గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'అధినాయకుడు'తో పాటు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు 'శివ శంకర్', యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన 'గోరింటాకు', రోహిత్ 'జానకి వెడ్స్ శ్రీరామ్', శ్రీకాంత్ 'లేత మనసులు' తదితర సినిమాల్లో బాల నటుడిగా విశ్వ కార్తికేయ నటించారు. కొంత విరామం తర్వాత హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'జై సేన', 'కళాపోషకులు', 'అల్లంత దూరాన' సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయన ఓ విదేశీ సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...


ఇండోనేషియన్ భాషలో తెలుగు హీరో విశ్వ కార్తికేయ సినిమా
విశ్వ కార్తికేయ కథానాయకుడిగా ప్రస్తుతం 'కలియుగం పట్టణం' అని ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా. ఇందులో ఆయుషీ పటేల్ కథానాయిక. ఈ సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆమెకు పరిచయం అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇండోనేషియన్ సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు.


Also Readఎన్టీఆర్ న్యూ ఇయర్‌ కు ముందు జపాన్ వెళ్లారు, కొత్త ఏడాదిలో ఇండియాకు తిరిగొచ్చారు. జపాన్‌లో భూకంపంపై ఆయన ఏమన్నారంటే...


Shoonyam movie to be shot in Telugu, Hindi and Indonesian language bahasa: సీకే గౌస్ మోదిన్ దర్శకత్వంలో విశ్వ కార్తికేయ, ఆయుషీ పటేల్ హీరో హీరోయిన్లుగా రూపొందనున్న సినిమా 'శూన్యం చాప్టర్ 1'. తెలుగు, హిందీతో పాటు ఇండోనేషియా భాష 'బహస'లో సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో హిందీ, ఇండోనేషియన్ భాషల్లోని నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారని దర్శకుడు సీకే గౌస్ మోదిన్ తెలిపారు. అతీంద్రీయ శక్తుల నేపథ్యంలో సిద్ధం చేసిన కథతో ఉన్నత నిర్మాణ, సాంకేతిక విలువలతో చిత్రాన్ని రూపొందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.


సిల్వర్ బ్లైండ్స్ (ఇండోనేషియా) పతాకంపై రూపొందుతున్న 'శూన్యం చాప్టర్ 1' చిత్రాన్ని సీకే గౌస్ మోదిన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఉన్ని రవి (యూఎస్ఏ) ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకు వెళతామని యూనిట్ సభ్యులు చెప్పారు. విశ్వ కార్తికేయ 'కలియుగం పట్టణం' చిత్రానికి వస్తే... ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడించనున్నారు.


Also Read: ఆ ఓటీటీలో 'హనుమాన్' - థియేటర్లలో విడుదలైన ఎన్ని వారాలకు స్ట్రీమింగ్ అవుతుందంటే?


ఇప్పుడు అంతర్జాతీయ సినిమా వేదికపై తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి 1', 'బాహుబలి 2' సినిమాలు మన దేశంతో పాటు విదేశాల్లోనూ భారీ విజయాలు అందుకున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ అంటే జపాన్ ప్రజలు అభిమానం పెంచుకున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమా అయితే హాలీవుడ్ దర్శక నిర్మాతల అభినందనలు అందుకుంది. అందులోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది.