మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్'(God Father) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను, కొన్ని పాటలను విడుదల చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 


రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందించగా.. అనుదీప్, ఆదిత్య అయ్యంగార్, రఘురాం, సాయి చరణ్ ఇలా చాలా మంది సింగర్స్ కలిపి ఈ పాటను పాడారు. చిరు స్థాయికి తగ్గట్లుగా ఈ సాంగ్ ఉంది. లిరిక్స్ ద్వారా సినిమాలో చిరు క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చెప్పే ప్రయత్నం చేశారు. 



పాటల సంగతి పక్కన పెడితే... ఇటీవల 'నేను రాజకీయానికి దూరం అయ్యాను. కానీ, రాజకీయాలు నాకు దూరం కాలేదు' అంటూ ట్విట్టర్ వేదికగా చిరంజీవి విడుదల చేసిన డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించింది. సినిమాలో భాగంగా ఆ డైలాగ్ ఉన్నప్పటికీ... నిజ జీవితంలో ఆయన రాజకీయ ప్రయాణానికి కొంత మంది అన్వయించుకున్నారు.


క్లైమాక్స్ కోసం స్పెషల్ ఫైట్:


'గాడ్ ఫాదర్' కోసం చిరంజీవి ఫస్ట్ టైమ్ లుక్ చేంజ్ చేశారు. హీరోయిన్, డ్యూయెట్స్ లేకున్నా సరే... సినిమా చేశారు. అయితే... ఆయన నుంచి ప్రేక్షకుల కోరుకునే అంశాలు సినిమాలో ఉన్నాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ మామూలుగా ఉండదని సత్యదేవ్ అంటున్నారు. ఇక... చిరు, సల్మాన్, సత్యదేవ్ మీద తెరకెక్కించిన క్లైమాక్స్ ఫైట్ విపరీతమైన 'హై' ఇస్తుందట. మలయాళంతో పోలిస్తే... ఆ ఫైట్ డిఫరెంట్ గా తీశారట. క్లైమాక్స్ ఫైట్ ఒక్కటే కాదు... కథ పరంగానూ 'లూసిఫర్'తో పోలిస్తే కొన్ని మార్పులు చేసి 'గాడ్ ఫాదర్' తెరకెక్కించారని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కథకు ఏమాత్రం అడ్డు పడకుండా మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని కొన్ని కమర్షియల్ అంశాలు యాడ్ చేశారట.


ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరు సోదరిగా నయనతార (Nayanthara) కనిపించనున్నారు. ఆమెకు భర్తగా ప్రతినాయకుడి పాత్రలో సత్యదేవ్ (Satyadev Kancharana), ఇతర కీలక పాత్రల్లో సునీల్, సముద్రఖని నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి నీరవ్ షా ఛాయాగ్రాహకుడు, సురేష్ సెల్వరాజన్ కళా దర్శకుడు. తమన్ సంగీతం అందించారు. 


Also Read: 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్‌లో 'Disappointed' హ్యాష్ ట్యాగ్!


Also Read: ప్రభాస్, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో త్రివిక్రమ్ సినిమాలు - రివీల్ చేసిన నిర్మాత!