‘జవాన్‘ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల - షారుఖ్‌తో కలిసి దుమ్ములేపిన ప్రియమణి!
బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ కాంబోలో వస్తున్న తాజా సినిమా ‘జవాన్‌’. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్‌ 7న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. అందులో భాగంగా విడుదలైన ట్రైలర్ మూవీపై ఓ రేంజిలో అంచనాలను పెంచేసింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్లతో దుమ్మురేపింది. పలు రకాల గెటప్పుల్లో షారుఖ్ ను చూసి మూవీ లవర్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘పఠాన్‘ హిట్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో  ప్రతి విషయాన్ని ఆడియెన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. అటు మేకర్స్ సైతం బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇస్తూ మూవీపై అంచనాలు పెంచుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఊరమాస్ లుక్‌లో విశ్వక్ సేన్ - అదుర్స్ అనిపిస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫస్ట్ గ్లింప్స్
మాస్ హీరో విశ్వక్ సేన్ వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్నారు. ఆయన రీసెంట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ మంచి సక్సెస్ అందుకుంది. యాక్షన్ డ్రామా రూపొందిన ఈ సినిమా అభిమానులను ఓ రేంజిలో అలరించింది. ఈ సినిమాను విశ్వక్ స్వయంగా నిర్మించారు. ప్రస్తుతం సితార బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘చంద్రముఖి 2’ రాజు వచ్చేశాడు - రాఘవ లారెన్స్ రాజసం అదిరిందిగా!
రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న మూవీ ‘చంద్రముఖి 2’. ఈ సినిమాకు పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు. మరో లీడ్ రోల్ లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తోంది. గతంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘చంద్రముఖి’ సినిమాకు ఈ మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మూవీలోని రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మూవీ టీమ్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'భగవంత్ కేసరి' లో ఊర మాస్ సాంగ్ - ఓ రేంజ్ లో ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి!
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో 'వీరసింహారెడ్డి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కోట్ల కలెక్షన్స్ ని అందుకుని రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే 'అఖండ' సినిమా కంటే ముందు బాలయ్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల మార్క్ అందుకున్న దాఖలాలే లేవు. కానీ 'అఖండ' సినిమాతో ఆయన రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన ఏ సినిమా చేసినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈజీగా రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం గ్యారెంటీ. ఇప్పుడున్న సీనియర్ హీరోల్లో మెగాస్టార్ తర్వాత ఆ క్రేజ్ బాలయ్యకే సొంతమైంది. ఇక ప్రస్తుతం బాలయ్య కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'బ్రో' ఎఫెక్ట్ - 'భోళా శంకర్' విషయంలో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారా?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తోంది. చిరు సోదరి పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటిస్తుండగా, అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. అయినప్పటికీ ఇది రీమేక్ మూవీ కావడంతో, రిజల్ట్ ఎలా ఉంటుందో అని మెగా అభిమానులు కాస్త కలవరపడతున్నారని తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)