Lokesh Kangaraju Production : ఐదంటే.. ఐదే సినిమాలు తీసి.. తన పేరునే ఓ బ్రాండ్​గా మార్చేశాడు లోకేష్ కనగరాజ్. మానగరం అనే సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి.. ఖైదీతో తెలుగు ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకున్నాడు. మాస్టర్​తో బ్లాక్​బాస్టర్​ అందుకుని.. విక్రమ్​తో దక్షిణాదిలోనే సక్సెస్​ఫుల్​ డైరక్టర్​గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా లియో సినిమాతో కూడా మంచి పేరును సంపాదించుకున్నాడు. పైగా సినీ అభిమానుల్లో లోకీవెర్స్​కి విపరీతమైన క్రేజ్​, డిమాండ్ ఉంది. అయితే ఈ దర్శకుడు తాజాగా మరో క్రాఫ్ట్​లోకి అడుగుపెట్టాడు.


లోకేష్ కనగరాజ్​ కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తాజాగా దానికి సంబంధించిన అప్​డేట్​ ఇచ్చాడు. జీ స్క్వాడ్​ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి.. ఫైట్​క్లబ్​ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా దానికి సంబంధించిన పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. అయితే ఈ జీ స్క్వాడ్ బ్యానర్​ (GSquad Banner)లో తన శిష్యులకు, మిత్రులకే అవకాశం కల్పించనున్నట్లు తెలిపాడు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల్ని కూడా ప్రోత్సాహించున్నట్లు తెలిపారు. ఎప్పటిలాగే అభిమానులందరూ.. తను నిర్మించే సినిమాలకు సహకారం అందిచాలని కోరారు.  


ఫైట్​ క్లబ్ (Fight Club)​ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో విజయ్​ కుమార్ నటిస్తున్నారు. విజయ్ బి కుమార్ కూడా మల్టీ టాలెంటెడ్​ యాక్టర్ అని చెప్పవచ్చు. కేవలం నటుడిగానే కాకుండా.. స్క్రిప్ట్ రైటర్​గా, డైరక్టర్​గా, పాటల రచయితగా.. ప్రొడ్యూసర్​గా తను మంచి పేరు సంపాదించుకున్నాడు. ఉరియాది 1, 2 సినిమాలను డైరక్ట్ చేస్తూ యాక్ట్ చేశారు. సూర్య నటించిన సూరారైపోట్రు.. తెలుగులో ఆకాశమే నీ హద్దురాగా విడుదలైంది. తమిళ్​లో ఈ సినిమాకు విజయ్ రైటర్​గా వ్యవహరించారు. దీంతో లోకేశ్ బ్యానర్​లో వస్తున్న ఫైట్​ క్లబ్​ సినిమాపై భారీ అంచనాలే పెరుగుతున్నాయి. ఈ సినిమాను అబ్బాస్​ రహ్​మత్ డైరక్ట్ చేస్తుండగా.. గోవింద్​ వసంత మ్యూజిక్ అందిస్తున్నారు.  


ఫైట్​ క్లబ్​ అనే పేరుకి కూడా మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉంది. బ్రాడ్​పిట్​ ముఖ్యపాత్రలో.. డేవిడ్​ ఫించ్​ దర్శకత్వం వహించిన సూపర్​ డూపర్​ హిట్ సినిమా ఫైట్​ క్లబ్​. ఈ స్పిల్ట్ పర్సనాలిటీని బేస్​ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించగా.. ఇది భారీ విజయాన్ని అందుకుంది. అయితే ప్రస్తుతం లోకేశ్ బ్యానర్​లో వస్తున్న ఈ ఫైట్​ క్లబ్​కూడా స్పిల్ట్​ పర్సనాలిటీ కథతోనే వస్తుందో లేదో సినిమా అప్​డేట్స్ వచ్చేవరకు వేచి చూడాలి. పోస్టర్​ చూస్తుంటే ఇది ఫుల్​ ఫ్యాక్డ్ యాక్షన్ ఫిల్మ్ వైబ్స్ తీసుకువస్తుంది. 


లోకీ వెర్స్​కి వస్తే.. ఖైదీ, రోలెక్స్, లియో, విక్రమ్​లోని క్యారెక్టర్లను లోకేశ్ కనగరాజ్ ఏ విధంగా కలుపుతాడనే ఆసక్తి సినీ అభిమానుల అందరిలోనూ ఉంది. లియో ప్రేక్షకుల అంచనాలు అంతగా అందుకోకపోయినా.. కమర్షియల్​గా మంచిగానే హిట్​ అయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ వేదికగా కూడా స్ట్రీమ్ అవుతుంది. నెట్​ఫ్లిక్స్​ ప్రస్తుతం టాప్​ 10 సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.  


Also Read : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply*