ఆడు జీవితం రివ్యూ: సౌదీలో కూలీల కష్టాలు చూడగలమా? - పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ఎలా ఉందంటే?
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన సినిమా 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం'. బతుకు దెరువు కోసం సౌదీ వెళ్లిన మలయాళీ నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు? అక్కడి నుంచి ఇండియాకు మళ్లీ ఎలా వచ్చాడు? అనేది సినిమా. వాస్తవంగా జరిగిన కథ ఇది. బెన్యామిన్ రాసిన 'ఆడు జీవితం' (గోట్ డేస్) నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
బన్నీకి అరుదైన ఘనత దక్కింది. దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ వ్యాక్స్‌ స్టాట్చ్యూ (మైనపు విగ్రహం) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే అల్లు అర్జున్‌ దుబాయ్‌ వెళ్లి స్వయంగా తన వ్యాక్స్‌ విగ్రహన్ని ఆవిష్కరించడం విశేషం. నిన్న(మార్చి 28) రాత్రి 8 గంటలకు ఈ విగ్రహం ఆవిష్కరణ జరగింది. దీనికి స్పెషల్‌ గెస్ట్‌గా వెళ్లిన బన్నీ స్వయంగా తన విగ్రాహన్ని ఆవిష్కరించడమే కాదు దానితో ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా తన వ్యాక్స్‌ స్టాట్చ్యూతో కలిసి దిగిన ఫోటోలను బన్నీ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ట్విస్ట్ ఇచ్చిన సిద్ధూ, అదితి - పెళ్లి కాదు, కానీ పెళ్లికి ముందు ఓ అడుగు!
హీరో సిద్ధార్థ్ (Siddharth), హీరోయిన్ అదితి రావు హైదరి (Aditi Rao Hydari) పెళ్లి చేసుకున్నారని బుధవారం వార్తలు వచ్చాయి. అయితే... అందులో నిజం లేదని వాళ్లిద్దరూ పరోక్షంగా చెప్పారు. పెళ్లి విషయంలో ఓ అడుగు ముందుకు వేసినట్లు స్పష్టం చేశారు. పెళ్లి చేసుకోలేదు... నిశ్చితార్థం చేసుకున్నామని సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


నన్ను తిట్టుకోకండి, ఇప్పటికే లీకైన పాట కాబట్టి అలా అనిపిస్తోంది - ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌పై దిల్ రాజు క్లారిటీ
రామ్ చరణ్ పుట్టినరోజును సెలబ్రేట్ చేయడం కోసం టాలీవుడ్ మేకర్స్ అంతా ఒక్కచోట చేరారు. ఈ ఈవెంట్‌కు చాలామంది ఫ్యాన్స్ కూడా హాజరయ్యారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఈవెంట్‌లో పాల్గొని ‘గేమ్ ఛేంజర్’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా దిల్ రాజు స్పీచ్ ప్రారంభించగానే రిలీజ్ డేట్ కావాలా అని ఫ్యాన్స్‌ను అడిగారు. ‘‘మీ ఓపికకు చాలా పరీక్ష పెడుతున్నాం. ఒక ఉప్పెన, ఒక తుఫాను వచ్చే ముందు ఓపిక పట్టక తప్పదు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి రామ్ చరణ్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ కాదు గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆ రేంజ్‌కు సినిమా రీచ్ అవ్వాలంటే శంకర్.. ఒక్కొక్క పాటను, ఒక్కొక్క సీన్‌ను తీర్చిదిద్దుతున్నారు’’ అని తెలిపారు దిల్ రాజు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


క్రేజీ అప్‌డేట్‌, అప్పుడే 'పుష్ప 3' టైటిల్‌ కూడా వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
టాలీవుడ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రాల్లో 'పుష్ప: ది రూల్‌' (Pushpa 2) ఒకటి. అల్లు అర్జున్‌ హీరో సుకుమార్‌ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వరల్డ్‌ వైడ్‌గా విపరీతమైన బజ్‌ ఉంది. ఈ మూవీ నుంచి రోజుకో అప్‌డేట్స్‌ బయటకు వస్తూ మరింత హైప్‌ పెంచుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు పార్ట్‌ 3 కూడా ఉండోచ్చని అల్లు అర్జున్‌ హింట్‌ ఇచ్చాడు. అప్పటి నుంచి పుష్ప: పార్ట్‌ 3పై తరచూ ఏదోక వార్త బయటకు వస్తుంది. తాజాగా పుష్ప 3కి టైటిల్‌ ఇదేనంటూ తాజాగా ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. మూడో పార్ట్ కు 'పుష్ప: ది రోర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ ప్రచారం జరుగుతుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)