Urvashi Rautela selfie with Jr NTR : బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఊర్వశి సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉంటూ తన ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే ఊర్వశి తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియా ట్రెండింగ్ లో నిలిచింది. ఆ పోస్ట్ క్షణాల్లో ట్రెండ్ అవడానికి కారణం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


ఎన్టీఆర్ తో ఊర్వశి రౌటేలా సెల్ఫీ


'వాల్తేరు వీరయ్య', 'ఏజెంట్', 'బ్రో', 'స్కంద' వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో అలరించి టాలీవుడ్ లో మంచి క్రేజ్ అందుకున్న ఊర్వశి రౌతేలా తాజాగా జిమ్ లో జూనియర్ ఎన్టీఆర్ తో దిగిన ఓ సెల్ఫీ పిక్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన ఈ పిక్ క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారింది. తారక్ తో సెల్ఫీ దిగిన ఊర్వశి తన పోస్టులో ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ.."జూనియర్ ఎన్టీఆర్ గారు మా ప్రియమైన, నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్. క్రమశిక్షణ, నిజాయితీ, వినయపూర్వకంగా ఉండే వ్యక్తి మీరు. మీ దయ, ప్రేరణకు కోటి ధన్యవాదాలు. మీ సింహం లాంటి వ్యక్తిత్వం నిజంగా ఎంతో ప్రశంసనీయం. రానున్న రోజుల్లో మీతో కలిసి పని చేసే అవకాశం కోసం వేచి ఉండలేకపోతున్నా" అని రాసుకొచ్చింది.



జిమ్ లో ఎన్టీఆర్ ని కలిసిన ఊర్వశి


జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబైలో ఉన్న విషయం తెలిసిందే  తారక్ 'వార్ 2' షూటింగ్ కోసం ఇటీవలే ముంబై వెళ్లారు. ప్రెజెంట్ 'వార్ 2' లో తన పాత్రకు తగ్గట్టు తనను తాను మలుచుకునే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే తారక్ ఇంటర్నేషనల్ ఫిట్నెస్ ఎక్స్ పర్ట్ తో దాదాపు రెండు వారాలపాటు ట్రైనింగ్ సెషన్ లో పాల్గొంటున్నాడు. ఈ ట్రైనింగ్ సెషన్లో భాగంగా ముంబైలోని ఓ జిమ్ లో ఊర్వశి జూనియర్ ఎన్టీఆర్ ని కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఊర్వశి తారక్ తో ఇలా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


ఊర్వశి పోస్టు అర్థం అదేనా?


ఊర్వశి రౌతేలా ఇలా ఎన్టీఆర్ తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది చూసిన అభిమానులు రకరకాల అనుమానాలు లేవనెత్తుతున్నారు. కొందరేమో ఊర్వశి రౌతేలా ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించనిందని అంటుంటే.. మరికొందరేమో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న 'వార్ 2' లో ఊర్వశి కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో ఆకట్టుకున్న ఊర్వశి నిజంగా 'దేవర' లోనూ స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్ తో కలిసి స్టెప్పులేస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read : 'కన్నప్ప'లో ప్రభాస్ చేసేది శివుడి పాత్ర కాదా? మరో పవర్‌ఫుల్ పాత్రలో రెబల్ స్టార్?