నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి నోరు జారారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళ తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ అనే ఈవెంట్ లో పాల్గొన్నారు ప్రకాష్ రాజ్.. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీని కించపరుస్తూ మాట్లాడారు. ఆయప కామెంట్స్‌పై ‘కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సైతం ఘాటుగానే స్పందించారు. 


అర్బన్ నక్సల్స్ కు నిద్రలేకుండా చేస్తోంది- అగ్నిహోత్రి


ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ ను అంధకార్ రాజ్ గా అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రకాష్ రాజ్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ, కౌంటర్ ఇచ్చారు. “దేశ ప్రజలు ఆదరించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా అర్బన్ నక్సల్స్‌కు నిద్రలేకుండా చేసింది. వీక్షకులను మొరిగే కుక్కలు అని పిలుస్తూ సినిమా రిలీజైన ఏడాది తర్వాత కూడా ఇబ్బంది పెడుతున్నారు. మిస్టర్ అంధకార్ రాజ్.. ‘భాస్కర్’ అవార్డు ఎప్పటికీ మీదే అయినప్పుడు నేనెలా పొందుతాను” అంటూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






ఇంతకీ ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే?


ఇటీవ కేరళలో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ అనే ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్‌ రాజ్‌ ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ మూవీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీని పొగిడే క్రమంలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించి ప్రస్తావించారు. ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ ఓ చెత్త సినిమా అని, ఆ సినిమాపై ఇంటర్నేషనల్​ జ్యూరీ ఉమ్మివేసిందని పేర్కొన్నారు. ‘పఠాన్’ సినిమాను బ్యాన్ చేయాలని కొంత మంది ఇడియట్స్ అన్నారని, ఇప్పుడు ఆ సినిమా రూ.700 కోట్లకు పైగా వసూలు చేసి దూసుకుపోతుందని అన్నారు. ‘పఠాన్’ సినిమాను బ్యాన్ చేయాలని గోల చేసినవారే.. మోడీ సినిమాకి కనీసం రూ.30 కోట్ల కలెక్షన్స్ కూడా ఇవ్వలేకపోయారు అని విమర్శించారు. అలాంటి కుక్కలు మొరుగుతాయే తప్ప కరవవు అని అన్నారు. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ అనే సినిమాను ఎవరు నిర్మించారో అందరికీ తెలుసని ప్రకాష్ రాజ్ చెప్పారు. అంతర్జాతీయ జ్యూరీనే వారిపై ఉమ్మివేసింది. అయినా కూడా సిగ్గులేకుండా ఆ సినిమా దర్శకుడు ఆస్కార్ ఎందుకు రాదు? అని అడిగారు. ఆ సినిమాకు కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదని కామెంట్ చేశాడు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభించింది. కొంత మంది ఆయన మాటలను సమర్థించగా మరికొందరు తీవ్రంగా విమర్శించారు.


Read Also: ఆనంద్ మహీంద్రాను కలిసిన చెర్రీ - థాంక్యూ కేటీఆర్ అంటూ ట్వీట్!