ఆ ఒక్కటీ అడక్కు రిలీజ్ డేట్ ఫిక్స్ - నరేష్ కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?
కామెడీ కింగ్ 'అల్లరి' నరేష్ (Allari Naresh) ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి రెడీ అయ్యారు. వినోదంతో విందు భోజనం పెట్టడానికి సిద్ధమయ్యారు. సీరియస్ సినిమాలు 'నాంది', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', 'ఉగ్రం'తో సోలో హీరోగా వరుస విజయాలు అందుకున్న ఆయన... మళ్లీ తన హోమ్ గ్రౌండ్ కామెడీకి వచ్చారు. 'నా సామి రంగ'లో వింటేజ్ నరేష్ సందడి చేశారు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు'తో వేసవిలో వినోదం అందించడానికి వస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఇద్దరు పిల్లలను కనండి - నాకు, ఆనంద్‌కు అలాంటి బాండింగ్ లేదు: విజయ్ దేవరకొండ
ఒక హీరో లేదా హీరోయిన్ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్‌గా ఎదిగితే.. ఆ తర్వాత వారి తమ్ముడు లేదా చెల్లెలు కూడా ఆటోమేటిక్‌గా హీరో లేదా హీరోయిన్ అయిపోతారు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ విషయంలో కూడా అదే జరిగింది. తను స్టార్‌గా ఎదిగిన తర్వాత తన తమ్ముడు ఆనంద్‌ను హీరోగా పరిచయం చేశాడు. విజయ్.. ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యాడో.. తన తమ్ముడు ఆనంద్ కూడా మంచి స్క్రిప్ట్ సెలక్షన్‌తో యూత్‌కు అంతే దగ్గరయ్యాడు. తాజాగా ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న విజయ్.. తన తమ్ముడు ఆనంద్ గురించి చెప్తూ తల్లిదండ్రులకు ఒక సలహా ఇచ్చాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'దేవర'తో బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ - వైరల్ అవుతున్న సెల్ఫీ!
బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఊర్వశి సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉంటూ తన ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే ఊర్వశి తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియా ట్రెండింగ్ లో నిలిచింది. ఆ పోస్ట్ క్షణాల్లో ట్రెండ్ అవడానికి కారణం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
శరవేగంగా సాగుతోన్న రవితేజ మల్టిప్లెక్స్ నిర్మాణాలు - ఎక్కడో తెలుసా?
టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరు రవితేజ. ఎన్నో హిట్ సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు రవితేజ. ఇప్పుడు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఆయన. అయితే యువ హీరోలు మహేశ్ బాబు, బన్నీ, విజయ్ దేవరకొండ బాటలో పయనిస్తున్నాడు అంట రవితేజ. అది కూడా సినిమాల విషయంలో కాదు. బిజినెస్ విషయంలో. అవును రవితేజ.. మల్టీ ప్లెక్స్ థియేటర్ నిర్మిస్తున్నాడు. ఆ థియేటర్ దాదాపు రెడీ అయిపోయింది కూడా. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘అదుర్స్-2’ పాన్ వరల్డ్ సినిమా - ఎన్టీఆర్ చేయను అంటే.. వాళ్ల పిల్లలతో చేస్తా
కోనా వెంకట్.. స్టార్ స్క్రిప్ట్ రైటర్, ప్రొడ్యూసర్. ఎన్నో అద్భుతమైన కథలు అందించారు ఈయన. ఆయన రాసిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నానని చెప్పారు. వాటికి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. సూపర్ డూపర్ హిట్ సినిమా 'అదుర్స్' కి సీక్వెల్ వస్తుందని, అది పాన్ వరల్డ్ లెవెల్ లో ఉంటుందన్నారు. ఆ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలు పంచుకున్నారు ఆయన. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)