ఆస్కార్ కమిటీలో ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి - మళ్ళీ కాలర్ ఎగరేసేలా చేసిన 'ఆర్ఆర్ఆర్' టీమ్
ప్రతిష్టాత్మక ఆస్కార్ (Oscar) అవార్డులు ప్రదానం చేసే 'ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్' (The Academy Of Motion Picture Arts And Sciences) 398 మందికి కొత్తగా ఆస్కార్ కమిటీలో సభ్యత్వం కల్పించింది. భారతీయ సినిమా ప్రేక్షకులకు, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలకు గర్వకారణమైన అంశం ఏమిటి? అంటే... అందులో 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం నుంచి ఆరుగురు ఉన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'స్పై' సినిమా రివ్యూ : నిఖిల్ గురి తప్పిందా? ఎక్కడా తేడా కొట్టింది?
నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha)కు 'కార్తికేయ 2' విజయంతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత 'స్పై' (SPY Movie)తో మళ్ళీ పాన్ ఇండియా ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ప్రచార చిత్రాల్లో సుభాష్ చంద్రబోస్ ప్రస్తావన సినిమాపై ఆసక్తి కలిగించాయి. ఈ సినిమాతో పలు హిట్ చిత్రాలకు ఎడిటింగ్ చేసిన గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆయన ఎలా చేశారు? సినిమా (SPY Review Telugu) ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఫస్ట్ డేట్‌లోనే శృంగారం? తమన్నా, విజయ్ బోల్డ్ కామెంట్స్ వింటే షాకవ్వడం ఖాయం
ప్రస్తుతం బాలీవుడ్ లో తమన్నా, విజయ్ వర్మ హాట్ టాపిక్ గా మారారు. కొంత కాలంగా వీరిద్దరి గురించి బోలెడ్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గోవా వేదికగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చిన నాటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తమ ప్రేమ గురించి తమన్నాతో పాటు విజయ్ వర్మ కూడా కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం విజయ్, తమన్నా కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’లో నటించారు. ఇందులో అడల్ట్ సీన్లు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ మూవీలో పలువురు స్టార్ హీరోయిన్లు నటించినా... తమన్నా, విజయ్ క్యారెక్టర్ల మీదే ప్రేక్షకులకు మరింత ఆసక్తిక కలిగించింది. మూవీ ట్రైలర్ లో డబుల్ మీనింగ్ డైలాగులు, బోల్డ్ సీన్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
‘బాహుబలి’ బాటలోనే ‘ప్రాజెక్ట్ K’? మూవీ స్టోరీ లీక్, భలే ఇంట్రెస్టింగ్‌గా ఉందే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ K’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. లెజెండరీ యాక్టర్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, అందాల భామ దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
బాలయ్యతో మూవీ తీస్తా, నేను లెక్కలేసి సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపిస్తా: విశ్వక్ సేన్
టాలీవుడ్ లో కంటెంట్ ఉన్న యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. ఈ ఏడాది ‘దాస్ కా ధమ్కీ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న విశ్వక్ ‘గామి’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల మందుకు రానున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘దాస్ కా ధమ్కీ’ సినిమాకు విశ్వక్ స్వీయ దర్శకత్వంలో నటించారు. ఈ మూవీ క్లీన్ హిట్ అవ్వడంతో సీక్వెల్ ను కూడా ప్లాన్ చేశారు. సీక్వెల్ పై గతంలోనే క్లారిటీ ఇచ్చారు విశ్వక్ సేన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినిమా కెరీర్ గురించి, డైరెక్షన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)