Earthquake in Japan: కొత్త ఏడాదికి ప్రజలందరూ స్వాగతం పలుకుతున్న వేళ జపాన్ ప్రజలు గుండెల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఆ దేశంలో భూకంపం వచ్చింది. న్యూ ఇయర్ వేడుకలకు మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) జపాన్ వెళ్ళారు. అందుకని, ఆయన ఎక్కడ ఉన్నారో అని అభిమానులు ఆరా తీశారు. కాస్త ఆందోళన చెందారు. వాళ్ళందరికీ గుడ్ న్యూస్. ఎన్టీఆర్ సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. జపాన్ భూకంపం గురించి ట్వీట్ చేశారు.
జపాన్ ప్రజలూ... ధైర్యంగా ఉండండి - ఎన్టీఆర్
''జపాన్ నుంచి ఇవాళ ఇంటికి వచ్చాను. అక్కడ భూకంపం గురించి తెలిసి షాక్ అయ్యాను. గత వారం అంతా అక్కడ (జపాన్‌లో) ఉన్నాను. భూకంపం బారిన పడిన ప్రజల గురించి ఆలోచిస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. వాళ్ళు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. జపాన్ ప్రజలూ... ధైర్యంగా ఉండండి'' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
Also Read: సర్కారు నౌకరి రివ్యూ: సింగర్ సునీత కొడుకు ఆకాష్ మొదటి సినిమా
అబ్బాయిలు అభయ్ రామ్, భార్గవ్ రామ్, భార్య ప్రణతితో కలిసి ఎన్టీఆర్ జపాన్ వెళ్ళారు. సినిమా షూటింగ్స్ మధ్యలో కాస్త టైం తీసుకుని ఫ్యామిలీతో కలిసి ఆయన హాలిడేకి వెళ్ళారు. జపాన్ నుంచి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ ఫ్యామిలీ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన దృశాలు:
ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చేస్తున్నారు ఎన్టీఆర్. ఆ సినిమా వీడియో గ్లింప్స్ ఈ నెల 8న విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 5న 'దేవర' పార్ట్ 1 విడుదల కానుంది. ఆ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు.
జపాన్ భూకంపం విషయానికి వస్తే... రిక్టర్ స్కేల్‌పై తీవ్ర 7.4గా నమోదైంది. సెంట్రల్ జపాన్‌లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. Japan Meteorological Agency వెల్లడించిన వివరాల ప్రకారం..పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీరప్రాంతాలను అప్రమత్తం చేశారు. 5 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగిసిపడి తీర ప్రాంతాలను ముంచే ప్రమాదముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నీగట, తొయామా, ఇషికావా ప్రాంత ప్రజలకు అలెర్ట్ జారీ చేశారు. వాజిమా నగర తీరాన్ని మీటర్ కన్నా ఎక్కువ ఎత్తైన అలలు వచ్చి తాకే ప్రమాదముంది. ప్రస్తుతానికి ప్రాణ,ఆస్తి నష్టాల వివరాలు వెల్లడి కాలేదు.
Also Read: జపాన్‌లో తరచూ భూకంపాలు ఎందుకు? రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలవడానికి కారణాలేంటి?