పూజా హెగ్డే డిమాండ్ తగ్గలేదు - ఏకంగా ఆరు సినిమాలు
పూజా హెగ్డే (Pooja Hegde) ట్రాక్ రికార్డ్ బహుశా తెలుగులో ఈతరం కథానాయికలు ఎవరికీ లేదేమో!? ఒకటి రెండు కాదు... ఏకంగా ఆరు విజయవంతమైన సినిమాలు చేశారు. 'డీజే దువ్వాడ జగన్నాథం' నుంచి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వరకు... డబుల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. అయితే... ఆ తర్వాత చేసిన సినిమాలు ఏవీ అంతగా సక్సెస్ కాలేదు. పూజా హెగ్డేకు పేరొచ్చినా... ఫ్లాప్స్ రావడంతో ఆమె పని అయిపోయిందని, ఆమె క్రేజ్ తగ్గిందని కొందరు కామెంట్ చేశారు. అయితే, పూజా హెగ్డే డిమాండ్ ఏం తగ్గలేదు. క్రేజీ కథానాయికల లిస్టులో ఆమె పేరు ముందు వరుసలో ఉంది. కొత్తగా మూడు సినిమాలకు సంతకం చేశారని సమాచారం. మరో మూడు చర్చల దశలో ఉన్నాయట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
విజయ వర్మతో తమన్నా డేటింగ్ - అసలు విషయం చెప్పేసిన మిల్కీ బ్యూటీ
హైదరాబాదీ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం గురించి ఎట్టకేలకు మౌనం వీడింది మిల్కీ బ్యూటీ తమన్నా. తనతో ప్రేమలో ఉన్న మాట వాస్తవమేనని చెప్పుకొచ్చింది. “చాలా మంది అమ్మాయిలు తమను అర్థం చేసుకునే భర్త వస్తే బాగుంటుందని భావిస్తారు. నేను కూడా అలాగే అనుకున్నాను. అలాగే విజయ్ నా ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. అంతేకాదు, నా గురించి ఎల్లవేళలా కేరింగ్ తీసుకునే వ్యక్తిగా ఉన్నాడు. అతడి ప్రేమ పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఏదో ఒకరోజు ఇద్దరి ప్రపంచం ఒకటే అవుతుంది. ఇద్దరి మధ్యనున్న బంధం చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నాను” అని తమన్నా వెల్లడించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
విషాదంలో సాయి ధరమ్ తేజ్ - ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్, స్పందించిన మనోజ్
చాలా మందికి కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, పక్షులు పెంచుకుంటారు. వాటితో చక్కటి అనుబంధాన్ని ఏర్పర్చుకుంటారు. ఒక్కోసారి వాటికి ఏమైనా ఇబ్బంది కలిగితే అస్సలు తట్టుకోలేరు. కొన్నిసార్లు అవి చనిపోతే కంటతడి పెడతారు. తాజాగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తన పెంపుడు కుక్క చనిపోవడంతో ఆయన కంటతడి పెట్టారు. దానితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ప్రభాస్ అడగలేదు, మేమే కొన్నాం - 'ఆదిపురుష్' రైట్స్‌పై టీజీ విశ్వప్రసాద్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే, అధికారికంగా ప్రకటించలేదు అంతే! ప్రభాస్ చేస్తున్న మరో సినిమాను అనూహ్యంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'విక్రమ్ రాథోడ్'గా విజయ్ ఆంటోనీ - యాక్షన్ మూవీతో వస్తున్నా బిచ్చగాడు
విజయ్ ఆంటోనీ (Vijay Antony) పేరుతో కంటే 'బిచ్చగాడు', 'బిచ్చగాడు 2' చిత్రాల్లో కథానాయకుడిగా ఆయన ఎక్కువ గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆ విజయాల రేంజ్ అలా ఉంది మరి. 'బిచ్చగాడు' బ్రాండ్ వేల్యూ అటువంటిది! ఆ రెండు సినిమాల మధ్య ఆయన నటించిన సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఏవీ 'బిచ్చగాడు' స్థాయి విజయాలు అందుకోలేదు. మే 19 విడుదలైన 'బిచ్చగాడు 2' తమిళంలో కంటే తెలుగులో పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడీ విజయం తర్వాత మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)