Vijay Deverakonda Rashmika Mandanna Maldives Pic: నేచురల్ స్టార్ నాని, అందాల నటి మృణాల్ ఠాకూర్ నటించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. సోల్ ఫుల్ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కిన ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో ఓ షాకింగ్ ఘటన జరిగింది.


‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్, రష్మిక ఫోటో    


యాంకర్ సుమ హీరో నాని, హీరోయిన్ మృణాల్ తో మాట్లాడుతుండగా, ఒక్కసారిగా స్ర్కీన్ మీద విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫోటోను  ప్రదర్శించారు. గతంలో వీరిద్దరు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటో అది. ఈ పిక్ చూసి నాని, మృణాల్ తో పాటు అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. మృణాల్ అయితే, షాక్ అవుతూ ఇందేంటని నవ్వింది. సుమ కలుగజేసుకుని, “ఎవరు పెట్టార్రా ఈ ఫోటోను? రేయ్ నువ్వేనా ఆ రోజు బాలికి వెళ్లింది. ఇలాంటి పిక్చర్స్ తియ్యొచ్చా? ఎంత సెలబ్రిటీ ఫోటో గ్రాఫర్ అయినా వాళ్లకు ప్రైవసీ ఉండకూడదా?” అని మందలించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



నాని, యాంకర్ సుమపై విజయ్ ఆభిమానుల ఆగ్రహం


యాంకర్ సుమ ఈ ఫోటో గురించి కామెడీగా స్పందించినా, విజయ్, రష్మిక అభిమానులకు మాత్రం తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. కొంత మంది యాంకర్ సుమను టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య ఆమె ప్రతి ఈవెంట్ లోనూ ఏదో ఒక రచ్చ చేస్తుందని విమర్శిస్తున్నారు. ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్, రష్మిక ఫోటోకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. హీరో నానికి ఇది తెలిసి జరిగిందా? తెలియక జరిగిందా అని ప్రశ్నిస్తున్నారు.


వరుస వివాదాల్లో సుమా


గత కొంత కాలంగా సుమ యాంకరింగ్ చేస్తున్న ఈవెంట్స్ లో ఆమె మాట్లాడే మాటలు, వ్యవహార తీరు వివాదాస్పదం అవుతుంది. కొద్ది రోజుల క్రితం జర్నలిస్టుల గురించి ఆమె మాట్లాడిన మాటలు వివాదం అయ్యాయి. చివరకు ఆమె సారీ కూడా చెప్పాల్సి వచ్చింది. తాజాగా ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక, మహేష్ కలిసి ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించారని చెప్పడంపై విమర్శలు వచ్చాయి. తాజాగా ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్, రష్మిక ఫోటోను చూపించడం మరింత వివాదం అయ్యింది.


‘హాయ్ నాన్న’ సినిమాను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చెరుకూరి వెంకట మోహన్, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ సంయుక్తంగా నిర్మించారు. హేషామ్ అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫర్‌గా ఉన్నారు. జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు.


Read Also: అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా - ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మృణాల్


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply