Gopichand Bhimaa Movie OTT Release Date: మాచో స్టార్‌ గోపిచంద్‌ (gopichand) ఇటీవల నటించిన చిత్రం 'భీమా' (Bhimaa Movie). పవర్ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. విడుదలైన ఫస్ట్‌డే షో నుంచి డివైడ్ టాక్‌ తెచ్చుకుంది. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అనుకున్నా ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌కు సొంతమైంది. దీంతో ఈ మూవీ కనీసం వసూళ్లు కూడా చేయలేకపోయింది. ఇక గోపిచంద్‌కు 'భీమా'తో బిగ్‌ హిట్‌ పడ్డట్లే అని ఆశ పడిని ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురైంది. కొంతకాలంగా వరుస ప్లాప్స్‌ చూస్తున్న గోపిచంద్‌ కూడా ఈ మూవీపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా కూడా ఆయనను డిసప్పాయింట్‌ చేసింది. శివరాత్రి సందర్భంగా మార్చి 8న థియేటర్‌లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీకి వచ్చేందుకు రెడీ అవుతుంది.


Bhimaa Locks OTT Partner?: ఈ తాజా బజ్‌ ప్రకారం ఈ మూవీ ఏప్రిల్‌ 5న ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్‌కు (Bhimaa OTT Release) వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన లేదు. కానీ, ప్రస్తుతం సోషల్‌ మీడయాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. కాగా 'భీమా' డిజిటల్‌ రైట్స్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar) సొంతం చేసుకుందట. ఇక మూవీ విడుదలై దగ్గర దగ్గర నెల రోజులు కావోస్తుంది. ఈ క్రమంలో సినిమాను ఏప్రిల్‌ 5 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేసేందుకు సదరు సంస్థ సన్నాహాలు చేస్తుందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కన్నడ డైరెక్టర్‌ ఎ.హర్హ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మలు హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. 



Also Read: ఓ మై గాడ్‌.. మీకు ఫుల్‌గా పడిపోయానండి బాబూ! - అంచనాలు పెంచేస్తున్న ఫ్యామిలీ స్టార్‌ ట్రైలర్‌ 


భీమా కథ విషయానికి వస్తే.. మహేంద్రగిరిలో భవాని (ముఖేష్ తివారి)కి తిరుగులేదు. ఆయనకు ఎదురు తిరిగితే పోలీస్ అధికారుల్ని అయినా సరే చంపేస్తారు. చెక్ పోస్ట్ దగ్గర ట్యాంకర్ల జోలికి ఎవరొచ్చినా ఊరుకోడు. ఒక ఎస్సై (కమల్ కామరాజు)ను చంపేస్తాడు. ఆ తర్వాత భీమా (గోపీచంద్) ఎస్సైగా వస్తాడు. వచ్చీ రావడంతో భవానీకి వార్నింగ్ ఇస్తాడు. భవాని మనుషుల్ని టార్గెట్ చేస్తాడు. ఆఖరికి చెక్ పోస్ట్ దగ్గర ట్యాంకర్ల దగ్గరకు వస్తాడు. భవాని ట్యాంకర్లలో రహస్యం ఏమిటి? పకృతి వైద్యుడు రవీంద్ర వర్మ (నాజర్) ఏం చేశాడు? విద్య (మాళవికా శర్మ) వల్ల భీమా జీవితంలో ఏం జరిగింది? రామా (గోపీచంద్), పారిజాతం (ప్రియా భవానీ శంకర్) ఎవరు? భీమా మీద విజయం కోసం భవాని తన బలం, బలగాన్ని మహేంద్రగిరిలో దించడంతో ఏం జరిగింది? వీళ్లకు, మహేంద్రగిరిలోని పరశురామ క్షేత్రంలో ఐదు దశాబ్దాలుగా మూత పడిన శివాలయానికి సంబంధం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.