తండ్రిని మించిన తనయుడిగా ఎదిగిన రామ్ చరణ్ - ఆ కష్టం ఎంత? ఎలా సాధ్యమైంది?
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా, నట వారసుడిగా రామ్ చరణ్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. వెండితెరకు 'చిరుత'గా వచ్చారు. చిరుత అంటే చిరు (చిరంజీవి) తనయుడు అని మెగా ఫ్యాన్స్ ముద్దుగా చెప్పుకొన్నారు. హీరోగా కెరీర్ ప్రారంభించినప్పుడు రామ్ చరణ్ గుర్తింపు అదే... ఆయన చిరంజీవి కుమారుడు! మరి, ఇప్పుడు? రామ్ చరణ్ తండ్రినే మించిన తనయుడు... గ్లోబల్ స్టార్! (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'వెంకీ 2'పై క్రేజీ అప్‌డేట్‌ - మాస్‌మహారాజా ఫ్యాన్స్‌కి శ్రీనువైట్ల గుడ్‌న్యూస్‌‌
డైరెక్టర్‌ శ్రీను వైట్ల, మాస్‌ మాహారాజా రవితేజ కాంబినేషన్‌కు మంచి క్రేజ్‌ ఉంది. ఇండస్ట్రీలో వీరిద్దరిది హింట్‌ కాంబినేషన్‌. రవితేజ,శ్రీనువైట్ల కలిశారంటే థియేటర్లో ఫ్యాన్స్‌ ఈళలు, నవ్వులు పక్కా. వీరి కాంబినేషన్‌లో నాలుగు సినిమాలు వచ్చాయి. అవన్ని కూడా మంచి విజయం సాధించింది. అందులో 'వెంకీ' మూవీ ఎవర్‌ గ్రీన్‌ అని చెప్పాలి. ఇప్పటికీ ఈ సినిమాకు ఈ సినిమాకు ఫుల్‌ క్రేజ్‌ ఉంది. ఇందులో రవితేజ హిలెరియస్‌ కామెడీ, పంచ్‌ డైలాగ్‌లు యూత్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ విడుదలై 20 ఏళ్లు గడిచిన సందర్భంగా వెంకీ సినిమాను థియేటర్లో రీరిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు శ్రీను వైట్ల ‘వెంకీ 2’ అప్‌డేట్ ఇచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


రామ్‌ చరణ్‌ బర్త్‌డే - అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ స్పెషల్‌ విషెస్‌, అరుదైన వీడియో షేర్‌ చేసిన బన్నీ
గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ బర్త్‌డే. మార్చి 27తో 39వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు చరణ్‌. తమ అభిమాన హీరో బర్త్‌డే సందర్భంగా మెగా ఫ్యాన్స్‌ సందడి మామూలుగా లేదు. సోషల్‌ మీడియా మొత్తం ఈ మెగా హీరో బర్త్‌డే విషెష్‌, స్పెషల్‌ వీడియోస్‌తో నిండిపోయాయి. ఫ్యాన్స్‌ నుంచి సినీ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి చరణ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా చరన్‌ కజిన్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, తన ఆర్‌ఆర్‌ఆర్‌ కో స్టార్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌లు చరణ్‌కు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


నాని, శ్రీకాంత్‌ ఓదెల 'దసరా 2'పై క్లారిటీ వచ్చేసింది!
'దసరా' తర్వాత నేచురల్‌ స్టార్‌ నాని బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. గతేడాది మార్చిలో రిలీజ్‌ అయిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. నాని కెరీర్‌లోనే దసరా ఓ మైల్‌స్టోన్‌గా నిలిచింది. అప్పటి హోమ్లీ హీరోగా ఉన్న నాని 'దసరా'తో మాస్‌ హీరో అయ్యాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బిగ్గేస్ట్‌ హిట్‌ కొట్టడమే కాదు రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి సర్‌ప్రైజ్‌ చేసింది. ఎందుకంటే ఇది నానికి కొత్త జానర్, అంతేకాదు డైరెక్టర్‌ కూడా కొత్తవాడే. ఈ సినిమాతోనే శ్రీకాంత్‌ ఓదెల డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ఇప్పుడు శ్రీకాంత్ రెండో చిత్రం కూడా నానితోనే ఉంటుందని తెలుస్తోంది. అయితే ‘దసరా 2’ కాదట. ఇది పూర్తిగా కొత్త కథ అని తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సిద్ధూ, అదితి - ఆ గుడిలోనే ఎందుకు అంటే?
హిందీతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన పంజాబీ భామ, ఇండియన్ హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవల పెళ్లి చేసుకున్నారు. అయితే... ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్, బాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో ఏడు అడుగులు వేశారు. కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. అంత రహస్యంగా పెళ్లి ఎందుకు చేసుకున్నారని చాలా మంది చెవులు కోరుకున్నారు. ఆ సీక్రెట్ మ్యారేజ్ డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు ఆ బాటలో లవ్ బర్డ్స్ సిద్ధార్థ్, అదితి రావు హైదరి నడిచినట్లు తెలిసింది. వాళ్లిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)