Krishnamma kalipindi iddarini July 6th: అఖిల బ్యూటీ పార్లర్ లో ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో లేడీ బ్రోకర్ ఫోన్లో బేరం చేస్తూ ఉంటుంది. ఇక అఖిల దగ్గరికి ఇద్దరు ఆడవాళ్లు వచ్చి తేడాగా మాట్లాడి వెళ్లిపోతారు. అదే సమయంలో ఒక వ్యక్తి వచ్చి డోర్ పెట్టడంతో అఖిల భయపడుతుంది. అప్పుడే అక్కడికి పోలీస్ వాళ్ళు వచ్చి అందర్నీ స్టేషన్ కి తరలిస్తారు.


ఇక మరోవైపు అఖిల ఎక్కడికి వెళ్లిందో అని గౌరీ, దుర్గ భవాని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోవడంతో ఈ సమయంలో ఎక్కడికి వెళ్లిందా.. కనీసం తనకు చెప్పకుండా వెళ్ళింది అని భయపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే సునంద ఫోన్ చేసి ఈరోజు నుండి పెళ్లి అయ్యేవరకు మా ఇంటికి వచ్చి పెళ్లి పనులు చేసుకోండని అంటుంది. కానీ భవాని మాత్రం కాస్త భయంతోనే కనిపిస్తూ ఉంటుంది.


ఇక మా కోడలు ఏం చేస్తున్నారు అని అడగటంతో గౌరీ మాత్రమే ఇక్కడ ఉంది అని అంటుంది భవాని. మరి చిన్న కోడలు అఖిల ఇక్కడ అనడంతో ఈరోజు గోరింటాకు ఫంక్షన్ అని ఇది మంచిగా జరగటానికి కోసం దేవుడి దగ్గరికి వెళ్లిందని చెబుతుంది. అఖిల పోలీస్ స్టేషన్లో తను ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వచ్చానని.. నా దగ్గర రాంబాబు లక్ష రూపాయలు తీసుకొని ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తానని మోసం చేశాడు అని ఇందులో తన తప్పులేదు అని చెబుతూ ఉంటుంది.


కానీ పోలీసు వాళ్ళు తన మాటలు పట్టించుకోరు. ఇక వాళ్ళు మీడియాకు కబురు పంపిస్తారు. ఆ తర్వాత కోర్టు కి వెళ్లాలని అంటారు. దాంతో అఖిల మరింత భయపడుతూ తనది తప్పు లేదని ఈరోజు మెహందీ ఫంక్షన్ ఉందని.. రెండు రోజుల్లో పెళ్లి అని కావాలంటే మా అమ్మతో మాట్లాడండి అని అనడంతో పోలీస్ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తాడు. భవాని వాళ్ళు భయపడుతుండగా అదే సమయంలో ఫోన్ వస్తుంది.


ఇక పోలీస్ అని చెప్పటంతో భవాని ఆ ఫోన్ గౌరీకి ఇస్తుంది. పోలీస్ జరిగిన విషయం చెప్పటంతో గౌరీ భయపడుతుంది. ఏదైనా మాట్లాడేది అంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి అని ఫోన్ కట్ చేస్తాడు పోలీస్. ఇక తల్లికి కూడా జరిగిన విషయం మొత్తం చెబుతుంది. దాంతో తను కూడా షాక్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అఖిల పోలీసులను బ్రతిమాలుతూ ఉంటుంది.


గౌరీ వాళ్ళు పోలీస్ స్టేషన్ కి చేరుకోగా అఖిల వెంటనే తన తల్లిని పట్టుకొని తనది తప్పేం లేదు.. ఒక్కరోజు అందంగా రెడీ అవ్వాలని రాంబాబు చెబితే వచ్చాను అనటంతో.. ఇదివరకే చెప్పాను కదా వాడి మాటలు నమ్మొద్దు అని భవాని తిడుతూ ఉంటుంది. ఇవాళ వారు మాట్లాడుతూ ఏడుస్తూ ఉండటంతో ఎస్ఐ వారిపై అరుస్తాడు. వెంటనే గౌరీ తన చెల్లెలు అటువంటిది కాదని దయచేసి వదిలేయండి అని అంటుంది.


ఇక భవాని కూడా మరో రెండు రోజుల్లో తను కోటీశ్వరుల ఇంటికి కోడలు కాబోతుంది తనకు ఈ పని చేయాల్సిన అవసరం ఏముంటుంది అని అనటంతో అప్పుడు ఎస్ఐ 25 లక్షలు కేసు కొట్టేస్తాను అని అంటాడు. వెంటనే భవాని గౌరీని పక్కకు తీసుకెళ్లి ఈశ్వర్ కి ఫోన్ చేసి డబ్బులు అడగమని చెబుతుంది. అలా అడగటం కరెక్ట్ కాదు కదా అని గౌరీ చెల్లెలి జీవితం పాడవుతుంది అని భవాని అంటుంది.


దానితో గౌరీ ఈశ్వర్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఓ వైపు ఈశ్వర్ గౌరీ కి గిఫ్ట్ తీసుకొని బయటికి వస్తుండగా అదే సమయంలో ఫోన్ వస్తుంది. ఇక ఫోన్ తీస్తుండగా దొంగలు ఫోన్ లాక్కెళ్తారు. అప్పుడు డ్రైవర్ ని పిలవడంతో దొంగలు ఎత్తుకెళ్లారని చెబుతాడు. అందులో గౌరీ తో దిగిన ఫోటోలు, తన వాయిస్ రికార్డులు అన్ని జ్ఞాపకాలు ఉన్నాయని అనుకొని వెంటనే కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు బయలుదేరుతాడు. ఇక ఈశ్వర్ ఫోన్ కలవక పోయేసరికి భవాని గౌరీని ఈశ్వర్ దగ్గరికి వెళ్ళమని పంపిస్తుంది.


Also Read: Rangula Ratnam July 5th: ‘రంగులరాట్నం’ సీరియల్: తల్లి, చెల్లి పరిస్థితి చూసి కుమిలిపోతున్న రఘు, సిద్దుపై కోప్పడిన పూర్ణ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial