'సుడిగాలి' సుధీర్ సినిమా ఎక్కడ - 'యానిమల్' దెబ్బకు షోస్, స్క్రీన్స్ గల్లంతు
చిన్న సినిమాకు విడుదల తేదీ ఎంత ముఖ్యం అనేది ఛోటా మోటా దర్శక నిర్మాతలు తెలుసుకోవడానికి 'కాలింగ్ సహస్ర' విడుదల ఓ ఉదాహరణ. డిసెంబర్ 1... అనగా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తుందీ సినిమా. అదే రోజు 'యానిమల్' విడుదల కూడా! ఆ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంది. దానికి పోటీ ఎందుకు? అని 'కాలింగ్ సహస్ర' దర్శకుడు అరుణ్ విక్కిరాలను మీడియా ప్రశ్నిస్తే... ''మేం 'యానిమల్'కి పోటీగా రావడం లేదు. 'యానిమల్'తో పాటు వస్తున్నాం'' అని సమాధానం ఇచ్చారు. ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న పెద్ద సినిమాతో రావడం వల్ల చిన్న సినిమాకు ఎంత నష్టం జరుగుతుందో ఆయన ముందుగా అంచనా వేయలేకపోయారు. పాపం... పెద్ద సినిమాతో విడుదల చేయాలనే నిర్ణయం 'కాలింగ్ సహస్ర' కొంప ముంచింది. ఈ సినిమా వైపు చూసే ప్రేక్షకులు కరువు అయ్యారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


బెస్ట్ క్యాప్షన్ ఇవ్వండి, ఫ్రీగా 'సలార్' టికెట్స్ గెలుచుకోండి - ప్రభాస్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు, ప్రేక్షకులకు ఓ సువర్ణ అవకాశం! ఆయన నటిస్తున్న తాజా సినిమా 'సలార్' సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఆశ పడుతున్నారా? ఆ షోకి 'సలార్' టీ షర్టులు, క్యాప్ (మర్చండైజ్) ధరించి వెళితే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అటువంటి వాళ్ళ కోసమే ఈ అవకాశం! 'సలార్' చిత్రీకరణలో ప్రభాస్ (Prabhas)కు తన ఫోనులో దర్శకుడు ప్రశాంత్ నీల్  ఏదో చూపిస్తున్న ఫోటోను చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకి క్యాప్షన్ ఇవ్వమని అభిమానులను కోరింది. బెస్ట్ క్యాప్షన్ ఇచ్చిన టాప్ 5 నెటిజనులకు తమ తమ ఏరియాలో 'సలార్' ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ ఇస్తామని పేర్కొంది. అంతే కాదు... మర్చండైజ్ కూడా అందిస్తామని వివరించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘హాయ్ నాన్న’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్-రష్మిక మాల్దీవుల పిక్స్ - నానిపై రౌడీబాయ్ ఫ్యాన్స్ గుర్రు
నేచురల్ స్టార్ నాని, అందాల నటి మృణాల్ ఠాకూర్ నటించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. సోల్ ఫుల్ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కిన ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'యానిమల్' బాక్సాఫీస్ రికార్డులు - మొదటి రోజు రణబీర్ సెంచరీ కొడతాడా?
'యానిమల్' సినిమా విడుదలకు ఇంకా ఎంతో సమయం లేదు. విదేశాల్లో ప్రీమియర్ షోలు మరికొన్ని గంటల్లో పడతాయి. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సినిమా కావడం, టీజర్ & ట్రైలర్‌లలో యాక్షన్ డోస్ ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చేయడంతో సినిమాపై విపరీతమైన బజ్ నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. మరి, సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయి? సినిమాకు ఓపెనింగ్స్ ఎంత రావచ్చు? అని ఒకసారి చూస్తే...  'యానిమల్' హిందీ వెర్షన్ షోస్ ద్వారా 50 నుంచి 55 కోట్ల రూపాయల గ్రాస్ రావచ్చని ఓ అంచనా. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


నయన తారకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన భర్త విఘ్నేష్ - మీరంటే డబ్బున్నోళ్లు బ్రో!
 లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు సందర్భంగా ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఖరీదైన గిఫ్టుతో సర్‌ప్రైజ్ చేశాడు. నయన్ ఇటీవలే 39వ ఏటలోకి అడుగుపెట్టింది. భర్త, పిల్లలతో తన బర్త్‌డే సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. అయితే, గిఫ్ట్ విషయాన్ని మాత్రం ఆ రోజు చెప్పలేదు. తాజాగా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది నయన్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)