హీరోగా తిరువీర్ కొత్త సినిమా - పోస్టర్‌లో ‘భగవంతుడు’కి కొమ్ములు ఎందుకు ఉన్నాయో తెలుసా?
కొత్త కాన్సెప్ట్‌తో సినిమాలు వస్తే చాలు.. అందులో నటించిన హీరో ఎవరు అని కూడా పట్టించుకోకుండా హిట్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఈరోజుల్లో కొత్త కాన్సెప్ట్ కథలకు, సినిమాలకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఎంతోమంది బ్యాక్‌గ్రౌండ్ లేని హీరోలు కూడా ఇలాంటి సినిమాల ద్వారానే ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. అందులో తిరువీర్ కూడా ఒకరు. ఇప్పటికే ఒకట్రెండు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్న తిరువీర్.. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక తన అప్‌కమింగ్ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను ‘జబర్దస్త్’ ఫేమ్ అదిరే అభి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దాంతో పాటు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను యాడ్ చేశాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


శివరాత్రి స్పెషల్ - కన్నప్ప ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌, ఆకట్టుకుంటున్న మంచు విష్ణు ఇంటెన్సీవ్‌ లుక్‌
 చాలా గ్యాప్‌ తర్వాత మంచు మనోజ్‌ నటిస్తున్న చిత్రం కన్నప్ప. శివ భక్తుడు కన్నప్ప జీవితం కథ ఆధారంగా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో ఎప్పుడూ చూడని దృశ్య కావ్యంగా ఈ మూవీని తీర్చి దిద్దుతున్నారు. పీరియాడిక్ మైథలాజికల్ వస్తున్న ఈ సినిమాకు ది బ్రేవెస్ట్‌ వారియర్‌, ది అల్టిమేట్‌ డీవోటి అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఒక్కొ అప్‌డేట్‌ ఇస్తూ బజ్‌ క్రియేట్‌ చేస్తుంది మూవీ టీం. శివభక్తుడు కన్నప్ప జీవిత కథగా వస్తున్న ఈ సినిమా నుంచి శివరాత్రి సందర్భంగా సరప్రైజింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


గామి రివ్యూ: విశ్వక్‌సేన్ అఘోరాగా నటించిన ‘గామి’ ఎలా ఉంది?
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తూ దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్న హీరో విశ్వక్ సేన్. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’. ఎప్పుడో ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభం అయి, కఠోరమైన పరిస్థితుల్లో కూడా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ‘గామి’ ట్రైలర్ అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లిపోయింది. మరి ఆ అంచనాలను ‘గామి’ అందుకుందా? సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


భీమా రివ్యూ: క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్ ఇచ్చిన గోపీచంద్ - సినిమా హిట్టా? ఫట్టా?
మ్యాచో స్టార్ గోపీచంద్ పోలీస్ క్యారెక్టర్లు చేసిన ప్రతిసారి ఆయనకు మంచి పేరు, విజయాలు వచ్చాయి. ఆంధ్రుడు, శౌర్యం, గోలీమార్ సినిమాల్లో పోలీసుగా నటించారు. 'భీమా'తో మరోసారి పోలీసుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో సోషియో ఫాంటసీ ఎలిమెంట్ ఉందని గోపీచంద్ చెప్పారు. ఆ ట్విస్ట్ ఎలా ఉంటుంది? గోపీచంద్ ఎలా చేశారు? హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ ఎలా నటించారు? కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


శివశక్తిగా తమన్నా- ‘ఓదెల 2’ నుంచి స్టన్నింగ్ పోస్టర్‌ రిలీజ్!
సంపత్‌ నంది, హెబ్బాపటేల్‌ కాంబోలో సూపర్ హిట్ మూవీ ‘ఓదెల రైల్వే స్టేషన్‌’. ఆగష్టు 26, 2022లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను చిత్రబృందం వారణాసిలో మొదలు పెట్టారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)