ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాయి. అందులో రణవీర్ సింగ్, ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ కూడా ఒకటి. ఈ సినిమా థియేటర్లతో పాటు ఓటీటీలో విడుదలయిన తర్వాత కూడా మంచి రెస్పాన్స్‌ను సంపాదించుకుంది. అయితే తాజాగా మరోసారి ఈ మూవీ పేరు బాలీవుడ్ సర్కిల్లో వైరల్ అయ్యింది. కానీ అది మంచి కారణాల వల్ల అయితే కాదు. ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’లో రణవీర్ సింగ్ ఇల్లుగా చూపించిన బంగ్లాలో ఒక వ్యక్తిని షూట్ చేసి చంపడం కలకలం సృష్టించింది.
రాంధావ ప్యారడైజ్‌లో హత్య..
‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’లో రణవీర్ సింగ్.. రాంధావా ఫ్యామిలీకి చెందిన అబ్బాయిగా కనిపిస్తాడు. ఆ రాంధావ ఫ్యామిలీ అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. అదే రాంధావ ప్యారడైజ్. ఈ సినిమాలో చూపించిన రాంధావ ప్యారడైజ్ అనేది సెట్ కాదని.. నోయిడాలో నిజంగా ఉన్న ప్యాలెస్ అని మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. అలాంటి బంగ్లాలో తాజాగా ఒక హత్య జరగడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ బంగ్లాను గ్రేటర్ నోయిడా ఫార్మ్ హౌజ్ అని పిలుస్తారని సమాచారం. అందులో 55 ఏళ్ల అశోక్ యాదవ్ అనే వ్యక్తిని షూట్ చేసి చంపేశారట.
లైసెన్స్ ఉన్న గన్‌తో..
ఆ బంగ్లాలో జరిగిన పెళ్లి వేడుక కోసం అశోక్ యాదవ్ అక్కడికి వచ్చినట్టు సమాచారం. అయితే తన కొడుకు మామ చేతిలోనే తను హత్యకు గురయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు.. మరణించిన వ్యక్తి సెక్టార్ 51లో నివసించే అశోక్ యాదవ్‌గా గుర్తించారు. ఒక వార్తా సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ బంగ్లా విలువ దాదాపు రూ.19 నుంచి 29 కోట్లు ఉంటుందని సమాచారం. ‘‘గ్రేటర్ నోయిడా వెస్ట్‌లో ఉండే గౌర్ మల్బెర్రీ ఫార్మ్ హౌజ్‌లో ఒక పెళ్లి వేడుక జరుగుతోంది. అక్కడే సోమవారం దాదాపు రాత్రి 9.30 గంటల సమయంలో శేఖర్ అనే ఘజియాబాద్‌కు చెందిన వ్యక్తి.. అశోక్ అనే మరో వ్యక్తిని కాల్చి చంపినట్టు సమాచారం. అశోక్ కొడుకు, శేఖర్ కూతురు ప్రస్తుతం విడాకులు తీసుకునే పనిలో ఉన్నారు. అది ఇరు కుటుంబాల మధ్య గొడవలకు దారితీసింది. దాని వల్లే శేఖర్‌కు, అశోక్‌కు వాగ్వాదం మొదలయ్యింది. అప్పుడే శేఖర్.. అశోక్‌ను రెండుసార్లు తలలో షూట్ చేశాడు. దీని వల్ల పెళ్లి వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఆ గోలలో శేఖర్ తప్పించుకున్నాడు. శేఖర్ దగ్గర లైసెన్స్ ఉన్న గన్ ఉందని విచారణలో తేలింది’’ అంటూ పోలీసులు.. మీడియాకు సమాచారం ఇచ్చారు.
Also Read: ప్రియాంక, అమర్‌ల మధ్య శోభా చిచ్చు, సూపర్ సక్సెస్ అయిన లేడీ విలన్ ప్లాన్!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply