Siddharth Aditi Rao Hydari: ట్విస్ట్ ఇచ్చిన సిద్ధూ, అదితి - పెళ్లి కాదు, కానీ పెళ్లికి ముందు ఓ అడుగు!

సిద్ధార్థ్, అదితి రావు హైదరి పెళ్లి చేసుకున్నారని బుధవారం వార్తలొచ్చాయి. అది నిజం కాదంటూ వాళ్లిద్దరూ ట్విస్ట్ ఇచ్చారు. తాము పెళ్లి చేసుకోలేదని పరోక్షంగా చెప్పారు. పెళ్లికి ఓ అడుగు ముందుకు వేశారు.

Continues below advertisement

హీరో సిద్ధార్థ్ (Siddharth), హీరోయిన్ అదితి రావు హైదరి (Aditi Rao Hydari) పెళ్లి చేసుకున్నారని బుధవారం వార్తలు వచ్చాయి. అయితే... అందులో నిజం లేదని వాళ్లిద్దరూ పరోక్షంగా చెప్పారు. పెళ్లి విషయంలో ఓ అడుగు ముందుకు వేసినట్లు స్పష్టం చేశారు. పెళ్లి చేసుకోలేదు... నిశ్చితార్థం చేసుకున్నామని సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. 

Continues below advertisement

యస్... ఇద్దరూ అసలు విషయం చెప్పేశారు!
అదితి రావు హైదరి గురువారం మధ్యాహ్నం సోషల్ మీడియాలో సిద్ధార్థ్ (Siddharth Engaged)తో దిగిన ఫోటో షేర్ చేశారు. ''ఆయన ఎస్ చెప్పారు. నిశ్చితార్థం జరిగింది'' అని పేర్కొన్నారు. సిద్దార్థ్ సైతం అదే సమయంలో సేమ్ ఫోటో షేర్ చేశారు. (Aditi Rao Hydari Engaged) ''ఆమె ఎస్ చెప్పింది. నిశ్చితార్థం చేసుకున్నాం'' అని పేర్కొన్నారు. పెళ్లికి ఓ అడుగు ముందుకు వేసినట్లు ఇద్దరూ స్పష్టం చేశారు.

Also Read: ఆడు జీవితం రివ్యూ: సౌదీలో కూలీల కష్టాలు చూడగలమా? - పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ఎలా ఉందంటే?

సిద్ధూ, అదితి పెళ్లి చేసుకున్నారనే ప్రచారానికి కారణం వాళ్లిద్దరే. అదితి రావు హైదరి తెలంగాణ మూలాలు ఉన్న అమ్మాయి. ఆమె వనపర్తి సంస్థాన వారసురాలు. వనపర్తి సంస్థానం చివరి రాజు జె రామేశ్వర్ రావు మనవరాలు. అదితి తల్లి పేరు విద్యా రావు. ఆమె హిందుస్థానీ క్లాసికల్ సింగర్. అందువల్ల, వనపర్తి సంస్థానానికి చెందిన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు.  

వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి దేవాలయంలో సిద్ధార్థ్, అదితి రావు హైదరి ఉంగరాలు మార్చుకున్నారు. అయితే... అటు సిద్ధార్థ్ గానీ, ఇటు అదితి రావు హైదరి గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. మీడియాకు సమాచారం ఇవ్వలేదు. పైగా... నిశ్చితార్థం జరిగిన సమయంలో మీడియాతో పాటు ఇంకెవరినీ దేవాలయంలోకి అనుమతించలేదు. దాంతో అందరూ పెళ్లి అని భావించారు. అదీ సంగతి!

Also Readటిల్లు స్క్వేర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఇది 'మ్యాడ్'కు తాత, పక్కా బ్లాక్ బస్టరే!

ఆయనకు 44... ఆమె 37... 'మహా సముద్రం'లో ప్రేమ!
కథానాయకుడిగా భారతీయ భాషల హద్దులు చెరిపిన నటుల్లో సిద్ధార్థ్ ఒకరు. పాన్ ఇండియా ఫిలిమ్స్ కల్చర్ రాకముందు హీరోగా తమిళ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేశారు. తర్వాత హిందీ, తెలుగు సినిమాల్లోనూ హీరోగా నటించి భారీ  విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఆయన వయసు 44 ఏళ్లు. తన కంటే ఏడేళ్లు చిన్నదైన, హిందీ సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుని తెలుగు సినిమాల్లోనూ కథానాయికగా నటించిన అదితి రావు హైదరితో ఆయన ప్రేమలో పడ్డారు.


అజయ్ భూపతి తెరకెక్కించిన 'మహా సముద్రం'లో సిద్ధార్థ్, అదితి రావు హైదరి జంటగా నటించారు. ఆ సినిమా చేసేటప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వ్యక్తిగత జీవితంలో విషయం కనుక తొలుత రహస్యంగా ఉంచారు. మీడియా కెమెరా కంటికి జంటగా చిక్కడంతో అసలు విషయం తెలిసింది. ఆల్రెడీ అదితికి గతంలో వివాహమైంది. విడాకులు తీసుకున్నారు. సిద్ధార్థ్ సైతం రెండుసార్లు విడాకులు తీసుకున్నట్లు సమాచారం.

Continues below advertisement