Trinayani Serial Today Episode
తిలోత్తమ: స్వామి అక్కడ పరిస్థితి మీరు చూసుంటే ఏం అనేవారో.. ఆ జీవానికి గాయత్రీ అక్కయ్య జాడ తెలుసని చాలా భయపడ్డాం. ఎప్పుడు వచ్చి విశాల్, నయనీలకు చెప్పేస్తాడో అని కంగారు పడేవాళ్లం. కానీ తనకు కూడా తెలీదని అర్థమైంది స్వామి.
అఖండ: తనకి ఎందుకు తెలీదు తెలుసు.
తిలోత్తమ: అఖండ స్వామి మీరు చెప్పండి.. ఆ గాయత్రీ పాపనే గాయత్రీ అక్కనా.
అఖండ: జీవం చూపించిన పిల్ల గాయత్రీ దేవి కాదు. (జీవం గాయత్రిపాపలా మారిన విశాలాక్షి అమ్మవారిని చూపించడం వల్ల) అయితే ఇక్కడో ముఖ్యమైన విషయాన్ని గమనించాలి తిలోత్తమ. జీవం తాను ఎత్తుకెళ్లిపోయిన గాయత్రీ దేవిని చూపించలేదు. అని చెప్పబోతుంటే ఏవేవో మాట్లాడి వెళ్లిపోతారు తిలోత్తమ, వల్లభ.
మరోవైపు నయని భోజనం చేయకుండా హాల్‌లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక హాసిని వాళ్లు వచ్చి తినమని అడుగుతారు. సుమన సెటైర్లు వేస్తుంది. ఇక సుమన గట్టిగా నవ్వుతుంది. ఇక విక్రాంత్ సుమనను తిడతారు.
నయని: దయచేసి అర్థం చేసుకోండి. గాయత్రీ అమ్మగారు ఈరోజు రాలేదు. రేపు అయినా వస్తారు అని ఎదురు చూస్తున్నాను. కానీ ఈ విషయంలోకి నా బిడ్డ గాయత్రీని లాగొద్దు.
ధురందర: పెద్దక్కయ్య ఎప్పుడు వచ్చినా నీకు ముగ్గురు ఆడపిల్లలు అవుతారు నయని. చూసుకో.
సుమన: అక్కా నువ్వు తినకపోతే తినకపోయావు కానీ గాయత్రీ పాపకు దిష్టి తీయ్. కంగారు పడకు అక్క. ముందు వెనక ఎవరూ లేని పిల్లకు కాస్త ఉండుంటే మహార్జాతకం అంటుండేది. జీవం అన్నట్లు ఆ పిల్లని మీరు పెద్దత్తయ్య అనుకొని గుండెలకు హత్తుకొని ముద్దాడి పట్టాభిషేకం చేస్తారు ఏమో అని అంతలా చర్చ జరిగింది.
విశాల్: చూడు సుమన మా అమ్మకి ఎప్పుడు రావాలో బాగా తెలుసు. తను ఎక్కడున్నా ఇప్పటికి ఇప్పుడు ఇక్కడికి రాకపోతే వచ్చే ఇబ్బంది ఏం లేదు.
హాసిని: గాయత్రీ అత్తయ్య ఇక రాదే అనుకుందాం.. అసలు మీకు వచ్చే ఇబ్బంది ఏంటో చెప్తారా.. అల్రెడీ గాయత్రీ పేరు మీద ఇంట్లో శాస్త్రిగారి మనవరాలు ఉంది కాబట్టి ఇక ఇప్పట్లో నేను వచ్చి చేసేది ఏం లేదు అనుకొని పెద్దత్తయ్య ఆగిపోయారు ఏమో.
తిలోత్తమ: నువ్వు తమాషాగా చెప్పకు హాసిని. తల్లిదండ్రులను కలవాలి అని బిడ్డకు.. పిల్లల్ని హక్కున చేర్చుకోవాలి అని తల్లిదండ్రులకు ఉండదా..
డమ్మక్క: గాయత్రి దేవి వస్తే ఎవరికి సంతోషమో తెలీదు కానీ మీకు అయితే నరకమే.. మీ మనసులో మాట నేను చెప్పడం సరికాదు.
పావనా: నువ్వు అలా అంటే అక్కయ్య ఏం చేసిందా అని అనుమానించాల్సి వస్తుంది.
