రెండు మూడు నెలలుగా ‘మా’ ఎన్నికలపై జరుగుతున్న రచ్చకు నేటితో క్లైమాక్స్ ఫుల్‌స్టాప్ పడనుంది. ప్రకాశ్ రాజ్, విష్ణు ప్యానల్స్‌లో ఎవరైతే గెలుస్తారో.. వారితో నూతన ‘మా’ అధ్యక్షుడు పాలన కొనసాగిస్తారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న వారంతా ఒకటే అంటూ కలిసి పని చేసుకుంటారు. అయితే ఈ ఎన్నికల్లో పాల్గొన్న పలువురు తారలు.. మీడియాతో మాట్లాడారు. ఎన్నికలపై కామెంట్ చేశారు.


ఈసారి ఎన్నికలు వాడివేడీగా ఉన్నాయని నటి రోజ అభిప్రాయపడ్డారు. సాధారణ ఎన్నికలల అనిపిస్తోందని చెప్పారు. అయితే వ్యక్తిగత దూషణలు చేసుకోవడంపై ఆమె బాధపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్లమని.. రెండు ప్యానళ్లో నాతో పని చేసిన వారు, తెలిసిన వారు ఉన్నారని రోజా అన్నారు. అందరం కలిసి.. సమస్యలను పరిష్కరించుకునే దిశగా ముందుకు సాగాలని అన్నారు.


జీవితంలో ఎప్పుడైనా, ఎక్కడైనా పోటీ ఉంటే దాని ఫలితం వేరుగా ఉంటుందని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ చెప్పారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం మాట్లాడారు. తనతోనే మా ఎన్నికల్లో పోటీ మెుదలైందని చెప్పారు.


ఓటు వేసేందుకు హైదరాబాద్ వచ్చారు నటి జెనీలియా. తెలుగు చిత్ర  పరిశ్రమ తనకు పుట్టినిల్లు చెప్పారు. ఓటు వేసేందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో సూపర్‌ ప్రెసిడెంట్‌ రాబోతున్నారని వ్యాఖ్యానించారు. 


ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌కు ఓటేశా


'మా' ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌కే తాను ఓటు వేశానని సినీ నటుడు నాగబాబు తెలిపారు.  ఎవరికి ఓటు వేశారు అని  మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మూడు రోజులుగా చెబుతున్నా, కొత్తగా ఏం చెబుతానని అన్న ఆయన.. ప్రజాస్వామ్యానికి ఓటు వేసినట్లు వెల్లడించారు.


అయితే ఎన్నికల్లో ఓటు ఎవరికీ వేశారంటూ తారలను ప్రశ్నించగా రహస్య ఓటింగ్ అంటూ చెప్పుకొచ్చారు. నాగబాబు మాత్రం.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కి ఓటు వేసినట్టు చెప్పారు.


Also Read: MAA Election: 'మా' ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలు.. అలా జరిగితే కోర్టుకు వెళ్తామన్న ఎన్నికల అధికారి


Also Read: Hema Bites Siva Balaji: ‘మా’లో రచ్చ.. శివబాలాజీ చేయి కొరికిన హేమా.. ప్రకాష్ రాజ్‌తో మంచు ఫైట్



Watch This : "నా ఓటు ఆ పానెల్ కే.." నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి