'మా' ఎన్నిక ఫైట్ చివరి దశకు చేరింది. అయితే పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు ప్యానెల్ సభ్యులు పోలింగ్ ప్రాంతంలో తెగ హడావుడి చేస్తున్నారు. ఓ ప్యానల్ వారు రిగ్గింగ్ జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో కాసేపు ఎన్నికలను నిలిపి వేశారు.
రిగ్గింగ్ జరిగిందని తేలితే తదుపరి చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి చెబుతున్నారు. ఫలితాలు కూడా నిలిపివేస్తామని చెప్పారు. మా ఎన్నికల వ్యవహారంపై కోర్టకు వెళతామని ఎన్నికల అధికారి అన్నారు. రిగ్గింగ్ జరిగే అవకాశం లేదని, కార్డ్ ఉంటేనే ఓటు వేసే అవకాశం ఉందని కరాటే కళ్యాణి చెబుతుంది. మరోవైపు 'మా' పోలింగ్ కేంద్రంలో గొడవ జరిగింది. పోలింగ్ బూత్ వద్ద బెనర్జీపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపేస్తానంటూ బెనర్జీనికి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రకాశం రాజ్ పోలింగ్ కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారని విష్ణు వర్గం ఆరోపించింది. ఈ కారణంగా రెండు ప్యానల్స్ మధ్య గొడవ చోటుచేసుకుంది.
నటులు శివారెడ్డి, సమీర్ కు మధ్య వాగ్వాదం జరిగింది. శివారెడ్డి నమూనా బ్యాలెట్ లను పంచుతున్నారంటూ విష్ణు వర్గం ప్రకాశ్ రాజ్ వర్గానికి చెందిన వారిపైకి దూసుకు వెళ్లింది. మాటా మాటా పెరిగింది.
ఎన్నికల అధికారులు ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యుల్ని పిలిపించారు. రెండు బృందాలతో చర్చించి..రిగ్గింగ్ జరిగినట్టు తేలితే ఫలితాలు ప్రకటించకుండా కోర్టుకు వెళ్తామని చెప్పారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇప్పటి వరకూ 30 శాతం పోలింగ్ నమోదైంది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో మొత్తం 925మంది సభ్యులు ఉన్నారు. 883మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది. సుమారు 500లకు పైగా సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం 2గంటల వరకూ పోలింగ్ జరగనుండగా, సాయంత్రం 4గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. తెలంగాణ కో-ఆపరేటివ్ సొసైటీ విశ్రాంత ఉద్యోగులతో పోలింగ్‌ను నిర్వహిస్త్తున్నారు. ఎన్నికలకు 50మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 8గంటల తర్వాత 'మా' అధ్యక్షుడి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.
ఉదయమే.. పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్. అయితే నిన్నటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న వాళ్లు.. ఇవాళ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అంతకుముందు పోలింగ్ కేంద్రం ఆవరణలో ప్రకాశ్‌రాజ్, మోహన్‌బాబు కరచాలనం చేసుకున్నారు. ప్రకాశ్‌రాజ్.. మోహన్‌బాబు ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మోహన్‌బాబు.. విష్ణుతో ప్రకాశ్‌రాజ్‌కు కరచాలనం చేయించారు. తర్వాత విష్ణు-ప్రకాశ్‌రాజ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
Watch This : "నా ఓటు ఆ పానెల్ కే.." నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి