Ford New SUV: ఫోర్డ్ తన కొత్త ఎస్‌యూవీని గ్లోబల్ మార్కెట్లో పరిచయం చేసింది. ఈ కొత్త కారును ప్రపంచవ్యాప్తంగా అనేక మార్కెట్లలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో ఫోర్డ్ పరిచయం చేసిన కొత్త ఎస్‌యూవీ పేరు ఈక్వేటర్‌. ఈ కారు ఫోర్డ్ ఎవరెస్ట్ కంటే బలమైనదని చెప్పవచ్చు. ఈ ఫోర్డ్ కారు ప్రత్యేకత ఏమిటంటే ఈ ఎస్‌యూవీ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌తో వస్తుంది.


ఫోర్డ్ కొత్త కారులో ప్రత్యేకత ఏమిటి?
కార్ల కంపెనీ ఫోర్డ్ ఇంకా తన ఎస్‌యూవీని అధికారికంగా లాంచ్ చేయలేదు. అయితే ఈ కారు ఫోటో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ కారు ఫోటోను మాత్రమే చూసి  ఈ కారు లుక్, డిజైన్‌ను అంచనా వేయవచ్చు. ఈ కొత్త ఫోర్డ్ ఎస్‌యూవీ లుక్ చాలా అద్భుతంగా ఉంది.


ఫోర్డ్ ఈక్వేటర్‌లో చిన్న గ్రిల్ ఏర్పాటు చేశారు. అలాగే ఇది అందంగా కనిపించేలా ఎల్ఈడీ లైట్లతో రూపొందించారు. అంతేకాకుండా కారు ముందు బంపర్ కూడా కొన్ని మార్పులతో మార్కెట్లోకి రానుంది. ఈ కొత్త ఎస్‌యూవీ దాని మునుపటి మోడల్ లాగానే కనిపిస్తుంది. కానీ డిజైన్ మార్చడానికి కారులో కొత్త అల్లాయ్ వీల్స్ అమర్చారు. ఈ కారు ఇంటీరియర్ ఫోటో ఇంకా బయటకి రాలేదు. కానీ ఈ కారులో 27 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను చూడవచ్చని అంచనా తెలుస్తోంది. 


Read Also: ఎండ దెబ్బకు వాహనాల్లో మంటలు, ఈ టిప్స్ పాటిస్తే సేఫ్‌గా ఉండొచ్చు


కొత్త ఎస్‌యూవీ పవర్‌ట్రెయిన్ ఎలా ఉంటుంది?
ఫోర్డ్ లాంచ్ చేయనున్న ఈ కొత్త ఎస్‌యూవీలో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ను చూడవచ్చు. ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండవచ్చు. ఇది 150 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదనంగా 82 హెచ్‌పీ పవర్ అందించే ఎలక్ట్రిక్ మోటారు ఈ కారు ఇంజిన్‌కు అటాచ్ అయి ఉంటుంది. సీఏటీఎల్-సోర్స్‌డ్ బ్యాటరీ ప్యాక్ ఈ కారు ఇంజిన్ నుంచి మొత్తం 218 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది.


ఫోర్డ్ ఈక్వేటర్‌లో 1.5 లీటర్ ఎకోబూస్ట్ పెట్రోల్ పవర్‌ప్లాంట్ కూడా ఉండవచ్చు. ఇది 170 హెచ్‌పీ పవర్‌ని, 260 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ 2.0 లీటర్ ఎకోబూస్ట్ ఇంజన్ వేరియంట్‌ను నిలిపివేసే అవకాశం ఉంది.


ఫోర్డ్ కొత్త ఎస్‌యూవీ భారతదేశంలో విడుదల అవుతుందా?
మహీంద్రా నుంచి ఫోర్డ్ విడిపోయిన తర్వాత కంపెనీ తన సొంత సీ-సెగ్మెంట్ ఎస్‌యూవీపై పని చేస్తుంది. కానీ ప్రస్తుతం ఈ సీ-సెగ్మెంట్ ఎస్‌యూవీలో ఫోర్డ్ ఇండియా నుంచి ఎటువంటి డెవలప్‌మెంట్ కనిపించడం లేదు.






Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?