మరోవైపు సుమన పండగకి ఉలూచి కోసం బట్టలు కొనమని చెప్తుంది. దానికి విక్రాంత్ గానవి, గాయత్రి పాపల బట్టలు వేయమని చెప్తాడు. దీంతో వాళ్లు విడిచిన బట్టలు వేయమంటావా అని సుమన గొడవ పెట్టుకుంటుంది. నయని, విశాల్‌లు ఎప్పుడో షాపింగ్ చేసేశారని అనాథ అయిన గాయత్రి కోసం చాలా కొన్నారు అని ఉలూచికి ఒక్కటి కూడా కొనలేదు అని గొడవపడుతుంది. దాంతో విక్రాంత్ బీరువాలోని రెండు బ్యాగులు తీసి సుమన చేతిలో పెడతాడు. నయని, విశాల్‌లు ఉలూచితో పాటు నీకు కూడా కొన్నారు అని చెప్తాడు. దీంతో సుమన వాళ్లు కొన్నవి నాకు ఎందుకు అని విసిరేస్తుంది.
ఇక గురువుగారు నయని వాళ్ల ఇంటికి వస్తారు. డమ్మక్కతో అమ్మ కనిపించడం లేదు అని కలవరం లేదు కదా అని అడుగుతారు.
తిలోత్తమ: గుళ్లో ఒకరు కాదు ఏకంగా ఇద్దరు బలైపోతారు అన్న గురువుగారి మాట తప్పింది. ఇన్నాళ్లు జీవానికి నిజం తెలుసు అనుకొన్న జీవానికి కూడా అసలు నిజం తెలీదు అని.
విశాల్: మంచిదే కదా అమ్మా.. ఎవరికీ ఏం జరగలేదు అంటే మంచే కదా.
సుమన: అది సరే బావగారు. మిమల్ని కన్న అమ్మ ఎవరూ అంటే గాయత్రీ పాప వైపు చూపించిన జీవాన్ని ఏం అనాలి.
హాసిని: మెచ్చుకోవాలి..
విక్రాంత్: ఎందుకు వదినా అబద్ధం ఆడినందుకా..
నయని: నేను చెప్తా.. జీవం అన్న ప్రాణం పోనందుకు తనకి నిజం తెలుసు అన్న భ్రమలో కొంత మంది భయపెట్టినందుకు..
ధురందర: మొత్తానికి గురువుగారే అబద్ధాలు ఆడారు అంటారు అంతేనా.. అంతేకదా గాయత్రీ అక్కయ్య జాడ తెలిసినట్లు ఇన్నాళ్లు ఆ జీవం బిల్డప్ ఇచ్చాడు. పోయిపోయి ఆ శాస్త్రగారి మనవరాలే నీ కూతురు అన్నట్లు బుకాయించాడు.
సుమన: నా అనుమానం ఏంటంటే.. శాస్త్రిగారు జీవం ఇద్దరూ కుమ్మక్కై పాప పేరిట వచ్చిన ఆస్తి కొట్టేయాలి అనుకున్నారామో.
తిలోత్తమ: సుమన అన్నదాంట్లో తప్పేముంది. జీవానికి ఒక మందుబాటిల్ ఇస్తే పార్టీ మార్చేస్తాడు. అలాంటిది ఒక రోజు దక్షిణ మొత్తం ఇస్తే ఎం చెప్తే అది వింటాడు.
గురువుగారు: మనుషుల పట్ల నీకున్న నమ్మకానికి, గౌరవానికి జోహార్లు తిలోత్తమ.
మరి నేనొక ప్రశ్న అడగొచ్చా. గుడికి వచ్చిన విశాలాక్షి ఏమైపోయినట్లు..
హాసిని: అడిగితే మొహాలు చూసుకుంటున్నారేంటి అత్తయ్య.
గురువుగారు: నేను అబద్ధం అడినట్లు మీరన్నప్పుడు విశాలాక్షి ఏమైందో అందరూ నిర్థారణకు రావాలి కదా.
నయని: గుళ్లో కలిసిన విశాలాక్షి చెప్పకుండా ఎక్కడికీ వెళ్లిపోదు.
తిలోత్తమ: గారడీ చేసే ఆ పిల్ల మాయమైందో ఏంటో.
డమ్మక్క: మాయం అయిందా మాయం చేశారా..
తిలోత్తమ: ఏమో గురువుగారే అన్నట్లు ఏ ఆపద వచ్చి పోయిందో ఎవరికి తెలుసు.
నయని: అత్తయ్య దయచేసి అలాంటి మాటలు మాట్లాడకుండి.. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.