ప్రేక్షకులకు నటీమణులు నచ్చాలంటే ఎన్నో సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమాలో పక్కింటమ్మాయి పాత్రలో నేచురల్‌గా కనిపించినా చాలు.. ప్రేక్షకులు వారిని క్రష్ లిస్ట్‌లోకి యాడ్ చేసేస్తారు. అలాంటి వారిలో ఒకరు మృణాల్ ఠాకూర్. ‘సీతా రామం’ అనే ఒక్క చిత్రంతో యూత్‌ను ఫిదా చేసింది మృణాల్. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులలో చాలామంది తన ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పుడు మరోసారి అలాంటి నేచురల్ పాత్రలోనే ‘హాయ్ నాన్న’తో థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘హాయ్ నాన్న’ గురించి చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడింది మృణాల్. అంతే కాకుండా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి షేర్ చేసుకుంది. 


బెస్ట్ ఫ్రెండ్ దొరికింది..
తాజాగా ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో జరిగింది. అయితే ‘సీతా రామం’ కోసం వైజాగ్ వచ్చానని, మళ్లీ ‘హాయ్ నాన్న’ కోసం ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని చెప్తూ తన స్పీచ్‌ను ప్రారంభించింది మృణాల్. అప్పుడు సీతగా ఎంత ఆదరించారో.. ఇప్పుడు యశ్నగా కూడా అంతే ఆదరిస్తారని నమ్ముతున్నానని చెప్పింది. తెలుగమ్మాయిగా తనను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఈవెంట్‌కు దర్శకుడు శౌర్యువ్ హాజరు కాలేకపోయాడు. అందుకే దర్శకుడి తరపున కూడా తనే ప్రేక్షకులకు హాయ్ చెప్పింది. ‘హాయ్ నాన్న’ సినిమా వల్ల తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికింది అని, తను మరెవరో కాదు అంటూ చైల్డ్ ఆర్టిస్ట్ కియారా పేరు చెప్పింది. తను అతిపెద్ద సూపర్ స్టార్ అని, చాలా మైమరిపించే పర్ఫార్మెన్స్ ఇచ్చిందని కియారాను ప్రశంసల్లో ముంచేసింది మృణాల్.


నాని వల్లే..
దర్శకుడు శౌర్యువ్ వచ్చి నాని హీరో అని చెప్పగానే తను ఎలా ఫీల్ అయ్యిందో బయటపెట్టింది మృణాల్. ‘‘మేము జెర్సీ చేశాం. కలిసి గెలిచాం. కానీ ఈ సినిమాతో కలిసి నటించే అవకాశం దొరుకుతుంది అనుకున్నాను’’ అంటూ తన సంతోషాన్ని తెలిపింది. మంచి కో స్టార్‌గా ఉన్నందుకు నానికి థ్యాంక్స్ చెప్పింది. చాలా సాయంగా నిలబడ్డాడంది. యశ్న పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే అందులో నాని పాత్ర కూడా ఉంటుంది అని తెలిపింది. తన సహ నటుల వల్ల తను చాలా ఎంజాయ్ చేశానంది మృణాల్. ఊటీ, గోవా, హైదరాబాద్‌లలో షూటింగ్ జరిగిందని, షూట్ అంతా చాలా ఫన్‌గా సాగిందని బయటపెట్టింది. 


మ్యూజిక్ డైరెక్టర్‌తో ప్రేమలో పడిపోయాను..
‘హాయ్ నాన్న’ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడింది మృణాల్. హేషమ్ సంగీతం అందించిన మొదటి సినిమాలోని దర్శన పాటతోనే తాను ప్రేమలో పడిపోయానని చెప్పింది. తనకోసం కూడా సమయమా, అమ్మాడిలాంటి పాటలు ఇచ్చాడని గర్వంగా చెప్పుకుంటానంది. అంతే కాకుండా ఆ పాటలను కొంచెం హమ్ చేసింది కూడా. నాని, పాట మధ్య బాండింగ్ సినిమాలో చాలా బాగుంటుందని, ఒకవేళ ప్రేక్షకులు వారి బాండింగ్‌తో, వారితో ప్రేమలో పడకపోతే తన పేరు మార్చుకుంటానంటూ స్పీచ్‌ను ముగించింది మృణాల్. పాటలను కొంచమే హమ్ చేశారని, మరికొంచెం పాడమని సుమ అడగగా.. ప్రస్తుతం తన గొంతు బాలేదని, సక్సెస్ మీట్‌లో కచ్చితంగా పాడతానని మాటిచ్చింది. డిసెంబర్ 7న ‘హాయ్ నాన్న’ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: రణవీర్ సింగ్ ‘రీల్’ ఇంట్లో హత్య - ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ రాంధావ ప్యారడైజ్‌లో దుర్ఘటన


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply