Telangana Hight Court Shock To Venu Swamy: జ్యోతిషుడు వేణు స్వామికి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. గతంలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళలకు నిశ్చితార్థం జరిగిన సమయంలో... వారిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటారని వేణు స్వామి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. దీంతో వేణు స్వామిపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్... మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో తమ ముందు విచారణకు హాజరు కావాలని వేణు స్వామిని మహిళా కమిషన్ ఆదేశించింది.
మీకు అధికారం లేదంటూ స్టే...
అయితే వేణు స్వామి మాత్రం మహిళా కమిషన్‌కు తనపై చర్య తీసుకునే అధికారం లేదని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఈ స్టేను ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఎత్తివేసింది. వేణు స్వామిపై తగిన చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్‌కు న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతే కాకుండా వారం రోజుల్లోనే వేణు స్వామిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా మహిళా కమిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
Also Read: ప్రెస్‌మీట్‌కు తాగి వచ్చిన నటుడు... పిచ్చి పిచ్చి మాటల వెనుక కారణం అదేనా?
అసలేం జరిగింది?
నాగచైతన్య, శోభిత ధూళిపాళలపై చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో వేణుస్వామిని వివరణ కోరుతూ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అందజేసిన ఫిర్యాదు మేరకు మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ వేణు స్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఎంగేజ్మెంట్ రోజు నుంచే మొదలు పెట్టిన వేణు స్వామి
నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం చేసుకున్న రోజునే వేణుస్వామి రంగంలోకి దిగారు. కేవలం మూడేళ్లలోనే వీరిద్దరూ విడిపోతారంటూ జోస్యం చెప్పారు. మరో మహిళ ప్రమేయం కారణంగా 2027లో ఈ జంట విడిపోతారని చెప్పి పెద్ద వివాదానికి బీజం వేశారు. వీరిద్దరి జాతకాలను వేణు స్వామి విశ్లేషణ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ఆధారంగా తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసొసియేషన్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో వేణు స్వామికి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో వేణు స్వామి పిటిషన్ వేశారు. మరి మహిళా కమిషన్ వివాదాస్పద వేణు స్వామిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి!
Also Read: నాగార్జున కంటే ఎన్టీఆర్, నాని బెటర్ - ముందు ఆయన్ను మార్చేయాలి... స్పై అక్క సీరియస్