'లవ్ స్టోరీ'లో ఆ సీన్ ఫేక్. .
రీసెంట్ గా విడుదలైన 'లవ్ స్టోరీ' సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో యూత్ కి బాగా కనెక్ట్ అయిన సీన్ 'మెట్రో ట్రైన్ లో కిస్ సీన్'. కోపంగా ఉన్న హీరోకి టక్కున హీరోయిన్ ముద్దుపెడుతుంది. చైతు-సాయిపల్లవి మధ్య తీసిన ఈ సీన్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. తాజాగా ఈ సీన్ గురించి సాయి పల్లవి కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. సినిమాలో నిజంగా ముద్దుపెట్టుకున్నట్లుగా కనిపించినా.. అది ఫేక్ అని చెప్పింది. కెమెరాతో చేసిన చిన్న జిమ్మిక్ అని తెలిపింది. తనకు కిస్ సీన్లలో నటించడం ఇష్టంలేదని.. అందుకే శేఖర్ కమ్ముల కెమెరాలను సెట్ చేసి.. నిజంగానే ముద్దు పెట్టినట్లుగా సీన్ తయారు చేశారని చెప్పింది. తనకు నచ్చని, ఇబ్బంది పెట్టే సన్నివేశాలను శేఖర్ కమ్ముల తీయరని.. తన అభిప్రాయాలను గౌరవిస్తారని చెప్పుకొచ్చింది.
Also Read: ''ఈ చెత్త మన చుట్టూ జరుగుతుందా..? ఛీ'' నాగార్జున కామెంట్స్
చిరు డైరెక్టర్ కి నో రెమ్యునరేషన్..
తెలుగులో దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన 'శక్తి', 'షాడో' లాంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో అతడికి టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. కానీ టాలీవుడ్ పెద్దలతో అతడికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. మొన్నామధ్య చిరంజీవితో సినిమా అనౌన్స్ చేసి షాకిచ్చాడు ఈ డైరెక్టర్. కరోనా సమయంలో చిరు తరఫున బాధ్యత తీసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలను నడిపించడంతో మెహర్ కు మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే గొప్ప అవకాశం దక్కింది. తమిళ హిట్ సినిమా 'వేదాళం'కు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి 'భోళా శంకర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాకి మెహర్ రమేష్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. నెలవారీ జీతం రూ.5 లక్షల చొప్పున తీసుకుంటున్నారట. అలానే సినిమా విడుదలైన తరువాత వచ్చే లాభాల్లో 20 శాతం వాటా తీసుకునేలా ఒప్పందం కుదిరిందట. మరి ఈ సినిమాతో మెహర్ రమేష్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!
Also Read: ప్రెస్ క్లబ్ వద్ద పోసానిపై దాడికి పవన్ ఫ్యాన్స్ ప్రయత్నం..పోలీసు రక్షణతో తరలింపు !
Also Read:ట్రెండింగ్ లో #JusticeforPunjabiGirl
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి