుల కోసం ఆశ పడలేదు ఇంటి మీద ఆశతో అప్పు ఇచ్చానని అనేసరికి కనకం షాక్ అవుతుంది. రెండు రోజులు గడువు ఇస్తున్నా లేదంటే ఇంటికి వచ్చి కృష్ణమూర్తికి మొత్తం విషయం చెప్పి ఇల్లు స్వాధీనం చేసుకుంటానని వ్యాపారి తెగేసి చెప్తాడు. ఈ విషయం ఆయనకి తెలిస్తే చంపేస్తాడని భయపడిపోతుంది. కావ్య స్వప్న గదికి కాఫీ తీసుకుని వస్తుంది.


కావ్య: ఇది నీ పుట్టిల్లు కాదు ఎలా పడితే అలా ఉండటానికి


స్వప్న: అంటే అత్తారింట్లో ఎలా ఉండాలో నిన్ను చూసి నేర్చుకోవాలా


కావ్య: తాతయ్య వాళ్ళ ముందు ఎలా పడితే అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ ఇంటికి సాంప్రదాయాలు ఉన్నాయి. ఈరోజుకి వాటిని పాటిస్తారు మనం వాళ్ళని ఫాలో అవాలి


Also Read: కేడీ బ్యాచ్ తిక్క కుదురుస్తున్న రిషి- గతాన్ని గుర్తు చేయొద్దని వసుకి వార్నింగ్


స్వప్న: నిన్ను చూస్తున్నా కదా ఈ ఇంటికి పెద్ద మనిషిని చేశారు. నేను పెద్దింటి కోడలిని అయ్యాను ఇప్పుడు కూడా అలా చేయడానికి నేను నీలాగా ఉండను. పెద్ద ఇంటి కోడలిగా ఎలా ఉండాలో నాకు తెలుసు


కావ్య: నీ ప్రవర్తనతో నీమీద అనుమానం రాకుండా చూసుకుంటే మంచిది కడుపుతో ఉన్న ఆడది ఎలా ఉండాలో తెలుసుకుని ప్రవర్తించు లేదంటే నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కదు అనేసి గది బయటకి వచ్చేసరికి రాజ్ కోపంగా చూస్తూ ఉంటాడు. కొంపదీసి స్వప్న అక్క కడుపు సంగతి తెలిసిపోయిందని కావ్య టెన్షన్ పడుతుంది. మాట్లాడబోతుంటే రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial