Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?

నారా రోహిత్ హీరోగా ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ప్రతినిధి 2'. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సినిమా టీజర్ విడుదల కానుంది.

Continues below advertisement

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కథానాయకుడు నారా రోహిత్ (Nara Rohit). ఆయనకు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెదనాన్న. ఆయన తండ్రి రామ్మూర్తి నాయుడు సైతం రాజకీయాల్లో ఉన్నారు. అయితే... నారా రోహిత్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించింది లేదు. సినిమాలపై దృష్టి పెట్టారు. కొంత విరామం తర్వాత ఆయన హీరోగా కమ్ బ్యాక్ ఇస్తున్న సినిమా 'ప్రతినిధి 2' (Pratinidhi 2 Movie).

Continues below advertisement

దర్శకుడిగా పరిచయం అవుతున్న జర్నలిస్ట్ మూర్తి
'ప్రతినిధి 2' సినిమాతో ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాజకీయ నాయకులతో న్యూస్ ఛానల్‌లో డిబేట్స్ ద్వారా, రాజకీయ విశ్లేషణలతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులైన ఆయన... నటుడిగా 'ప్లే బ్యాక్' చేశారు. ఇప్పుడు దర్శకుడిగా రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా 'ప్రతినిధి 2' చేశారు.

నారా రోహిత్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రతినిధి' 2014లో విడుదలైంది. ఆ ఫ్రాంచైజీలో వస్తున్న రెండో సినిమా 'ప్రతినిధి 2'. One man will stand again, against all odds... అనేది ఉప శీర్షిక. దీనిని వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...

చిరంజీవి చేతుల మీదుగా టీజర్ రిలీజ్
Pratinidhi 2 Movie Teaser: మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 'ప్రతినిధి 2' టీజర్ విడుదల చేయనున్నారు. శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో టీజర్ విడుదల చేయడడంతో పాటు చిత్ర బృందానికి చిరు తన శుభాకాంక్షలు తెలియజేస్తారు.

Also Read: అందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా 'ప్రతినిధి'లో నారా రోహిత్ వన్ సైడ్ తీసుకోలేదు. ప్రజల్లో ఆలోచన కలిగించే కథ, సన్నివేశాలతో ఆ సినిమా చేశారు. 'ప్రతినిధి 2' సైతం అదే విధంగా ఉంటుందని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే విధంగా సినిమా ఉంటుందని తెలిసింది. ఆల్రెడీ విడుదల చేసిన ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. దాంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.

శ్రీరామ నవమికి 'ప్రతినిధి 2' విడుదల!?
Prathinidhi 2 movie release date: ఒక్క పాట మినహా 'ప్రతినిధి 2' చిత్రీకరణ అంతా పూర్తి అయ్యిందని తెలిసింది. త్వరలో హైదరాబాద్ సిటీలో ఆ సాంగ్ షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ మూడో వారం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఆలోచిస్తున్నారు. త్వరలో విడుదల తేదీ అనౌన్స్ చేయనున్నారు.

Also Readటిల్లు స్క్వేర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఇది 'మ్యాడ్'కు తాత, పక్కా బ్లాక్ బస్టరే!


Prathinidhi 2 movie cast and crew: 'ప్రతినిధి 2' చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు, యువ సంగీత సంచలనం మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: రవితేజ గిరిజాల, కళా దర్శకత్వం: కిరణ్ కుమార్ మన్నె, స్టంట్స్: శివరాజు, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, నిర్మాణ సంస్థ: వానర ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాతలు: కుమార్ రాజా బత్తుల - ఆంజనేయులు శ్రీ తోట - కొండకళ్ల రాజేందర్ రెడ్డి, దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు.

Continues below advertisement