Actress Amani: అందుకే జగపతి బాబు, సౌందర్య పెళ్లి చేసుకుంటారని రూమర్ వచ్చింది - ఆమని

Actress Amani: జగపతి బాబు, సౌందర్య.. ఈ ఇద్దరితో ఆమనికి మంచి సాన్నిహిత్యం ఉంది. అసలు వారిద్దరూ పెళ్లి చేసుకంటారని రూమర్స్ ఎలా, ఎందుకు మొదలయ్యాయో తాజాగా ఆమని బయటపెట్టారు.

Continues below advertisement

Amani About Jagapathi Babu and Soundarya Marriage Rumors: ఒకప్పుడు హీరోయిన్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు ఆమని. చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. తల్లి పాత్రలు చేస్తూ బిజీ అయ్యారు. ఒకప్పుడు సీనియర్ హీరోలు చాలామందితో ఆమని.. హీరోయిన్‌గా జతకట్టారు. ముఖ్యంగా జగపతి బాబుతో తన కెమిస్ట్రీ చాలా బాగుండేదని ప్రేక్షకులు ఇప్పటికీ మాట్లాడుకుంటారు. ఇక సినీ పరిశ్రమలో తనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడగగా.. సౌందర్యతో మంచి సాన్నిహిత్యం ఉండేదని చాలాసార్లు బయటపెట్టారు ఆమని. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో జగపతి బాబు, సౌందర్య పెళ్లి రూమర్స్‌పై ఆమె స్పందించారు.

Continues below advertisement

స్టార్‌డమ్ దక్కలేదు..

పెద్ద పెద్ద స్టార్లతో తాను చేయకపోయినా, తనకు స్టార్‌డమ్ దక్కకపోయినా మంచి పాత్రలు చేశానని, దానికి సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు ఆమని. ‘‘పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లతో చేశాను. బాపు అంటే తెలియనివారు ఎవరుంటారు. అందంగా లేనివారిని కూడా ఆయన అందంగా చూపిస్తారు. దేవుడి దయ వల్లే ఎంతోమంది పెద్ద దర్శకులతో పనిచేసే అవకాశంతో పాటు మంచి క్యారెక్టర్లు చేసే ఛాన్స్ నాకు దక్కింది’’ అని తన కెరీర్ గురించి సంతోషం వ్యక్తం చేశారు ఆమని. ఇక సినీ పరిశ్రమలో తనకు ఉన్న స్నేహితుల గురించి మాట్లాడుతూ.. తాను ఎక్కువగా ఎవరితో మాట్లాడనని, ఎక్కువ ఫ్రెండ్స్‌ను మెయింటేయిన్ చేసేవారు కాదని బయటపెట్టారు. అలా తాను చనువు తీసుకొని మాట్లాడిన ఒకేఒక్క హీరోయిన్ సౌందర్య అని అన్నారు.

మాటలు రాలేదు..

‘‘సౌందర్య బెంగుళూరు, నేను బెంగుళూరు. అలా కనెక్ట్ అయ్యాం. ఆ సమయంలో 4,5 సినిమాలు కలిసి చేశాం. అలా చేసినప్పుడు ఎక్కువగా మా కాంబినేషన్ ఉండేది. పక్కపక్కనే కూర్చునేవాళ్లం. తను కూడా ఒక చిన్నపిల్లాలాగానే. కన్నడ మాట్లాడడం వల్లే తనకు నా మీద, నాకు తన మీద ప్రేమ వచ్చింది. కన్నడ పాటలు పాడుకునేవాళ్లం. ఒకరితో ఒకరం పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకున్నాం. పెళ్లయ్యాక కూడా వాళ్ల అమ్మ నాతో ఫోన్ చేసి మాట్లాడేవారు. ఇంటికి రమ్మని పిలిచేవారు కానీ నేను వెళ్లలేకపోయాను. సౌందర్య వాళ్ల నాన్న చనిపోయినప్పుడు కూడా తను రాత్రి ఫోన్ చేసిందని వెంటనే కారు తీసుకొని తన దగ్గరికి వెళ్లిపోయాను. నన్ను హగ్ చేసుకొని ఏడ్చేసింది. ఆ సమయంలో ఒకరికి ఒకరం ధైర్యం చెప్పుకున్నాం. సౌందర్య చనిపోయిందని చెప్తే నేను నమ్మలేదు. చిన్నపిల్లలాగా ఏడ్చేశాను, మాటలు రాలేదు’’ అని చెప్పారు ఆమని.

అప్పటికే ఆయనకు పెళ్లయ్యింది..

‘‘సౌందర్యను కాకుండా నన్ను తీసుకెళ్లొచ్చు కదా అని దేవుడి దగ్గర ఏడ్చేశాను. ఇప్పటికీ తన సినిమాలు చూస్తే ఏడుపొచ్చేస్తుంది. వాళ్ల నాన్న చెప్పారని హీరోయిన్ అయ్యింది, కానీ తర్వాత తనకే ఇంట్రెస్ట్ వచ్చి చేయడం మొదలుపెట్టింది. తనకు సామాన్యంగా హౌజ్ వైఫ్‌లాగా ఉండడమే ఇష్టం. కానీ పర్సనల్ లైఫ్ చూడకుండానే వెళ్లిపోయింది’’ అని సౌందర్య గురించి గుర్తుచేసుకున్నారు ఆమని. ఇక జగపతి బాబు, సౌందర్య పెళ్లిపై వచ్చిన రూమర్స్‌పై ఆమని క్లారిటీ ఇచ్చారు. ‘‘జగపతి బాబుకు పెళ్లయ్యి పిల్లలు ఉన్నారు. ఆయనకు సౌందర్య అంటే గౌరవం, ఇష్టం. సౌందర్యకు అయితే అసలు ఆ ఆలోచనే లేదు. వాళ్ల నాన్న చెప్పారని ఆ అబ్బాయిని పెళ్లిచేసుకుంది. నాన్న ఉన్నంత వరకు ఆయన మాట వినేది, ఆ తర్వాత అన్నయ్య మాటే. జగపతి బాబు, సౌందర్య కలిసి సినిమాలు ఎక్కువగా చేసినందుకు ఆ రూమర్ వచ్చినట్టుంది’’ అని రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు ఆమని.

Also Read: రెహమాన్ సాంగ్స్, దేవిశ్రీ పాటలకు మించి ఉంటాయి: దర్శకుడు బుచ్చిబాబు

Continues below advertisement