Madhuranagarilo June 20th: మధుర చేసిన స్వీట్ రాధ తింటూ ఉండగా అప్పుడే మధుర చేతి తగిలి గ్లాస్ కింద పడుతుంది. నేను తీస్తాను ఉండండి అంటూ ఆ స్వీట్ టేబుల్ పై పెట్టి గ్లాస్ తీయడానికి వెళుతుంది రాధ. వెంటనే శ్యామ్ పరిగెత్తుకొని వచ్చి ఆ స్వీట్ తింటాడు. ఇక వాళ్లంతా ఆశ్చర్యపోగా.. శ్యాం స్వీట్ బాగుంది అని అంటాడు. వెంటనే మధుర అది రాధ తిన్న స్వీట్ అని అనటంతో అవునా అంటూ బాగుంది పాయసం అని తింటూ ఉంటాడు.


ఇక రాధ తనకు స్వీట్ చాలని ఇంట్లో నుంచి బయటకు వెళుతుంది. దారిలో తనకు చినిగిన అమ్మాయి ఫోటో కనిపించటంతో అది గతంలో శ్యామ్ దగ్గర నుండి చూడబోతున్న సమయంలో చినిగింది అని గుర్తుకు తెచ్చుకొని ఇంట్లోకి వెళ్లి మిగతా సగం ఉన్న ఫోటో చూసి షాక్ అవుతుంది. ఇక శ్యామ్ తననే ప్రేమిస్తున్నాడు అని తెలుసుకుంటుంది. ఆ తల భాగం ఉన్న ఫోటో తనకు గతంలో దొరికిందని తలుచుకుంటుంది.


వెంటనే శ్యామ్ దగ్గరికి వెళ్లి అతడిపై కోప్పడి చెంప దెబ్బ కొట్టినట్టు ఊహించుకుంటుంది. అదే సమయంలో శ్యామ్ అక్కడికి వచ్చి పండు ని నా దగ్గర ఉంచి మీరు షాపింగ్ కి వెళ్ళండి అని చెబుతాడు. అంతేకాకుండా కాస్త కొత్త కొత్తగా మాట్లాడటంతో రాధ మీరు ప్రేమించే అమ్మాయి గురించి అలా మాట్లాడొద్దు అని.. తనని అంటున్నాడని తెలుసుకొని శ్యామ్ ను స్కేల్ తీసుకొని కొడుతుంది.


అప్పుడే మధుర వచ్చి ఏం జరిగింది అనడంతో.. షాపింగ్ కి వెళ్తున్నారు అని పండు బుక్స్, స్కేల్ తీసుకెళ్లడానికి వచ్చాను అని అంటాడు శ్యామ్. ఆ తర్వాత శ్యామ్ అక్కడి నుండి రాధని చూస్తూ వెళ్తాడు. ఇక గన్నవరం ఎలాగైనా శ్యామ్, సంయుక్తల పెళ్లి జరుగుతుంది అని ఇక వాళ్ల గురించి ఆలోచించకూడదు అని ఫిక్స్ అవుతాడు. ఇక భర్తలో వచ్చిన మార్పును చూసి సంతోషపడుతుంది గన్నవరం భార్య.


ఆ తర్వాత శ్యామ్ రాధ ఆలోచనలో మునిగి ఉండగా సంయుక్త వచ్చి గమనించి పిలుస్తుంది. ఆలోచనలో ఉన్నావు అని అడగటంతో.. నీ గురించి అయితే కాదు అంటాడు శ్యామ్. ఫ్రెండ్స్ కి కార్డ్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను నువ్వు కూడా రా అని అడగటంతో తనకు తలనొప్పి ఉందని రాను అంటాడు. అప్పుడే పండు వచ్చి ఆడుకుందాం రా అనడంతో వెళ్తాడు. దాంతో సంయుక్త కోపంతో రగిలిపోతుంది.


తర్వాయి భాగంలో సంయుక్త తల్లి గోల్డ్ షాపులో బ్రాస్లెట్ రాధ చున్నీలో దాచిపెట్టి తనపై దొంగతనం నింద మోపిస్తుంది. దాంతో రాధ చాలా బాధపడుతుంది. ఇక సంయుక్త గన్నవరం వాళ్లకు కార్డ్స్ ఇస్తూ ఉండగా అవి మంటలు పడతాయి. ఇదేదో అపశకనం లాగా ఉంది అని గన్నవరం అనడంతో సంయుక్త షాక్ అవుతుంది.


Also Read: Prema Entha Madhuram June 20th: జోగమ్మపై అనుమానం పడుతున్న ఆర్య-అనుని చంపించడానికి సిద్ధమైన మాన్సీ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial