ప్రముఖ తమిళ హాస్య నటుడు మనోబాల ఇక లేరు


ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ మనోబాల కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన బుధవారం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మనోబాల మృతి అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగులో ఆయన చివరిగా.. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటించారు. అందులో జడ్జి పాత్రలో కనిపించారు. అంతకు ముందు ఆయన ‘మహానటి’ సినిమాలో దర్శకుడు పి.పులయ్య పాత్రలో నటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


రజనీకాంత్ 100% కరెక్ట్, నిజాలే మాట్లాడతారు - వైసీపీలో ఇష్యూలో జగపతి బాబు మద్దతు


సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఉంటున్నది తమిళనాడులో! ఆయన ఓటు హక్కు ఉన్నది కూడా తమిళనాడులో! అయితే, గత కొన్ని రోజులుగా ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుమోగుతోంది. అందుకు కారణం ఏమిటి? అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శక పురుషుడు ఎన్టీ రామారావు (NT Rama Rao) శత జయంతి (NTR 100th Birth Anniversary Celebrations) ఉత్సవాలలో పాల్గొనడం, ఆ వేదిక మీద చంద్రబాబు మీద పొగడ్తల వర్షం కురిపించడమే ఆయన చేసిన పాపం అయ్యింది. తాజాగా దీనిపై జగపతిబాబు కూడా స్పందించారు. రజినీకాంత్‌కు సపోర్ట్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


హీరో విక్రమ్‌కు తీవ్ర గాయాలు - హాస్పిటల్‌కు తరలింపు


హీరో విక్రమ్‌కు ప్రమాదం జరిగింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘తంగళన్’ మూవీ షూటింగ్‌లో ఆయన ప్రమాదవశాత్తు పై నుంచి కిందపడ్డారని, దీంతో ఆయన పక్కటెముకులు విరిగాయని తెలిసింది. ప్రమాదం వార్త తెలియగానే షూటింగ్ సిబ్బంది హుటాహుటిన ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. విక్రమ్ ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విక్రమ్ ఇటీవలే ‘పొన్నియెన్ సెల్వన్’ మూవీ సీరిస్‌తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ పూర్తి కావడంతో ఆయన కొద్ది రోజుల కిందటే తిరిగి షూటింగ్స్‌లో బిజీ అయ్యారు. ఇంతలోనే ఇలా జరగడంతో చియాన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ఐస్ బాత్‌తో టార్చర్ అనుభవిస్తున్న సమంత - సామ్‌కు ఏమైంది? ఎందుకలా చేస్తోంది?


సౌత్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. వరుణ్ ధావన్ తో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంటోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్, డీకే ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ లండన్ లో కొనసాగుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


సితారలో విజయ్ దేవరకొండ & శ్రీలీల సినిమా - పూజతో మొదలు 


పాన్ ఇండియా సెన్సేషన్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా ఈ రోజు (మే 3, బుధవారం) కొత్త సినిమా పూజా కార్యకమ్రాలతో మొదలైంది. హీరోగా విజయ్ దేవరకొండ 12వ చిత్రమిది (VD 12 Movie).  (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)