మాస్ హీరో విశ్వక్ సేన్ వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్నారు. ఆయన రీసెంట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ మంచి సక్సెస్ అందుకుంది. యాక్షన్ డ్రామా రూపొందిన ఈ సినిమా అభిమానులను ఓ రేంజిలో అలరించింది. ఈ సినిమాను విశ్వక్ స్వయంగా నిర్మించారు. ప్రస్తుతం సితార బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. 


ఆకట్టుకుంటున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫస్ట్ గ్లింప్స్


తాజాగా విశ్వక్ సేన్, కృష్ణ చైతన్య సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ తో పాటు టైటిల్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’గా టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక ఫస్ట్ గ్లింప్స్ అదుర్స్ అనిపించేలా ఉంది. విశ్వక్సేన్ ఊర మాస్ లుక్ లో అదరగొట్టారు. గ్లింప్స్ ను పరిశీలిస్తే, ఈ సినిమా గోదావరి జిల్లాకు సంబంధించిన యాక్షన్ డ్రామాగా రూపొందినట్లు తెలుస్తోంది. ఇందులో విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఆకట్టుకుంటున్నాయి.  “అన్నా మేము గోదారోళ్ళం. మాటొకటే సాగదీస్తాం. తేడా వస్తే నవ్వుతూ నరాలు తీసేస్తాం” అంటూ తన గంభీరమైన వాయిస్ తో వారెవ్వా అనిపించారు. టైటిల్ కూడా కొత్తగా క్యాచీగా ఉందనే టాక్ వినిపిస్తోంది.



యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’   


ఈ సినిమాకు సంబంధించిన కథ గోదావరి జిల్లాకు సంబంధించినది కావడంతో చిత్ర షూటింగ్ చాలా వరకు ఉభయగోదావరి జిల్లాలోనే జరిగినట్లు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే, రాజమండ్రి సమీపంలోనే ఎక్కువగా చిత్రీకరణ జరుపుకుంది. సితార సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు కృష్ణ చైతన్య కథ, మాటలు అందించడంతో పాటు  దర్శకత్వం కూడా వహిస్తున్నారు. నేహాశెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. తెలుగు అమ్మాయి అంజలి కీలక పాత్రలో మెరువబోతోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.


వరుస సినిమాలతో విశ్వక్ ఫుల్ బిజీ


ఇక విశ్వక్ సేన్ రీసెంట్ మూవీస్ ‘దాస్ కా ధమ్కీ’, ‘ఓరి దేవుడా’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బాగానే రాణించాయి. ప్రేక్షకులను ఈ చిత్రాలు బాగా ఆకట్టుకోవడంతో పాటు వసూళ్ల పరంగానూ ఫర్వాలేదు అనిపించాయి. ప్రస్తుతం  కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ‘రౌడీ ఫెలో’, ‘ఛల్ మోహన రంగా’ లాంటి సినిమాలతో తన ప్రతిభను చాటుకున్న చైతన్య ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అటు విశ్వక్ సేన్ తో కలిసి ఓ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఎంటర్టైన్మెంట్స్  సంస్థ నిర్మించబోతోంది.  ఈ చిత్రానికి రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఓకే అయ్యింది.  జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మొత్తంగా వరుస సినిమాలతో విశ్వక్ సేన్ ఫుల్ బిజీగా అయ్యారు.


Read Also: ఈ వారం కూడా చిన్న సినిమాల సందడే - థియేటర్లు, ఓటీటీల్లో రిలీజ్ అయ్యే మూవీస్ ఇవే!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial