ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ బర్త్‌డే సర్‌ప్రైజ్ - ప్రశాంత్ నీల్ సినిమాపై అదిరిపోయే అప్డేట్
‘ఆర్ఆర్ఆర్’ లాంటి ప్యాన్ ఇండియా మూవీ తర్వాత ఎన్టీఆర్ రేంజే మారిపోయింది. అప్పటినుంచి తనకు ఇతర భాషా ప్రేక్షకులు కూడా ఫ్యాన్స్ అవ్వడం మొదలుపెట్టారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్‌ను అసలు స్క్రీన్‌పై చూడకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ ఎన్‌టీఆర్ మాత్రం లైన్‌లో రెండు ప్యాన్ ఇండియా చిత్రాలతో సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే కొరటాల శివతో కలిసి ‘దేవర’ మూవీ చేస్తుండగా.. ప్రశాంత్ నీల్ లాంటి మరో యాక్షన్ డైరెక్టర్‌ను కూడా లైన్‌లో పెట్టాడు ఎన్‌టీఆర్. ఇక ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ బయటికొచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘మిరాయ్’ నుంచి మనోజ్ గ్లింప్స్ విడుదల - ప్రపంచలోని అతీత శక్తుల్లో అతడు ఒకడట
మంచు హీరో మనోజ్ పుట్టినరోజుకు ఒక మూవీ అప్డేట్ వచ్చి ఎన్నో ఏళ్లయ్యింది. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతూ ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మనోజ్.. గత కొన్నేళ్లుగా వెనకబడ్డాడు. దానికి తన పర్సనల్ లైఫే కారణమని పలుమార్లు బయటపెట్టాడు కూడా. అయితే ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్‌లో అంతా సాఫీగా సాగడంతో బుల్లితెరపై హోస్ట్‌గా గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. ఈ హీరోను ఇష్టపడే అభిమానులు మాత్రం వెండితెరపై తన రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని ఎదురుచూశారు. ఫైనల్‌గా ఒక ప్యాన్ ఇండియా మూవీలో విలన్‌గా మంచు మనోజ్.. తన రీఎంట్రీని భారీ రేంజ్‌లో ప్లాన్ చేశాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'దేవర'కు ముందు ఓ లెక్క, ఇప్పుడో లెక్క - బాక్సాఫీస్ రికార్డులను తొక్కుకుంటూ పోవాలే!
ఎన్.టి.ఆర్. - ఈ పేరుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చరిత్ర ఉంది... ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ ఎన్నటికీ చెరగని ముద్ర వేశారు నందమూరి తారక రామారావు. మనవడు, హరికృష్ణ కుమారుడికి తన పేరే పెట్టారు. నటనలో టన్నుల కొద్దీ ట్యాలెంటుతో తాతకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీ రామారావు తెలుగు సినిమాలపై కాన్సంట్రేట్ చేశారు. మధ్యలో తమిళ, హిందీ సినిమాలతో విజయాలు అందుకున్నా అటు వైపు దృష్టి పెట్టలేదు. పెద్దగా అడుగులు వేయలేదు. ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా కుంభస్థలాన్ని బద్దలు కొట్టాల్సిన బాధ్యత జూనియర్ ఎన్టీఆర్ మీద ఉంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఆ ప్రొడ్యూసర్లు నా ఇమేజ్‌ను పాడుచేయాలని చూస్తున్నారు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను - పాయల్ రాజ్‌పుత్
ప్రస్తుతం హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కు టాలీవుడ్‌లో ఒక గుర్తింపు ఉంది. బోల్డ్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను తన గ్లామర్‌తో మెప్పించడంలో పాయల్ వెనకాడదు అని అంటుంటారు. అయితే పాయల్ క్రేజ్‌ను అడ్డం పెట్టుకొని కొందరు ప్రొడ్యూసర్స్ తన ఫేమ్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్నారట. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. అంతే కాకుండా అలా చేస్తున్నవారిపై కఠినమైన చర్యలు కూడా తీసుకుంటానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తను నటించిన మూవీ నిర్మాతలకు వార్నింగ్ ఇస్తూ పాయల్ చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
బెంగళూరులో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీలో తెలుగు సినీ నటి హేమ పాల్గొన్నారంటూ కన్నడ మీడియా సహా తెలుగులోనూ వస్తున్న ప్రచారంపై ఆమె స్వయంగా ఖండించారు. ఆ రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ కొట్టిపారేశారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని.. బెంగళూరు రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో అనవసరంగా తనను లాగుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో కూడా తనపై జరుగుతున్న ప్రచారాన్ని నటి హేమ ఖండించారు. ఈ మేరకు హేమ ఓ వీడియోను విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)