Anasuya Bharadwaj: ఇంకొకసారి నా జోలికి రావద్దు, ఇదే రిపీట్ అయితే మాత్రం.. - బూతులతో అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్

Anasuya Bharadwaj: ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ.. న్యూ ఇయర్ సందర్భంగా హేటర్స్ కోసం ఒక వీడియోను పోస్ట్ చేసింది. కానీ క్యాప్షన్ మాత్రం సీరియస్ కాదు, జోక్ చేస్తున్నా అని పెట్టింది.

Continues below advertisement

Anasuya: కొంతమంది సినీ సెలబ్రిటీలు తమ పాత్రలకంటే, నటనకంటే కాంట్రవర్సీల వల్లే ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోతుంటారు. వారు ఇచ్చే బోల్డ్, కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్స్ వల్లే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు యాంకర్ అనసూయ భరద్వాజ్. ముందుగా వెండితెరపై నటిగా వెలగాలనుకున్న అనసూయకు ఒక స్టాండప్ కామెడీ షో బ్రేక్ ఇచ్చింది. యాంకర్‌గా ‘జబర్దస్త్’లో మంచి ఫేమ్ సంపాదించుకున్న తర్వాత సినిమా అవకాశాలు అనసూయను వెతుక్కుంటూ వచ్చాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ట్రోలర్స్‌కు బ్యాక్ టు బ్యాక్ పంచులు వేసే అనసూయ.. న్యూ ఇయర్ సందర్భంగా ఒక వీడియోను షేర్ చేసింది.

Continues below advertisement

అనసూయ వెరైటీ న్యూ ఇయర్ విషెస్..
‘జబర్దస్త్’లో యాంకర్‌గా చేస్తున్నప్పటి నుంచి అనసూయ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. తన డ్రెస్సింగ్ గురించి, మాటల గురించి, ప్రవర్తన గురించి ఎవరు ట్రోల్ చేసినా.. వెంటనే వారికి కౌంటర్ ఇచ్చేది. అంతే కాకుండా ఎవరైనా అసభ్యకరంగా కామెంట్స్ చేసినా.. సైలెంట్‌గా ఊరుకోకుండా వారిని తిరిగి సమాధానం చెప్పేది. అలా సోషల్ మీడియాలో అనసూయ చాలా యాక్టివ్ పాత్ర పోషించింది. ‘జబర్దస్త్’ నుంచి యాంకర్‌గా తప్పుకున్నా కూడా సోషల్ మీడియాను మాత్రం వదలలేదు అనసూయ. ఇక న్యూ ఇయర్ సందర్భంగా తన హేటర్స్ అందరికీ డెడికేట్ చేస్తూ ఒక డబ్‌స్మాష్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది అనసూయ భరద్వాజ్.

జోక్ చేస్తున్నా.. సీరియస్ కాదు..
‘‘2023లో నా వల్ల ఎవరైతే ఇబ్బందిపడ్డారో.. నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఎవరినైతే నేను బాధపెట్టానో మీ అందరికీ.. మంచిగయ్యింది. ఇంకొకసారి నా జోలికి రావద్దు. నెక్ట్స్ ఇయర్ కూడా ఇలాగే రిపీట్ చేస్తే దూల తీర్చి దూపమేస్తాను’’ అంటూ ఒక డబ్‌స్మాష్ వీడియోను షేర్ చేసింది అనసూయ. అయితే ఈ వీడియో చూస్తే.. తన హేటర్స్‌కు వార్నింగ్ ఇస్తున్నట్టు ఉన్నా కూడా అది జోక్ అంటూ క్యాప్షన్‌లో పెట్టింది. ‘‘నేను జోక్ చేస్తున్నా. సీరియస్ కాదు’’ అంటూ వీడియో కింద క్యాప్షన్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో కింద నెటిజన్లు చాలా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. కొందరు ఫ్యాన్స్ అయితే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అనసూయకు విషెస్ చెప్తున్నారు.

ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ..
‘రంగస్థలం’ సినిమాతో వెండితెరపై గ్రాండ్‌గా తన కెరీర్‌ను మలుపు తిప్పుకుంది అనసూయ భరద్వాజ్. ఇక తన యాక్టింగ్‌కు ఇంప్రెస్ అయిన దర్శకుడు సుకుమార్.. తన తరువాతి సినిమా ‘పుష్ప’లో కూడా అనసూయకు ఒక కీలక పాత్రను ఇచ్చాడు. అప్పటినుంచి అనసూయకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఏడాదికి కనీసం ఒకట్రెండు సినిమాలు చేస్తూ.. బిజీ అయిపోయింది. అందుకే బుల్లితెరను కూడా పూర్తిగా వదిలేసింది. ప్రస్తుతం అనసూయ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ‘ఫ్లాష్‌బ్యాక్’ అనే తమిళ చిత్రంతో పాటు ‘పుష్ప పార్ట్ 2’లో కూడా నటిస్తోంది అనసూయ. పుష్ప పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2లో తన పాత్రకు మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే రివీల్ చేసింది ఈ బ్యూటీ.

Also Read: ఫౌల్ గేమ్స్ ఆడినవాడిని రన్నరప్ చేశారు, నాగార్జునకు చెడ్డ పేరు వస్తుంది - శివాజీ

Continues below advertisement
Sponsored Links by Taboola