Ooru Peru Bhairavakona Streaming on OTT: ప్రతి శుక్రవారం థియేటర్‌, ఓటీటీల్లో కొత్త సినిమాలు సందడి ఉంటుంది. అయితే ఈ శుక్రవారం చాలా స్పెషల్‌. ఎందుకంటే ఈ రోజే మహా శివరాత్రి కూడా. ఈ శివరాత్రికి థియేటర్లో అఘోర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన గామి, మ్యాచో స్టార్‌ గోపిచంద్‌ భీమా వంటి పెద్ద సినిమాలు బిగ్‌స్క్రీన్‌కు వచ్చాయి. వాటితో పాటు మలయాళ డబ్బింగ్‌ ప్రేమలు కూడా నేడు థియేటర్లోకి వచ్చింది. మరోవైపు శివరాత్రి స్పెషల్‌గా రెండు థ్రిల్లర్‌ మూవీస్‌ సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేశాయి. వాటితో పాటు స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి మూవీ కూడా స్ట్రీమింగ్‌కి వచ్చేసింది.  'హనుమాన్' కూడా స్ట్రీమింగ్ అవుతుంతుందన్నారు. కానీ ఇది వార్తలకే పరిమితం అయ్యింది. మరి ఈ శుక్రవారం ఓటీటీలో సందడి చేస్తున్న ఆ సినిమాలేంటో చూద్దాం!


ఊరు పేరు భైరవకోన 


యంగ్ హీరో సందీప్‌ కిషన్‌ నటించని రీసెంట్‌ హారర్‌ మూవీ ఊరుపేరు భైరవకోన. ఈ చిత్రం విడుదలైన నెల రోజులు కూడా కాకుండానే ఓటీటీకి వచ్చేసింది. నిజానికి ఎన్నో అడ్డంకులు దాటుకుని 'ఊరుపేరు భైరవకోన' థియేటర్లో రిలీజ్‌ అయ్యింది. ఏళ్లుగా షూటింగ్‌ జరుపుకొని వాయిదాల మీద వాయిదాలు పడుతు చివరకు ఈ ఏడాది ఫిబ్రవరి 16న థియేటర్లో రిలీజ్‌ అయ్యింది. ఫస్ట్‌డే సుమారు రూ.6కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసింది. ఆ తర్వాత కలెక్షన్స్‌లో డ్రాప్‌ కనిపించినా.. ఫైనల్‌గా డీసెంట్‌ వసూళ్లే సాధించింది. కానీ కొద్ది రోజుల్లోనే థియేర్ల నుంచి వచ్చేసిన ఈ చిత్రం విడుదలైన 21 రోజుల్లోనే ఓటీటీకి వచ్చింది. మొన్నటి వరకు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ zee5 స్ట్రీమింగ్‌ అన్నారు. కానీ  ఈ చిత్రం అమెజాన్‌ ప్రైంలో వచ్చి మరో షాకిచ్చింది. జీ5 సంస్థ ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ దక్కించుకుందన్నారు. ఇందుకోసం మేకర్స్‌కు ఫ్యాన్సీ రేట్‌ ఆఫర్‌ చేసిందంటూ మూవీ రిలీజ్‌ టైంలో వార్తలు వచ్చాయి. కానీ అి రూమర్‌గా గానే మిగిలిపోయింది. 


ఈ సినిమాను చివరికి అమెజాన్‌ ప్రైం సొంతం చేసుకుని శివరాత్రి సందర్భంగా అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్‌కు ఇచ్చేసింది. ఏఐ ఆనందర్‌ దర్శకత్వంలో అనిల్‌ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్‌ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా చేశారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు. వెన్నెల కిశోర్, హర్ష, రవి శంకర్ కీలక పాత్రలను పోషించారు. 'ఊరు పేరు భైరవకోన' సినిమా రిలీజ్‌కి ముందు చిక్కులు ఎదుర్కొంది. లీగల్‌ ఇష్యూస్‌ రావడంతో సినిమా అనుకున్న టైం కంటే ఆలస్యంగా విడుదలైంది. 


మేరీ క్రిస్మస్


విజయ్ సేతుపతి హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరోయిన్ గా ఇటీవల తెరకెక్కిన చిత్రం మేరీ క్రిస్మస్‌. శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన  సంక్రాంతి సందర్భంగా థియేటర్లో రిలీజ్‌ అయ్యింది. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. శివరాత్రి సందర్భంగా నేడు ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే.  వారు సొంతం చేసుకోగా ఇందులో రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.


కథ: ఆల్బర్ట్ (విజయ్ సేతుపతి) క్రిస్మస్ ముందు రోజు రాత్రి ఏడు సంవత్సరాల తర్వాత బాంబేకు తిరిగి వస్తాడు. తన తల్లి చనిపోయిన సంగతి ఇంటి పక్కన ఉండే వ్యక్తి (టినూ ఆనంద్) చెప్తాడు. అదే రోజు ఒక రెస్టారెంట్‌లో భోజనం చేయడానికి వెళ్తాడు. అక్కడికి మరియా (కత్రినా కైఫ్) తన కూతురితో కలిసి వస్తుంది. ఆమె ఎవరిని అయితే డేట్‌కు తీసుకెళ్లడం కోసం వస్తుందో అతను మరియా బిడ్డను చూసి డేట్ మధ్యలో వదిలేసి వెళ్లిపోతాడు. ఆల్బర్ట్ అక్కడి నుంచి సినిమాకు వెళ్లిపోతాడు. మరియా కూడా అనుకోకుండా అదే సినిమాకు వెళ్తుంది. అక్కడ ఇద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. ఆల్బర్ట్‌కు ఎవరూ లేరని తెలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు మరియా తన ఇంటికి ఆహ్వానిస్తుంది. ఆల్బర్ట్, మరియా మధ్యలో ఒకసారి బయటకు వెళ్లి వచ్చే సరికి మరియా భర్త హాల్లో చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మరియా భర్తను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఆల్బర్ట్ గతం ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.



'అన్వేషిప్పిన్ కండేతుమ్'


గతనెల మలయాళంలో విడుదలైన మంచి విజయం సాధించిన చిత్రం 'అన్వేషిప్పిన్ కండేతుమ్'. ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈచిత్రం మంచి విజయం సాధించింది. థియేటర్లోకి కేవలం మాలయాళంలోనే రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీకి వచ్చింది. ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ మూవీని రైట్స్‌ సొంతం చేసుకుని ఓటీటీలోకి నేటి నుంచి స్ట్రీమింగ్‌కి ఇచ్చింది. ఇది తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి వచ్చింది.