ఇండస్ట్రీలో ఒక్కో హీరోకి ఒక్కో బిరుదు ఉంటుంది. ఈ బిరుదులు ఒక్కోసారి ఫ్యాన్స్ ఇస్తుంటారు.. కొన్ని సార్లు ఇండస్ట్రీలో పెద్దలు ఇస్తుంటారు.. మరికొన్ని సార్లు వాళ్లకు వాళ్లే ఇచ్చేసుకుంటారు. ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరోలను ట్యాగ్స్ తో పిలుస్తుంటారు. ఒక మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్ ఇలా అన్నమాట. ఇవి హీరోల పేర్లకు పర్యాయ పదాలుగా మారిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ ను ఫ్యాన్స్ అంతా పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. సినిమా ఆడియో ఫంక్షన్లు ఎవరివైనా.. పవర్ స్టార్ నినాదాలు వినిపిస్తూనే ఉంటాయి.


Also Read : RC15 Launch: మేం వచ్చేస్తున్నాం.. చెర్రీ - శంకర్ RC15 మూవీ పోస్టర్ ఓ రేంజ్ లో ఉందిగా.. షూటింగ్ ఆరంభం


వెండితెరపై పవర్ స్టార్ అంటూ మెరుపులు చీల్చుకుంటూ అక్షరాలు పడుతున్నప్పుడే ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తుంటాయి. అది ఆ పేరులో ఉన్న మ్యాజిక్. అయితే ఇకపై ఈ మ్యాజిక్ కనిపించదని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ టార్ అనే ట్యాగ్ లైన్ తీసేశారు. 'నా పేరు ముందు పవర్ స్టార్ అనే బిరుదు తగిలించవద్దు' అని పవన్ కళ్యాణ్ దర్శకనిర్మాతలకు చెప్పేశాడట. 


Also Read : Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్‌లో ‘పులిహోర’.. శ్రీరామ చంద్ర మొదలెట్టేశాడు.. ఆ మాటలకు హమీద ఫిదా!


కాబట్టి ఇకపై రాబోయే సినిమాల్లో కేవలం పవన్ కళ్యాణ్ అనే పేరు మాత్రమే ఉంటుంది. 'భీమ్లా నాయక్' లోగోలో కూడా పవన్ కళ్యాణ్ ఇన్ అండ్ యాజ్ అని మాత్రమే ఉంటుంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పాటలో కూడా.. 'గాడ్ ఆఫ్ మాసెస్' అని కొత్తగా ఏదో పెట్టారు గానీ.. పవన్ కళ్యాణ్ అని లేదు. గాడ్ ఆఫ్ మాసెస్ అని పెట్టినందుకు సైతం పవన్ సీరియస్ అయ్యారట. అసలు అలాంటి బిరుదులేవీ వొద్దని క్లియర్ గా చెప్పేశాడట. మరి ఈ విషయాన్ని ఫ్యాన్స్ ఎలా డైజెస్ట్ చేసుకుంటారో చూడాలి. పవన్ ఓ పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా ఎదగడానికి పవర్ స్టార్ ట్యాగ్ అడ్డుపడుతుందని ఏమైనా భావిస్తున్నారా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. మరి పవన్ ఏం ఆలోచిస్తున్నారా ఆయనకే తెలియాలి!


Also Read: బిగ్ బాస్ హౌస్‌లో పిల్లి కోసం లొల్లి.. హమీదా వింత వ్యాఖ్యలు.. అడ్డంగా బుక్కైన జెస్సీ!


Also Read: బిగ్ బాస్‌ 5 స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ 


Also Read: ముఖం పగిలిపోద్ది.. లోబోకి సిరి వార్నింగ్.. ఏడ్చేసిన ఆర్జే కాజల్..