Naga Panchami Serial Today Episode 


పంచమి కొండ చరియల మధ్య ఉన్న సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం దగ్గరకు వస్తుంది. మోక్షతో తన పరిచయం, పెళ్లి, సంతోషం ఇలా అన్నింటిని తలచుకొని ఏడుస్తుంది. 


పంచమి: ఇరవై ఏళ్లు రాకముందే వందేళ్ల అనుభవాన్ని చవిచూశాను. అయినా నేను ఎవరికీ అక్కర్లేకుండా పోయాను. నా పుట్టుక నాకు తెలీదు.. పగతో నాకు సంబంధం లేదు. నామమాత్రానికే పెళ్లి దాంపత్య జీవితం.. అదంతా కలగానే మిగిలింది. భవిష్యత్ అంధకారం అయిపోయింది. ఏ పాపం ఎరుగని నాకు ఇక్కడ చోటు లేదు పొమ్మంటుంది లోకం. అందుకే వచ్చేశాను స్వామి. ఇక ఎక్కడికి వెళ్లను. నువ్వు కూడా నన్ను తరిమేయొద్దు. 
నన్ను ఇక్కడే శాశ్వతంగా ఉంచేయ్ స్వామి. అంటూ పంచమి తన తలను స్వామి పాదాల దగ్గర కొట్టుకుంటుంది. దీంతో రక్తం కారి కళ్లు తిరిగిపడిపోతుంది. 


మరోవైపు మోక్ష, పంచమి తల్లికి ఫోన్ చేస్తాడు. ఇక గౌరి పంచమి బాగుందా అని అడిగితే ఆవిడకు పంచమి ఇంట్లో లేదు అని తెలీదని.. పంచమి తన తల్లి దగ్గరకు వెళ్లలేదు అని మోక్ష అనుకుంటాడు. ఇక పంచమి అక్కడికి వస్తే వెంటనే తనకు ఫోన్ చేయమని మోక్ష అంటాడు. దీంతో అనుమానం వచ్చి గౌరి పంచమి గురించి అడుగుతుంది. భయపడి ఏడుస్తుంది. 
మోక్ష: భయపడకండి అత్తయ్య ఇక్కడ గొడవలు ఏం జరగలేదు. మా ఇద్దరి మధ్య చిన్న మనస్పర్థలు అంతే. అంతకు మించి ఏం కారణం లేదు. 
గౌరి: లేదు బాబు మీరు అబద్ధం చెప్తున్నారు. పంచమి గురించి నాకు బాగా తెలుసు. మీరు అంటే తనకు ప్రాణం. ఎవరినైనా వదిలివెళ్తుంది కానీ మిమల్ని వదిలి మాత్రం వెళ్లదు. ఏదో పెద్ద సమస్యే వచ్చుంటుంది.
మోక్ష: మీరు చెప్పింది నిజమే అత్తయ్య. పంచమి ఎక్కడికి వెళ్లినా తిరిగి నాకోసం వస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి.. మోక్ష తనలో తాను.. ఇంకెక్కడికి వెళ్లావు పంచమి. ఎంత తొందర పడ్డావు పంచమి. త్వరగా ఇంటికి రా పంచమి. 


ఫణేంద్ర: యువరాణి కనిపించడం లేదు. తన ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. 
మేఘన: పంచమి కనిపించకపోయినా ముక్కోటి ఏకాదశి రోజు మోక్షని మీరు కాటేసి మీ పాటికి నాగలోకం వెళ్లిపోవచ్చు కదా యువరాజా.. కానీ యువరాణిని పెళ్లిచేసుకోవాలి అన్న ఆశ మిమల్ని వేదిస్తుంది అనుకుంటాను. 
ఫణేంద్ర: అందులో రహస్యం ఏం లేదు  మేఘన. యువరాణిని పెళ్లి చేసుకోవాలి అనేది నా బలమైన కోరిక. నేను ఇక్కడికి వచ్చింది కూడా అందుకే. ఆ ఆశతోనే నేను నాగదేవతకు అడిగి అనుమతి తీసుకున్నాను. యువరాణికి ఏదైనా జరిగితే నాగదేవత నన్ను ఉంచదు. నా కారణంగానే ఇదంతా జరిగింది అని నాకు పెద్ద శిక్ష వేస్తుంది. 
మేఘన: అయ్యో యువరాజా ఇప్పుడు మీకు పంచమి కంటే ఎక్కువ కష్టాలే వచ్చి పడ్డాయి. నాగదేవతకు ఇప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు యువరాజా.
ఫణేంద్ర: అదే అర్థం కావడం లేదు మేఘన. యువరాణి దగ్గర ఇప్పుడు నాగశక్తులు  కూడా లేవు ఆ కారణంగానే నేను ఇప్పుడు తను ఎక్కడ ఉందో కనిపెట్టలేకపోతున్నాను. అవును నీకు మంత్ర శక్తులు తెలుసుకదా.. 
మేఘన: ఇప్పుటికే చూశాను యువరాజా కానీ ఆచూకీ తెలియడం. లేదు అయినా సరే మీకోసం మరోసారి చూస్తాను. అంటూ మేఘన మంత్ర శక్తి ఉపయోగించి తన అరచేతిలో పంచమి ఎక్కడుండా అని చూస్తుంది. కానీ పంచమి జాడ కనిపించదు. మనిషి కనిపించడం లేదు యువరాజా. ఏ లోయలోనో దూకి ఏమైనా చేసుకొని ఉంటే ఇక్కడ కనిపించే అవకాశం ఉండదు. భయపడకండి యువరాజా.. పంచమి అంత పిరికిది కాదు. 


మోక్ష తన గదిలో కూర్చొని పంచమిని కొట్టి తప్పు చేశాను అని బాధపడతాడు. అన్ని గుర్తు చేసుకొని తనని తాను తిట్టుకుంటాడు. పంచమి కాళ్లు పట్టుకొని వేడుకోవాలి అని అప్పుడే తాను చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం అని అనుకుంటాడు. మరోవైపు మోక్ష బాధ పడటం చూస్తుంది మేఘన. ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటుంది. మంత్ర శక్తులతో ఓ బొద్దింకను క్రియేట్ చేసి మోక్ష మీదకు వెళ్లేలా చేస్తుంది. బొద్దింక షర్ట్‌లోకి దూరడంతో మోక్ష షర్ట్‌ విప్తేస్తాడు. ఇక మేఘన వచ్చి వీపుమీద బొద్దింక ఉందిని చెప్పి దాన్ని తీసేలా చేస్తూ మోక్షని హగ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.